Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 31

                                           *    *    *    *
   
    సరిగ్గా పదకొండు గంటలకు కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి.
   
    "చెప్పండి మిస్ మాయాదేవి! లిఫ్ట్ లో మిస్టర్ మనోహర్ ని చూశారని మీరూ ఒప్పుకున్నారుకదా- ఆ తర్వాత  ఏం జరిగింది?" అడిగింది లాయర్ మాలవ్య.
   
    జస్టిస్ మెహతా, జస్టిస్ ప్రమీలారాణిల ఎదుట వున్న టేప్ రికార్దరు స్టార్టయ్యింది.
   
    మాయాదేవి చెప్పడం ప్రారంభించింది.
   
    "సరిగ్గా ఆరునెలల క్రితం. లిఫ్ట్ లో మొట్టమొదటిసారి మనోహర్ ని చూశాను. మూడు రోజుల తర్వాత, కారు పార్కింగ్ దగ్గర అతను నాకు కన్పించాడు. నవ్వాడు....నేను నవ్వలేదు. తర్వాత నన్ను ఫాలో అయి సూపర్ మార్కెట్ కి వచ్చాడు. అప్పుడతను నా దగ్గరికొచ్చి_
   
    మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా....అని అన్నాడు.
   
    అతనివేపు కోపంగా చూసి వెనక్కి వచ్చేశాను. తర్వాత ఒక రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో నేను స్టార్ టి.వి లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ ప్రోగ్రామ్ చూస్తున్న సమయంలో ఫోన్ మోగింది. ఆ సమయంలోనాకు ఫోన్ చేసేవారెవరు అని అనుకుంటూ ఫోన్ రిసీవరు అందుకున్నాను" చెప్పడం ఆపింది మాయాదేవి.
   
    "మిస్ మాయాదేవీ! ఆరోజు ఏ రోజో, ఏ తేదీయో జ్ఞాపకం వున్నాయా?" అడిగింది మాలవ్య.
   
    "చెప్పగలను. మార్చి 2...ఎందుకంటే మా కంపెనీ పేడే అది_" చెప్పింది మాయాదేవి.

    "సంఘటన వివరాలు చెప్పండి...." అంది మాలవ్య.
   
    "హలో....నేనే!" అన్నాడతను.
   
    "నా ఫోన్ నెంబర్ కనుక్కొని, అతను నాకు ఫోన్ చెయ్యడం సరదా అనిపించింది. నీకు తెలుసా? రేఖలాంటి అందం నీది...అప్పటికీ- ఇప్పటికీ...." అని తన సంభాషణను కొనసాగించాడు మనోహర్.
   
    "అయితే..."
   
    "మనోహర్ నాతో మాట్లాడిన మాటల్ని యథాతథంగా చెపుతున్నాను. యువరానర్..." అంది మాయాదేవి.
   
    "చెప్పండి....."
   
    "బాత్ రూమ్ లో, దుస్తులన్నీ విప్పేసి, మీరు షవర్ బాత్ చేస్తున్నప్పుడు మీరెలా వుంటారో, వూహించుకుంటుంటే నాకెంతో థ్రిల్లింగ్ గా వుంటుందో తెలుసా? మీరలా వున్నప్పుడు....మీ ఎర్రటి పెదాలను ముద్దుపెట్టుకుంటే ఎలా వుంటుంది? అని అన్నాడు మనోహర్.
   
    వెంటనే నేను ఫోన్ పెట్టేశాను. మనోహర్ అలా మాట్లాడతాడని నేనూహించలేదు.
   
    మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నా పేరు మీద ఒక గిఫ్ట్ ప్యాకెట్ ను రెసిడెన్స్ సెక్యూరిటీ గార్డ్ ద్వారా పంపాడు మనోహర్."
   
    "అందులో ఏం వుంది?" అడిగారు మహిళా జడ్జి ప్రమీలారాణి.
   
    "బ్రా...." వెంటనే చెప్పింది మాయాదేవి. సిగ్గుపడ్డారు- ప్రమీలారాణి. తల దించుకుందామె ఆ ప్రశ్న ఎందుకేశానా అన్నట్టుగా.
   
    "పింక్ కలర్ బ్రా....ఆ మరుక్షణంలోనే మనోహర్ దగ్గర్నించి నాకు ఫోన్ వచ్చింది....గిఫ్టు అందింది కదా....మీకు కొంచెం లూజ్ అవుతుందేమో...ఈసారి నాకు ప్రాబ్లమ్ ఉండదు. మీ సైజు నాకు తెలుస్తుందికదా" అన్నాడు.
   
    "అప్పుడు మీరేమన్నారు?" అడిగింది మాలవ్య.
   
    "నేనేమంటాను....ఫోన్ కట్ చేశాను." కొంచెం కోపాన్ని వ్యక్తం చేస్తూ చెప్పింది మాయాదేవి.
   
    "తర్వాత..."
   
    "ఒకరోజు బాత్ రూమ్ లోంచి, టవల్ చుట్టుకుని, బయటికొచ్చి బెడ్ రూమ్ లోకి ప్రవేశించాను....అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరున్న మనోహర్ ని చూడగానే భయపడ్డాను. నా బెడ్ రూమ్ లో మనోహర్ అలా రాగలడని నేనూహించలేదు.
   
    కెవ్వున అరచి, బయటికెళ్ళిపోయాను....అతను పరుగు, పరుగున నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
   
    మీ అందాన్ని చూస్తాను.....తప్ప మిమ్మల్నేమీ చెయ్యను. కాలేజీ రోజుల్నుంచి మీరంటే నాకు పిచ్చి యిష్టం....అయ్ లైక్ యువర్ బాడీ షేప్స్....ఆడవాళ్ళ నగ్నదేహాల్ని చూడాలనే ఆకాంక్ష తప్ప, వాళ్ళనేమీ చెయ్యాలనే కోరిక నాకెప్పుడూ వుండదు. సో.....
   
    "మీరిప్పుడో పని చెయ్యాలి. నా ఎదురుగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే....నేను ఫోటోలు తీసుకుంటాను. ఎప్పటినుంచో మీ నగ్నదేహాన్ని ఫోటో తియ్యాలని నా కోరిక- అని అన్నాడు.
   
    "అప్పుడు మీరేం చేశారు-" అడిగింది మాలవ్య.
   
    "నువ్విప్పుడు బయటకు వెళ్ళకపోతే..... పోలీసుల్ని పిలుస్తాను." గట్టిగా అన్నాను.
   
    అతను నా మాటల్ని లక్ష్యపెట్టలేదు.
   
    "మర్యాదగా నువ్వు, నేను చెప్పినట్టు చెయ్యకపోతే నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతావు..... నీ దేహంమీద నాకున్న కోరిక అలాంటిది. నిన్ను చంపేసి, ఆ శవానికి ఫోటోలు తీసుకుని హాయిగా వెళ్ళిపోతాను. నువ్వు పోలీసులకు రిపోర్ట్ చేస్తే.... నువ్వె నన్ను రమ్మన్నావని సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను_" అన్నాడతను.
   
    ఆ సమయంలో అతను చెప్పినట్టుగా చేయడం తప్ప నాకు గత్యంతరం లేకపోయింది. అతను మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. నేను డ్రెస్సింగ్ టేబుల్ ముందుకెళ్ళి, వంటికి చుట్టుకున్న టవల్ ని కిందకు జార్చాను. ఆ నగ్నమైన, ఎర్రటి దేహం వేపు, అతను ఆకలిగా చూడడం ప్రారంభించాడు.
   
    తర్వాత నేను ఎల్లో కలర్ బ్రా అందుకుని, వేసుకాబోతుండగా, నా వంటికి బ్లూకలర్ బ్రా మ్యాచ్ అవుతుందని, మనోహర్ కామెంట్ చేశాడు. బ్రా, తర్వాత లంగా వేసుకున్నాక, తర్వాత చీర, జాకెట్టు వేసుకున్నాను.
   
    అతను నన్ను ఫోటోలు తీస్తూనే వున్నాడు.

 Previous Page Next Page