Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 26

    "చెప్పటమేమిటి....?" ఆమె కౌగిలించుకోమంటేనే కౌగిలించుకున్నాను...." తన మీద తనకే కోపం వస్తుండగా అన్నాడు మనోహర్.
   
    "మరందుకే నాకు చెడ్డ చిరాకు వచ్చేది ఆమె కౌగిలించుకోమంటేనే కౌగిలించుకున్నాను...." తన మీద తనకే కోపం వస్తుండగా అన్నాడు మనోహర్.
   
    "మరందుకే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. ఆమె కౌగిలించుకోమని అడిగితే, అందమయిన ఆడపిల్లను ఎవరయినా ఎంత మృదువుగా కౌగిలించుకుంటారో నాకు తెలియదనుకోకు....నువ్వు పుట్టి బుద్దెరిగాక ఆడపిల్లనే చూడనట్లు పచ్చడి అయ్యేలా, పనికిరాకుండాపోయేలా, భీమున్ని ధృత రాష్ట్రుడు కౌగిలించుకున్నట్లుగా చేస్తావా?"
   
    దుర్గాప్రసాద్ ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు మనోహర్ కి. బిక్క మొహం వేసి బేలగా చూశాడు అతని వేపు.
   
    "చెప్పు...సమాధానం చెప్పు" మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు దుర్గాప్రసాద్.
   
    "ఆకాశంలో సగభాగానికి జేజేలు ఎందుకు పలకాలో తెలియాలంటే నన్ను కౌగిలించుకో, అని ఆమె నన్ను అడిగింది అందుకే కౌగిలించుకున్నాను" ఎంతో నిజాయితీగా చెప్పాడు మనోహర్. అప్పటికే అతడ్ని అతనే చెడామడా తిట్టేసుకుంటున్నాడు లోలోపల.
   
    "ఏంటి బాబూ....ఆకాశంలో సగభాగం-దానికి జేజేలు పలకటం....ఆ జేజేలు ఎందుకు పలకాలో తెలుసుకోవాలంటే ఆడపిల్లలను కౌగిలించుకోవాలి. అంతేనా? అసలాకాశంలో ఆ సగభాగంలో ఏముంది? తెలుసుకోవలసిన అవసరం నీకేముంది? మార్కెటింగ్ వింగ్ లో ఉద్యోగం చేసే నీకు ఆకాశంలో సగభాగం గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది. దానికి, నీ ఉద్యోగానికీ సంబంధం ఏమిటీ?" తిరిగి నిలదీశాడు దుర్గాప్రసాద్.
   
    తనను తాను చెడామడా తిట్టుకునే కార్యక్రమంలో పడిపోయాడు మనోహర్. ఆ గొడవలో పడిపోయి కోర్టు కెళ్ళాల్సిన విషయాన్నే మరిచిపోయాడు.
   
    అలా మనోహర్ మరిచిపోయేలా చేయటమే అతని పని__ఆ పని అతనికి కేటాయించింది మిస్ మాయాదేవి.
   
    విషయం ఒక్క దుర్గాప్రసాద్ కే తెలుసు.
   
    "నా ఖర్మ....ఇలాచేస్తే అలా ఏదో తెలుస్తుందని ఆ రాక్షసి చెప్పటమేమిటీ.....నేను వెనుకా ముందూ చూసుకోకుండా ఆమెని కౌగిలించుకోవడం ఏంటీ? ఏంటో నాకేం అర్ధమయిచావటంలేదు" జుట్టంతా పిచ్చి పిచ్చిగా చెరిపేసుకుంటూ ఏడుపు ముఖంతో అన్నాడు మనోహర్.
   
    వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు దుర్గాప్రసాద్!
   
                                          *    *    *    *
   
    ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆ కోర్టులో కోర్టు సిబ్బంది ఉత్కంఠ భరితంగా లాయర్ల వేపు, జడ్జివేపు చూస్తున్నారు.
   
    యధావిధిగానే విలేఖరులకు ప్రవేశంలేదు. ఆయా టి.వీ. ఛానల్స్ కు చెందిన వ్యక్తులందరూ వరండామీద, మెట్లమీద నిలబడి ఒకరితో ఒకరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
   
    మల్టీకోర్ బిజినెస్ తో, దేశంలోనే పేరెన్నికగన్న ఒక పేరు మోసిన కంపెనీ ఎం.డి.మీద, అందులో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగి కేసు వెయ్యడం!
   
    కొంతమంది కోర్టులోని వ్యక్తుల ద్వారా ఆ కేసు స్త్రీ పురుషుల మధ్య సంబంధానికి' చెందినదని బైటకు పుకార్లు వచ్చాయి.
   
    స్త్రీ పురుషులమధ్య సంబంధం...అంటే...లీగల్ కనెక్షనా.....?ఇల్లీ గల్ కనెక్షనా.....? లీగల్ కనెక్షన్ అయితే ఆ కేసు ఎందుకు వస్తుంది?
   
    ఇల్లీగల్ కనెక్షన్ కావచ్చు.
   
    ఒక లేడీ ఎం.డి.కి, ఒక ఉద్యోగికి మధ్య కేసంటే...ఏమయి వుంటుంది? ఇలా రకరకాలుగా కోర్టు కారిడార్ లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ ఊహాగానాలను రకరకాల వార్తలుగా మలచడానికి విలేఖరులు నానాపాట్లూ పడుతున్నారు.
   
    "ప్రొసీడ్..." జడ్జి మెహతా అనుమతితో లాయర్ మాలవ్య లేచి నిలబడి, మాయాదేవివేపు చూసింది.
   
    లాయర్ ఆదిత్య మనోహర్ వేపు చూశాడు.
   
    "మిస్ మాయాదేవీ.....కోర్టులో ప్రొసీడింగ్స్ పాయింట్ టు పాయింట్ గానే వుండాలి....అండర్ స్టాండ్...." మాయాదేవి ఆమెవేపు కోపంగా చూసింది.
   
    "చూడండి మిస్ మాయాదేవీ! మా క్లయింట్ మిస్టర్ మనోహర్ ను మీరు సెడ్యూస్ చేసే పథకంలో భాగంగా మీరు మొదట ఆయన్ని కిస్ చేశారా?"
   
    "నేను దానిని కిస్ అనను....ఇట్స్ ఏన్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ లవ్! కిస్ ఈజ్ నాటెటాల్ ఎ క్రైమ్....యూనో?" గంభీరంగా ప్రశ్నించింది మాయాదేవి.
   
    "ఎస్....క్రైమ్ కాదు. కానీ ఈ కేసులో మీరు, నా క్లయింట్ ను బలవంతంగా కిస్ చేశారు. అవునా....కాదా?"
   
    "ఎస్!"
   
    "నోట్ దిస్ పాయింట్ యువరానర్" జడ్జీవేపు చూస్తూ అంది లాయర్ మాలవ్య.
   
    "ఎక్కడ కిస్ చేశారు?"
   
    ఆ ప్రశ్నకు బదులు చెప్పలేదు మాయాదేవి.
   
    "మిస్ మాయా....మిమ్మల్నే."
   
    "జ్ఞాపకం లేదు."
   
    "అంటే.....దానర్ధం....చూడండి మిస్ మాయా! ఒక ఏకాంతమయిన ఆఫీసు రూమ్ లోకి, ఒక ఎంప్లాయిని పిలిచి ముద్దు పెట్టుకోవడం తప్పా కాదా?" అడిగింది మాలవ్య.
   
    "మన ఇండియన్స్ ఏకాంతమయిన రూమ్ లోనే ముద్దు పెట్టుకుంటారు. బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం మన సమాజంలో భాగం కాదు" అంది మాయాదేవి.
   
    "ముద్దు పెట్టుకోవడం నేరం కాదా?"
   
    "ఒక లవర్ ఇంకో లవర్ ని ముద్దు పెట్టుకోవడం నేరంకాదు" అంది మాయ.
   
    "ఐ ఆబ్జక్ట్ యువర్ ఆనర్....మా క్లయింట్ మిస్టర్ మనోహర్, మిస్ మాయకు లవర్ కాదని గమనించాలి" లాయర్ ఆదిత్య అన్నాడు.
   
    "ఓకె! ఎలా ముద్దు పెట్టుకున్నారో చెప్పండి. లిప్ టు లిప్....టంగ్ టు టంగ్."

 Previous Page Next Page