Previous Page Next Page 
జైలు పేజి 27

    
    "ఇప్పుడు మనింట్లో వెంకయ్య వున్నాడుగా!"

 

    "వాడు మొద్దు వెధవ. వాడికి ఓ కన్ను కనిపించదు. ఓ చెవ్వు వినిపించదు. ఇద్దరు ముగ్గురు దొంగలు దూరినా ధైర్యంగా ఎదుర్కొనే వాడుగా వుండాలి"

 

    అలాంటి వాడు జెయిలులో ఎవరైనా వున్నరోనని శ్రీపతి ఆలోచనలో పడ్డాడు.

 

    "నేను పేరును సజెస్ట్ చేస్తాను. అతన్ని మనింట్లో కన్విక్టు ఆఫీసర్ గా పెట్టండి" అంది గోముగా ముఖంపెట్టి.

 

    దాంతో వదిలేయకుండా కాస్తంత ముందుకు వంగింది. పైట కొద్దిగా జారింది.

 

    శ్రీపతి కళ్ళు అటుచూసి ఆనందంతో అదిరాయి.

 

    లోనెక్ జాకెట్ లో ఇద్దరు వస్తాదులను దాచిపెట్టినట్టున్న ఆమె స్తనద్వయాన్ని చూడగానే ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది కోరికతో కాదు, భయంతో. తనకు లొంగని గుర్రాన్ని స్వారీ చేయమని ఎవరైనా బలవంతం పెడితే జాకీ ఎలా భయపడిపోతాడో అలాంటి ఫీలింగ్ ఆయనలో.

 

    ఎప్పుడు ఆమె పైట జార్చినా ఆయన అలా జావకారిపోతాడు.

 

    ఇంటికిపోయే బెల్ ఎప్పుడు కొడతారో బయటకు వురుకుతామా అన్న తొందరలో క్లాస్ లో ఒద్దికగా కూర్చోలేక తొంగిచూస్తున్న బడిపిల్లల్లా పైట జారగానే బయటపడే ఆమె వక్షోజాలను చూస్తూనే కాళ్ళల్లో వణుకు ప్రారంభమౌతుంది. పావురాళ్ళ ముక్కల్లా వుండే వాడి మొనలు అయన పెదవులపైనున్న తడినంతా లాగేస్తాయి. వాటికింద అనుభూతిని భద్రంగా దాచుకునేందుకు వున్న మనీ పర్సు కవర్ లా వుండే నడుంమీద పడ్డ మడతలు ఆయన ముఖాన్ని చెమటలో ముంచుతాయి. మన్మధుడి అంబుల పొదలా వుండే ఆమె బొడ్డు తలను తిప్పేస్తుంది. ఇన్ని జరుగుతాయని తెలుసుకాబట్టే చిత్ర పైట జారిపోయేట్టు వంగింది.

 

    ఇప్పుడు తను ఏం అడిగినా కాదనే ధైర్యం లేదని తెలిసి మంచి వస్తాదును ఇంట్లో పనికి పెట్టుకుంటే కలిగే లాభాలను ఆమె ఏకరువు పెడుతోంది. ఏదో ట్రాన్స్ లో వున్నట్టు ఆయన వింటున్నాడు.

 

    చివరగా అన్నాడు "అలాగే చిత్రా! మంచి బలాడ్యుడైన ఖైదీని చూస్తాను" అన్నాడు.

 

    "అలాంటి ఖైదీ ఎవరైనా వున్నారా?" ఆమె అప్పటికీ పైట సరిచేసుకోలేదు. ఇనుమును సాగగొట్టాలంటే దానిని బాగా వేడిచేయాలని ఆమెకు తెలుసు.

 

    "విచారించాలి"

 

    "నేనో పేరును సజెస్ట్ చేస్తాను. కాదనకూడదు మీరు" అంది మరింతగా ముందుకు వంగి.

 

    తనను పేల్చేయ్యడానికి రెండు మిసైల్స్ దూసుకొస్తున్నట్టు వుంది ఆయనకు.

 

    "ఏవరు?"

 

    "తిలక్!"

 

    ఆయన ఒక్కక్షణం జడుసుకున్నాడు. ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డ ఖైదీని తనింట్లో పనిమనిషిగా పెట్టుకోవడం ఇంపాజిబుల్. రూల్స్ ఒప్పుకోవు. తనూ ఒప్పుకోడు.

 

    "అతను... సత్ప్రవర్తన ఉన్న ఖైదీకాడు. అలాంటి అతన్ని..." శ్రీపతి ఆపై చెప్పలేక నీళ్ళు నమిలాడు.

 

    "అదంతా నాకు తెలుసులెండి. ఇటీవల అతనూ మరో ఇద్దరూ పారిపోవడానికి ప్రయత్నించారు. అది వీలుకాలేదు. మీ గార్డులు వాళ్ళు వాటర్ ట్యాంక్ లో వున్నప్పుడు పట్టుకున్నారు. దీంతో ఆ ముగ్గురికీ మరో సంవత్సరం శిక్ష పడింది. అంతేగా" అని దురద వేసినట్టు ముఖంపెట్టి పాదాలను మూస్తున్న చీర కుచ్చిళ్ళను పైకి లాక్కుంది.

 

    ఇప్పుడు మోకాలు వరకు చీర లేకపోవడంతో ఆమె సెక్సప్పీల్ ఆయన కళ్ళను తిప్పుతోంది. కడుపులో ఏదో వికారం మొదలైంది.

 

    తను ఇప్పుడు ఒప్పుకోకపోతే ఆమె ఎంతకయినా తెగిస్తుందని ఆయనకు తెలుసు. చీరను ఇంకాస్త తొలగిస్తే తన కళ్ళు పేలిపోతాయి. తను ఒప్పుకోకపోతే ఆమె మరికాస్తంత నగ్నంగా తయారౌతుంది. అప్పుడు తనేంచేయాలి? తనేం చేయలేడు గనుక ఆ ప్రమాదం ముంచుకు రాకుండా జాగ్రత్తే పడాలి.

 

    "ఓ.కే! నీ ఇష్ట ప్రకారమే తిలక్ ను కుదురుస్తాను. ముందు ఆ చీరను కిందకు దించు" అని అర్థిస్తున్నట్టు ముఖం పెట్టాడు.

 

    ఆమె చీర కుచ్చిళ్ళను వదిలింది, చెప్పిన మాట విన్న బానిసలాగా చీర యధాప్రకారం పాదాలపై వాలింది.

 

    ఆనందంతో ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకుంది చిత్ర.

 

    "థ్యాంక్సండీ! మీరు చాలా మంచివారు" అంది.

 

    ఏదో అనడానికి నోరు తెరవబోతున్న శ్రీపతికి జైలు నుండి ఏవో కేకలు వినిపించాయి.

 

    ఆయన ఆదుర్దాగా లేచి వరండాలోకి వచ్చాడు.

 

    తన దగ్గరకే పరుగెత్తుకొస్తున్న జైలర్ వామనరావును చూడగానే జైలులో ఏదో అనర్దం జరుగుతూ వుందని ఆయన పసికట్టాడు.

 

                               *    *    *    *

 

    "నిరుత్సాహపడ్డావా?" ఒకింత బాధ తొణికిసలాడింది లాలస మాటల్లో.

 

    "అవును. మన ప్లాన్ ఫెయిలైనందుకు కాదు. ఈ చెర నుంచి విముక్తి కలగనందుకు" తిలక్ చెప్పాడు.

 

    వాళ్ళిద్దరూ ఆ సాయంకాలం విజిటర్స్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. జెయిలు నుంచి పారిపోవాలన్న పథకం ఫెయిలయ్యాక ఆమె మొదటిసారి ఇదే రావడం.

 

    "మిమ్మల్ని ఎప్పుడు పట్టుకున్నారు?"

 

    "బ్యారెక్కు నుంచి అనుకున్నట్టే బయటపడ్డాం. ట్యాంక్ లో కూడా ఎవరూ చూడలేదు. అయితే ఆ రాత్రి కరెంట్ ఆఫ్ కాకపోవడం వల్లే ట్యాంక్ నుంచి బయటకు రాలేకపోయాం. కరెంట్ ఆఫ్ కాగానే తెల్లవారి పోయిందని తెలియగానే ఉత్తరుడు కేక పెట్టాడు. దాంతో గార్డు పట్టుకున్నాడు."

 

    "బ్యాడ్ లక్. కరెంట్ పోకుండా గోడను దూకడం ఇంపాజిబుల్. ఆరోజు రాత్రంతా కాలేజీ దగ్గర నిలబడి వెయిట్ చేశాను. ఉదయం కాగానే బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను."

 

    "దురదృష్టం ప్లాన్ ఫెయిలైయింది. కరెంట్ ఫెయిలై వుంటే ఇక ఏదీ మనల్ని అడ్డుకునేది కాదు. ఈపాటికి ఎక్కడో వుండేవాళ్ళం" విషాదం ఎక్కువైనప్పుడు కలిగే వెర్రి నవ్వు తిలక్ పెదవులమీద.

 

    "ఇంతకీ ఆరోజు ఎందుకు కరెంట్ ఆఫ్ కాలేదు?"

 

    "కరెంట్ కోతను ఆరోజునుంచే ఎత్తివేశారు కనుక"

 

    "అవునా?"

 

    "ఆఁ. మరుసటిరోజు పేపరు చూశాక కానీ నాకూ తెలియదు. కరెంట్ కోత ఎత్తివేసినట్టు మంత్రి ప్రకటన చదివాక విషయం బోధ పడింది."          

 Previous Page Next Page