Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 32

    పావుగంట తర్వాత, అతను ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయేముందు నాకు దగ్గరగా వచ్చాడు.
   
    "నా ప్లాట్ కి ఎప్పుడొస్తారు-" అని అడిగాడు.
   
    "ఎందుకు-" అడిగాను నేను.
   
    "మీ నగ్న అందాలు.... క్యాబినెట్ సైజులో ఫోటోలుగా నా బెడ్ రూమ్ లో అలంకరించబడి వుంటాయి....మిమ్మల్ని, మీరు చూసుకోవాలను కున్నప్పుడు నా రూమ్ కి రావచ్చు. అని నవ్వాడతను." చెప్పడం ఆపింది మిస్ మాయాదేవి.
   
    "దిసీజ్ ఇన్ స్క్రుప్యులస్...." అన్నారు జస్టిస్ ప్రమీలారాణి.
   
    "ఆర్యూ బిలీవింగ్...." అడిగాడు జస్టిస్ మెహతా.
   
    ఒక ఆడపిల్ల, ఒక అరుదైన నగ్న సందర్భాన్ని పూర్తిగా విడమర్చి చెప్పడం, అక్కడున్న లాయర్లకు వింతగా అనిపించింది, యిదంతా నిజమేనా-?"
   
    లాయర్ మాలవ్యకు కూడా మనోహర్ మీద అనుమానం వస్తోంది. అతను పైకి కనిపించేటంత అమాయకుడు కాదేమో! అనవసరంగా అతని కేసును తను 'టేకప్' చేసిందేమో! హిప్నటిస్టు ద్వారా, సైక్రియాటిస్ట్ ద్వారా అతన్ని టెస్ట్ చేయిస్తే-! ఆలోచిస్తోందామె.
   
    "చెప్పండి-" అంది మాలవ్య తేరుకుని మాయాదేవి వేపు చూస్తూ.
   
    ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత, ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫోన్ వచ్చింది.
   
    "మాయాదేవీ...మిమ్మల్ని నేను అల్లరి చెయ్యడంలేదు. ప్రేమిస్తున్నాను. కాలేజీ కుర్రాడిలా, వాళపోస్టర్ మీద అర్ధనగ్నపు తారల్ని చూసి, ప్రేమించే ప్రేమ కాదు. రియల్ లవ్...అలాగే మీ పరువు తీసే ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటారా- ప్రేమ....ఆరాధన_శారీరక ఆకర్షణ లోంచి మొదలై లైంగిక ఆకర్షణగా మారుతుంది. లైంగిక ఆకర్షణ శారీరక కలయికగా మారుతుంది. ఆ శారీరక కలయికతర్వాత నిజమైన ప్రేమ, అనుభూతి ఏర్పడుతుంది."
   
    "సో! అయ్ లైక్ యువర్ బాడీ.... అండ్ బాడీ లాంగ్వేజ్....తరువాత సెక్స్-!" మనోహర్.
   
    "మీ బెడ్ మీదకు, మీరే నన్ను ఆహ్వానించాలి. ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను. ఎందుకో తెలుసా.....మగవాడికి, ఓ ఆడదానితో రేప్ ఎప్పుడూ సుఖంగా వుండదు. సంతృప్తి నివ్వదు. మీరు ఇన్ వైట్ చెయ్యలేదనుకోండి....రేప్ తప్పదు!" అన్నాడు మళ్ళీ.
   
    ఈ విషయాలానే చెప్పి కళ్ళు మూసుకుని తల దించుకుంది మిస్ మాయాదేవి.
   
    వెంటనే విసురుగా నిలబడ్డాడు మనోహర్.
   
    "యువరానర్... షి ఈజ్ లైయ్యింగ్....పచ్చి అబద్దాలకోరు డోన్ట్ బిలీవ్ హర్...." అరిచాడతను.
   
    "మిస్టర్....కంట్రోల్ యువర్ సెల్ఫ్. డోంట్ షౌట్ హియర్-" అన్నారు జస్టిస్ మెహతా.
   
    మనోహర్ మరేమీ మాట్లాడలేదు.
   
    కానీ ఆడవాలల వికృత ప్రవర్తన ఎలా వుంటుందో, మొట్టమొదటిసారి అర్ధమైంది. అతనికి క్రైమ్ కథలంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడూ డెబనెయిర్, ఫాంటసీలోని కథల్ని చదువుతుంటాడతను.
   
    అందులోని కథలకన్నా, మాయాదేవి చెప్పినా కథ హారిబుల్....ఇంత క్రుకుడ్ క్రియేటివిటీ మాయాదేవిలో వుందా....? సున్నితమయిన మనస్సుకు, స్త్రీ హృదయం నిలయం అని అంటారు. కానీ, అదంతా అబద్దమేనా....?
   
    ఈ అబద్దాలతో తనకెందుకీ పోరాటం?
   
    ఒక్క క్షణం ఎంతో నిరాశా, నిస్పృహలకు లోనయ్యాడు మనోహర్. అంతలోనే తేరుకున్నాడు.
   
    తన పోరాటం వెనుక, అంతులేని మమకారం వుంది.
   
    నమ్మకం వుంది.
   
    ఆ పోరాటానికి బలమయిన పునాది....కృతజ్ఞత-!
   
    అతని కళ్ళముందు ఒక్కసారి మేనమామ కుటుంబరావు మెదిలాడు. కుటుంబరావు కూతురు సరోజ మెదిలింది.
   
    తన గురించి సరోజ ఏమనుకుంటోంది? ఆ ప్రశ్న దగ్గరికొచ్చినప్పటికి మనోహర్ ఆలోచనలు చప్పున ఆగిపోయాయి.
   
    అంతలోనే కోర్టు వాదనలు వాయిదా పడ్డాయి.
   
    మరునాడు ఆదివారం.
   
    కోర్టు బైటికొచ్చి, తన హీరోహోండా వేపు నడుస్తున్న మనోహర్, అక్కడ కనిపించిన వ్యక్తుల్ని చూడగానే, చిరునవ్వు నవ్వుతూ విష్ చేశాడు.
   
    అక్కడ నలుగురు వ్యక్తులు అతని కోసం ఎదురుచూస్తున్నారు.
   
    ఇద్దరు ఆఫీసులో కొలీగ్స్.
   
    మరో ఇద్దరు తన ఫ్రెండ్స్....ఒకప్పటి క్లాస్ మేట్స్.
   
    సెక్రటేరియట్ లో పనిచేస్తుంటారు.
   
    కాసేపు కబుర్లయ్యాక.
   
    "కాసేపు బార్లో రిలాక్స్ అవుదాం_" మనోహర్ ప్రమేయం లేకుండానే ప్రపోజ్ చేశాడు తృష్ణవేలు అనే మిత్రుడు.
   
    కాదనలేకపోయాడు మనోహర్.
   
                                       *    *    *    *

   
    ఊరు శివార్లలో ఉప్పల్ దాటాక, వరంగల్ కు వెళ్ళే దారిలోనున్న దాబా కమ్ బార్లో కూర్చున్నారు మిత్రులందరూ.
   
    ఫుట్ బాటిల్ రాయల్ ఛాలెంజ్ తో పాటు వెజిటబుల్ సలాడ్, జీడిపప్పు ప్లేట్లలో వచ్చాయి.
   
    మనోహర్ కోసం థమ్సప్ వచ్చింది.
   
    అందరికీ గ్లాసులో డ్రింక్ వేసి, షోడా కలిపాడు రెహమాన్ అనే ఫ్రెండ్.
   
    చీర్స్ కొట్టి సిప్ చేశాక, బాతాఖానీలో పడ్డారందరూ.
   
    "ఒరేయ్...మనోహర్.....మంచికో, చెడ్డకో నువ్వు రాష్ట్రంలో హీరో అయిపోయావురా. కానీ, నాకో చిన్న డౌట్..." సిగరెట్ వెలిగిస్తూ పీటర్ అనే ఫ్రెండ్ అన్నాడు.
   
    "నీ డౌట్ తరువాత, నాక్కూడా ఓ డౌట్ వుంది. నువ్వు ముందడుగు-" అన్నాడు పటేల్ అనే ఫ్రెండ్.

 Previous Page Next Page