"ఏమిటి చెప్పేది నా మొహం?"
"నీ మొహం అను. నీ మాటలన్నీ నా మొహంలాగా వుంటాయి."
"అంత అమాయకంగానా? అసంభవం."
"నేను అమాయకంగా వుంటానని నాకు తెలియదే. అదికాదు నా ఉద్దేశ్యం."
"అంత అందంగాలేననా పోనీ."
"ఉహుఁ" అంటూ తల అడ్డంగా త్రిప్పింది.
"మరి!"
"ఏదోలే. చెప్పుకుంటే స్వోత్కర్ష అవుతుంది."
కాసేపు ఇద్దరూ మాట్లాడకుండా ఊరుకున్నారు. చల్లగాలి హాయిగా వీస్తోంది. సౌదామిని ముంగురులు ఒకచేత్తో సవరించుకుంటూ ఆలోచిస్తుంది. ఇతను ఇవాళ ఏదో రహస్యాన్ని దాస్తున్నాడు తననుంచి... ఎందుకు? ఎంత అడిగినాచెప్పడు? తను ఓ ఆడది కాబట్టి చెప్పకూడదా? ఒక విషయంలోనుంచి ఇంకో విషయంలోకి కప్పదాటు వేస్తున్నాడు. ఆమెకు అతని స్వంత జీవితాన్ని గురించి ఏమయినా అడుగుదామని కుతూహలం చెలరేగింది. నవ్వుతాడు. ఏమీ జవాబురాదు. పాట పాడమని అడుగుదామనుకుంది. ఇతని పాటలు తన రోగాన్ని మటుమాయం చేయకూడదూ?
"అన్నయ్యా!" అంది.
"ఏమిటి" అంటూ రాజారావు ఎటో చూస్తున్నవాడల్లా ఇటు తిరిగాడు.
ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. అప్పటికే తూలి పడబోయింది. పరిస్థితిని గ్రహించి అతడామెను చప్పున సమీపించి గట్టిగా పట్టుకున్నాడు. ఆమెతల అతని హృదయంమీద వాలిపోయింది.
ఓ పదినిమిషాలు గడిచాక సౌదామిని కళ్ళువిప్పింది. "నన్నెందుకు పడిపోనియ్యలేదు?" అంది గాద్గదిక కంఠంతో.
రాజారావు ఆమె జుట్టును ప్రేమగా నిమిరాడు. "తప్పు సౌదామినీ! తాత్కాలికపు అవాంతరానికి శాశ్వత పరిణామాలా?" అన్నాడు.
"నీకు అర్థంకాదు అన్నయ్యా! మనిషి జీవితం నికృష్టం చేయటానికి ఇంతకంటే ఏంకావాలి? చదువుమానేసి నాలుగుగోడల మధ్య కూర్చుంటే పీడ విరగడైపోతుంది" అంది సౌదామిని విషాణ్ణ వదనంతో.
"నువ్వింత పిరికిపిల్లవా? ఉండు. నీకో మంచిమొగుణ్ణి చూచి పెళ్ళిచేస్తాను. దాంతో..."
"ఛీ ఛీ! అన్నయ్యా! మొగుడూ వద్దు, చట్టుబండలూవద్దు" అన్నది సౌదామిని.
6
ఓష్! ఇంతేనా!" అనుకున్నాడు చక్రపాణి.
తాను చెడిపోలేదు. ఇది చెడిపోవటం ఎంతమాత్రమూ కాదు. తాను ఏమీ నష్టాన్ని పొందలేదు.
జీవితం కొత్తచిగుళ్ళు తొడిగింది.
రాత్రివెళ్ళాక పగలూ, పగలు వెళ్ళాక రాత్రీ వస్తున్నాయి. వాటి మధ్య మెలిగి, నలిగి, చెరిగిపోతున్న సంఘటనా పరంపరలు. బ్రహ్మానందం అండగా నిలిచాడు. భుజంతట్టి హామీ ఇచ్చాడు. రాత్రితో ఎక్కువ స్నేహం చేశాడు . కాని ఎలా? సాహసం తక్కువ. ఇద్దరకూ ప్రవేశం దొరికేదాకా చాలాకష్టం. 'సాబ్' అంటూ వచ్చేవాడెవడో 'ఏం లేదు' అని నెమ్మదిగా అక్కడినుంచి జారుకునేవాళ్ళు. అనుభవం! ఈ అనుభవంకోసం మనసు పొంగితే వేదనను సహించటం దుస్సహంగావుంది. బ్రహ్మానందం నిరంతరం తాపత్రయపడుతున్నాడు. అతను లా కాలేజీకి, చక్రపాణి ఆర్ట్సుకాలేజీకి ఎప్పుడోగాని వెళ్ళడం మానేశారు. ఓసారి తెగించారు. సిగ్గు విడిచిపెట్టారు. నిరాశ, నిస్పృహ. తెల్లవారగానే మళ్ళీ బ్రహ్మానందం అంతా మరచిపోయాడు. అతనికి జీవితం నందనవనంలా కనిపించింది. అలా శృతిమించారు. సుకుమారమైన వాళ్ళ శరీరాలను దహించే ఎండలు, హోరున వాన, గజగజ వణికించే చలి, వీటి లక్ష్యం లేకుండాపోయింది. ఇదివరకు కొత్తరకం బట్టలు వేసుకుంటే కాస్త సిగ్గుపడుతూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు - మెరిసిపోతున్న ముఖాల్తో గర్వంగా ఛాతీ విరుచుకుని తిరగసాగారు. ఆత్మవిశ్వాసం హెచ్చినట్లనిపించింది. కావాలనుకున్నదల్లా పొందగలగడం చేతనైంది. మనోబలం రెచ్చిపోయింది. అనుకున్నప్పుడు ఆనందం... గానా బజానా, పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ముస్లిం పిల్ల అందరిముందూ వయ్యారంగా కూర్చుని చేతులనీ, కాళ్ళనీ త్రిప్పుతూ అభినయిస్తూ పాడేది. ప్రక్కనే మధురమైన సితారా సంగీతం. రూపాయలు విసిరిన బ్రహ్మానందం బుగ్గలు పుణికించాడు చక్రపాణి. చక్రపాణి అతనివంక చూసిన క్రీగంటి, మత్తు... చూపుల్ని, త్రోసిరాజన్నాడు. ఓ మూల కూర్చొని ఆ గది ఇల్లు, బొమ్మలు స్కెచ్ వేసుకున్నాడు. ఎప్పుడో ఎన్నికమన్నన, క్రిస్మస్ వచ్చింది. డబ్బులు గిరవాటేసి డ్యాన్సులు నేర్చుకుని వయ్యారపు సిగ్గు బుగ్గలతో కలిసి నాట్యంచేసి సిమ్మసిల్లి సోఫాలమీద ఒరిగిపోయింది. అందమైన కన్యకోసం పోటీపడి వాళ్ళజాతి, వాళ్ళ భుజాలు తట్టి. పిప్పరమింట్సు అందిచ్చి ఆనాటిసుందరిని ఎన్నుకుని చప్పట్లు కొట్టారు. బ్రహ్మానందం మనిషి మారిపోయాడు. బలిసిపోయాడు. మిసమిసలాడుతున్నాడు. చక్రపాణి పుస్తకాలు కొనడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆంగ్లసాహిత్యంలో అభిరుచి పెరిగింది. ట్రాజీడీలంటే మక్కువ పెరిగింది. షేక్స్పియర్ నాటకాలన్నీ చదవసాగాడు. ఏదో ప్రీతి, ఆప్యాయత. వాటిల్లో కలిసిపోయేవాడు. ఆ పాత్రల్ని గురించి తెగ ఆలోచించేవాడు. వాటిమీద విమర్శలుకూడా శ్రద్ధగా పఠించసాగాడు. రోజుకి చాలాకొద్ది గంటలు నిద్రపోయేవాడు. రోజులో ప్రతి నిమిషం విలువ హెచ్చింది. సితార్ కొన్నాడు. చికాకుతో దాని తీగలు తెంపి మళ్ళీ కొత్త తీగలు తెచ్చి బిగించేవాడు. అతనందంగా వుండేవాడు. అవును. చాలామంది ఎన్నిసార్లు ఈ మాట అన్నారు... మనస్తత్వాలతో చెరలాటలాడటం సరదా అయింది. జీవితంలో జూడమాడటం ముచ్చట అయింది. కవిత్వం రాశాడు. కొన్నిపద్యాలు తగులుబెట్టాడు. చెంపదెబ్బలు కొట్టి అతని - సున్నితమైన చెయ్యి కందిపోయింది. అతన్లో ఇంతశక్తి వున్నందుకు ఆశ్చర్యపడుతూ వుండేవాడు. ఉత్తరాలు చూసి బ్రహ్మానందం అసూయతా భావనలు వెలిబుచ్చేవాడు. అతన్ని రెండు చేతుల్లో పట్టుకుని "దుర్మార్గుడా! వాళ్ళ జీవితాలు నాశనం చేయకు. "నాకు తెలుసు" ఆనాడు చక్రపాణి గంభీరంగా. "బ్రహ్మానందం! నేను నీ అంత దుర్మార్గుడినికాదు. ఏ ఉద్దేశ్యంతో ఆమాటలు అంటున్నావో నాకు తెలుసు. బ్రహ్మానందం! విను. నా హృదయం కలుషితం ఎన్నడూ కాబోదు. అసహ్యాన్ని భరించలేని భారంతో ఎన్నడూ క్రుంగిపోను. పాడైపోయిన వాళ్ళని మాత్రమే నేను పాడుచేశాను."