సమాధానం చెప్పలేదు మాయాదేవి.
"పెదవులమీద" కాసేపయ్యాక నెమ్మదిగా అంది మాయ.
"వెరీగుడ్! గట్టిగానా....నెమ్మదిగానా?"
"జ్ఞాపకం లేదు."
"అంటే యువర్ ఆనర్....ఒన్ టంగ్ డీప్ లీ పెన్ ట్రేట్స్ ఎ లవర్స్ మౌత్, ఈజ్ ఏన్ ఆల్ మోస్ట్ ఫర్ ఫెక్ట్ మిమిక్ ఆఫ్ ఇంటర్ కోర్స్....సో ఇట్స్ యాన్ అఫెన్స్" అంటూ మాలవ్య జడ్జి మెహతా వేపు చూసింది.
"మిస్ మాయాదేవీ! కిస్సింగ్ అఫెన్స్ అని నీకు తెలీదా?" జడ్జి మెహతా అడిగారు మాయని.
"తెలీదు" వెంటనే జవాబు చెప్పింది మాయ.
"అంటే....ఆ విషయం తెలీని అమాయకురాలివా? ఆ వయసు నీకు రాలేదనా?"
ఆ మాటకు మాయాదేవికి కొంచెం కోపం, కొంచెం చిరాకూ కలిగాయి.
"మిస్టర్ జస్టిస్...ముద్దు ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ లవ్. ఆ ప్రేమగానీ, ఆ ముద్దుగానీ నేరంకాదు. అమెరికాలో నడిరోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ యువతీ, యువకులు, ప్రేయసీ, ప్రియుల ముద్దు దృశ్యాలు మనకు సహజంగా కనిపిస్తాయి. మన భారతదేశంలో, అరబ్ దేశంలో ముద్దు రహస్య ప్రక్రియ అని నాకు తెలుసు. చైనాలో ముద్దు oral Chastity.....అంత మాత్రంచేత ముద్దును ఎవరూ నిషేధించలేదు.
"మీకు తెలుసో తెలీదో 1978లో "Love Sublime"అని హిందీలో ఒక సినిమా వచ్చింది. ఒక భర్త, భార్యల మధ్య ముద్దు సీన్లు ఉన్న చిత్రం అది. ఆ ముద్దు సీన్లు తొలగించమని పెద్ద ఉద్యమాలు జరిగాయి. అలాగే హిందీ సినిమా నటి రేఖ బిశ్వజిత్ ను ముద్దు పెట్టుకుని, సెన్సేషనల్ స్టార్ గా ఎదిగిపోయింది. అది మీడియా ముద్దు.
బహిరంగంగా జరిపే ఇంటర్ కోర్సు కూడా కొన్ని ఆదిమ దేశాల్లో నేరంగా పరిగణించరు. అలాంటప్పుడు ముద్దును ఇంటర్ కోర్స్ గా భావించడం నేరం...." మాయాదేవితో వాదనకు కూర్చున్న లాయర్లు ఆమె వేపు చూశారు.
జస్టిస్ మెహతా వేపు చూపింది లాయర్ మాలవ్య. మిస్ మాలవ్య, మెహతా, పేపర్ మీద ఏదో నోట్ చేసుకుని "టాపిక్ మార్చండి" అని చెప్పాడు.
"ఓ.కే. యువరానర్! మిస్ మాయ ఆ సమయంలో కొంత ఇన్ టాక్సికేషన్ కి లోని వుందని....నా క్లయింట్ చెప్పిన విషయాన్ని బట్టీ మిస్ మాయను కొన్ని ప్రశ్నలు వేయదలచుకున్నాను."
"ఓ.కే. ప్రొసీడ్" జస్టిస్ మెహతా అన్నారు.
"మిస్ మాయా! ఏకాంతంగా మీరు రూమ్ లో వున్న సమయంలో మిస్టర్ మనోహర్ ఆ రూమ్ లోకి వచ్చారు. రాగానే మీరు ఆయనతో కొంత సంభాషణ జరిపిన తరువాత ఆయన కుడి చేతిని పట్టుకున్నారు. అవునా?"
"అవును..."
"అప్పుడు మీ బిహేవియర్ లో నా క్లయింట్ కు కొన్ని Obscene Signals కనిపించాయి. వెంటనే తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. కదా....ఆ సిగ్నల్స్ మీకు జ్ఞాపకం వున్నాయా?"
"అబ్ సీన్ సిగ్నల్స్ అంటే?" మామూలుగా ప్రశ్నించింది మాయ.
"అబ్ సీన్ సిగ్నల్స్ ఆర్ సెక్సువల్ యాక్షన్స్ విచ్ కాజ్ అఫెన్స్ టు దోజ్ హు విట్ నెస్ దెమ్...అర్ధమైందా?" అంటూ జస్టిస్ మెహతా వేపు చూసింది మాలవ్య.
"క్యారీయాన్" అన్నారాయన.
"మిస్టర్ జస్టిస్! అబ్ సీన్ సిగ్నల్స్ ప్రధానంగా రెండు రకాలుగా వుంటాయి. మొదటిది స్నేహ పూర్వకమైన వాంఛనీయత కాగా, రెండోది కాంక్షాపూరితమయిన లైంగిక ప్రేరణ. ఈ రెండో ప్రక్రియకు మీరు పాల్పడారు....
మీరు మా క్లయింట్ చేతుల్ని పట్టుకుని, మొదట మీ గుండెలకు రాసుకుంటూ- "నీ చేతులు ఇంత గట్టిగా వుంటాయా?" అని అన్నారు. "ఈ చేతులతో నన్ను నువ్వు గట్టిగా, నీ గుండెలకు అదుముకుని ఒక్కసారి ఒకే ఒక్కసారి....కౌగిలించుకోవా?" అని అడిగారు. మూడు. "నేను నిన్నలా చేస్తే నీ కిష్టమేనా?" అని అడిగారు. నాలుగు. "ఇక్కడెవ్వరూ లేరుకదా__నన్ను కౌగిలించుకో...." అని అన్నారు. కౌగిలించుకోకపోతే గట్టిగా అరిచి గొడవ చేస్తానన్నారు ....అవునా...ఇంకా చాలా విధాలుగా నా క్లయింట్ ను మీ చర్యలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.
మిగతా వివరాలు ఈ పేపర్స్ లో వున్నాయి. యువరానర్! వీటిని అందజేస్తున్నాను" అంటూ లాయర్ మాలవ్య ఒక గ్రీన్ ఫోల్డర్ కోర్టు క్లర్కుకు అందివ్వగా, ఆ ఫైల్ ను కోర్టు క్లర్క్ జస్టిస్ మెహతాకు అందించాడు.
జస్టిస్ మెహతా ఆ పేపర్స్ ను ఒకసారి తిరగేసి లాయర్ ఆదిత్య వేపు చూశాడు. సీట్లోంచి లేచి, వొంగి జస్టిస్ మెహతాకు అభివాదం చేసి-
"అయ్ వాంట్ టు ఇంటరాగేట్ మిస్టర్ మనోహర్! యువరానర్" అన్నాడు.
"ఎస్ ప్రొసీడ్" అన్నారు జస్టిస్ మెహతా.
"మిస్టర్ మనోహర్! జరిగిన సంఘటనలు కానీ, మీరు చెప్పాల్సిన విషయాలు కానీ మొహమాటంలేకుండా చెప్పండి. ఇక్కడ సిగ్గుపడితే మీరు అపరాధిలా మిగిలిపోతారు" అన్నాడు ఆదిత్య.
"ఎలాంటి విషయాలనైనా నిర్మొహమాటంగా చెప్పొచ్చా?" అడిగాడు మనోహర్.
"అందుకే కదా....ఈ స్పెషల్ కోర్టు" అన్నాడతను.
మనోహర్ నోటి వెంబడి ఎలాంటి ఆసక్తికరమయిన విషయాలొస్తాయోనని అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.
గుండుసూది కిందబడితే వినిపించేటంతటి నిశ్శబ్దం అలముకుంది అక్కడ.