Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 23

    "మరి నువ్వేగా అన్నావ్ ఆవిడ లేదనీ... అందుకనే దురదగా ఉందనీ..." మళ్ళీ అమాయకంగా అన్నాడు విశ్వనాథం.
    ఇహ తట్టుకోలేక టేబుల్ కేసి తలకొట్టుకుంటూ కాస్సేపు పకపకా నవ్వాడు కృష్ణారావు. తర్వాత ఆయాసపడ్తూ అన్నాడు."ఓరి వెర్రిపీనుగా... దురదంటే అదికాదు..." కన్నుకొట్టి నవ్వాడు కృష్ణారావు."ఏం అర్థం అయిందా?"
    "ఓ... అదా?" బుర్రకాయ ఊపుతూ సంబరంగా అన్నాడు విశ్వనాథం. పాపం చాలా కష్టమొచ్చింది... హిహి".
    "నాకేం పని చెయ్యబుద్ది కావడం లేదు... అందుకే ఓ పని చెయ్యాలని అనుకుంటున్నాం...'
    "ఏంటిది?" అడిగాడు విశ్వనాథం.
    "ఏం లేదు... ఆఫీస్లోంచి బయటపడి ఫ్రీ ఎంటర్ టైన్ మెంటు పొందుదామనీ...' అన్నాడు కృష్ణారావు ఒళ్లు విరుచుకుంటూ...
    "ఫ్రీ ఎంటర్ టైన్ మెంటా?... ఏమిటిది?" కుతూహలంగా అడిగాడు విశ్వనాథం.
    "నాతోబాటు బయటికిరా... చెప్తాను" అన్నాడు కృష్ణారావు. తర్వాత "ఊ... అబ్బా...ఉస్..." అన్నాడు మూల్గుతూ.
    తర్వాత ఇద్దరూ వాళ్ల సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లారు.
    "సార్... మేమిద్దరం బయటికి వెళ్లిపోతున్నాం" అన్నాడు కృష్ణారావు సెక్షన్ ఆఫీసర్ తో.
    "మళ్లీ ఎప్పుడు వస్తారు?" ఇద్దరి వంకా మార్చి మార్చి చూస్తూ అడిగాడు ఆయన.
    "ఇంక రాం సార్... రేపే వస్తాం" అన్నాడు కృష్ణారావు.
    సెక్షన్ ఆఫీసర్ పళ్లు బిగబట్టి "ఈ...' అంటూ టేబుల్ కేసి నెత్తికొట్టుకున్నాడు.
    "సార్...ఒక్క నిముషం సార్..." బతిమలాడే ధోరణిలో అన్నాడు కృష్ణారావు.
    సెక్షన్ ఆఫీసర్ తల కొట్టుకోడం ఆపి కృష్ణారావు వంక చూసి కళ్లెగురవేశాడు-ఏమిటన్నట్లు.
    "ఈ వేళ నా దగ్గరికి పుల్లారావు అనే కాంట్రాక్టరు వస్తానన్నాడు. వాడి ఫైలు నా దగ్గరే ఉంది. ఈ వేళో వెయ్యి రూపాయలు లంచం తీసుకుని వస్తానన్నాడు. వాడి దగ్గర్నుండి ఆ డబ్బు తీసుకుని మీ దగ్గరుంచంది... రేపు పొద్దున వచ్చిం తర్వాత నేను మీ దగ్గర్నుండి కలెక్ట్ చేస్కుంటా... వాడి పని రెండ్రోజుల్లో చేసి పెడ్తానని చెప్పండి..." అన్నాడు కృష్ణారావు.
    సెక్షన్ ఆఫీసర్ మళ్లీ "ఈ..." అంటూ టేబుల్ కేసి తల కొట్టుకున్నాడు.అతను తల కొట్టుకోడం అయింతర్వాత "అయిందా?ఇంకేమైనా ఉందా?" అని ఇద్దర్నీ అడిగాడు.
    "సార్... మరేమో ఈవేళ నా కోసం చిన్నారావు అనే కాంట్రాక్టరు వస్తానన్నాడు... అతని ఫైలేమో నా దగ్గరుంది. అతనేమో రెండు వేలు నాకు తెచ్చిస్తానన్నాడు. మీరు ఆ డబ్బు తీస్కుని ఉంచితే రేపు నేను మీ దగ్గర్నుండి తీస్కుంటా... హి" అన్నాడు విశ్వనాథం.
    "మీరిద్దరూ ఒకసారే చెప్పొచ్చుగా... ఇలా ఒకరి తర్వాత ఒకరు చెప్తే మాటి మాటికీ తల కొట్టుకోవాలంటే నా కెంత కష్టం?..." అని వాళ్లిద్దరిమీద విసుక్కుని తర్వాత తలని టేబుల్ కేసి ఫటఫటా కొట్టుకున్నాడు సెక్షన్ ఆఫీసర్.
    అతను అలా తల కొట్టుకుంటుండగా కృష్ణారావు, విశ్వనాథం ఇద్దరు ఆఫీసు బయటికెళ్లిపోయారు.
    "ఊ... ఇప్పుడు చెప్పు... ఫ్రీ ఎంటర్ టైన్ మెంటంటే ఏమిటో ..." అడిగాడు విశ్వనాథం.
    "ముందేమో మనం రద్దీగా ఉండే బజారు ఏదైనా సరే... అక్కడికి వెళ్లాలన్నమాట!!" అన్నాడు కృష్ణారావు.
    "ఏం?... అక్కడ బజార్లో జరిగే వింతలన్నీ చూడొచ్చనా?... అదేనా ఫ్రీ ఎంటర్ టైన్ మెంటంటే?..." అమాయకంగా అడిగాడు విశ్వనాథం.
    కృష్ణారావు రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు. అలా నిమిషంపాటు నవ్వి తర్వాత లేచి విశ్వనాథం పీకుచ్చుకున్నాడు. "నీ అమాయకత్వంలో నన్నిట్టా కిందపడేసి నవ్విస్తే నేనూరుకోనంతే... నా బట్టలంతా మాసిపోతున్నాయ్" అన్నాడు పళ్లు నూరుతూ కృష్ణారావు.
    "మరి ఎంతకీ విషయం చెప్పకపోతే నేనట్టానే అడుగుతా..." బుంగమూతి పెట్టి అన్నాడు విశ్వనాథం.
    "సర్లె సర్లె ...నా వెంటరా... నీకు అదే అర్థం అవుతుంది. ముందు మనం బిజీగా వుండే బజారుకెళ్లాలి!!"
    ఇద్దరూ ఆటోఎక్కిసుల్తాన్ బజార్ వెళ్లారు. అప్పుడు సమయం ఒంటిగంటైంది.
    "ఏదీ... ఫ్రీ ఎంటర్ టైన్ మెంటేదీ... ఎక్కడ ... ఎంటర్ టైన్ మెంటెక్కడ?" కృష్ణారావు పీకుచ్చుకుని ఊపేస్తూ అడిగాడు విశ్వనాథం.
    కృష్ణారావు చిరునవ్వు నవ్వి "ఆ వైపు చూడు...' అన్నాడు.
    విశ్వనాథం కృష్ణారావు చూపించిన దిక్కుకి చూసాడు. అక్కడ ఎలాక్ర్టిక్ పోల్ కి ఒక గేదె శరీరాన్ని రుద్దుతూ ఉంది.
    "అర్థమైందా?... అదే ఫ్రీ ఎంటర్ టైన్ మెంటంటే !! మనం ఇప్పుడు అలా చెయ్యాలన్నమాట!!!" కులాసాగా బుజాలు ఎగరేస్తూ అన్నాడు కృష్ణారావు.
    విశ్వనాథం ఒక్క క్షణంపాటు కృష్ణారావు మొహం వంక అయోమయంగా చూసి "సర్లె ... నువ్వదేదో ఫ్రీ ఎంటర్ టైన్ మెంటని అన్నావుగా? నీ మాటని ఎందుకు కాదనాలీ..." అంటూ గబగబా ఎలక్ట్రిక్ పోల్ దగ్గరకెళ్లి ఆ గేదెని తరిమేసి ఆ పోల్ కేసి తన శరీరాన్ని రుద్దసాగాడు.
    కృష్ణారావు మళ్ళీ తట్టుకోలేక కిందపడి గిలగిలా కొటుకుంటూ నవ్వాడు. తర్వాత లేచి బట్టలు దులుపుకుని పరుగెత్తుకెళ్లి విశ్వనాధాన్ని పక్కకి లాగాడు.
    "ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ నీక్కాదు...నిన్ను చూసే వాళ్లకి వస్తుంది... నా ఉద్దేశం ఇది కాదు. ఆ గేదె ఎలాక్ర్టిక్ పోల్ కీ గోడలకీ శరీరాన్ని ఎలా రాస్కుంటూ వెళ్తుందో అలానే మనం మన శరీరాన్ని ఈ రద్దీలో ఆడాళ్ళకి రాస్కుంటూ వెళ్తామన్నమాట!!" అన్నాడు కృష్ణారావు నవ్వాపుకుంటూ.
    విశ్వనాథం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు."నువ్వు చెప్పింది చాలా బాగుంది... చాలా బాగుంది..." అంటూ బుర్రూపాడు.
    అంతే ... ఇద్దరూ సుల్తాన్ బజారు ఈ చివరనుండి ఆ చివరిదాకా, ఆ చివరనుండి ఈ చివరదాకా ఆ రద్దీలో ఆడాళ్లని రాస్కుంటూ తిరగసాగారు.
    ఒకసారి ఒకమ్మాయి "దొంగ సచ్చినాళ్లారా" అంటూ తిట్టింది. ఇంకో అమ్మాయి చెప్పు తిసుక్కొని వెంటబడ్తే ఇద్దరూ పరుగండుకున్నారు. కానీ ఆ అమ్మాయి విశ్వనాథాన్ని దొరకబుచ్చుకుని చెప్పుతో గూబ పగలకొట్టింది. మిగతా జనం మూగేలోపలే అక్కడినుండి తప్పించుకెళ్ళి కృష్ణారావుని కల్సుకున్నాడు విశ్వనాథం.
    అక్కడి నుండి కాస్త ముందుకు నడిచింతర్వాత ఒకామెని డాష్ కొట్టి ఆమె జబ్బ నొక్కాడు కృష్ణారావు. ఆమె కాండ్రించి కృష్ణారావు మొహంమీద ఉమ్మేసి విసవిసా వెళ్లిపోయింది.
    "ఎలా వుంది ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్?హి హి ?" అని అడిగాడు కృష్ణారావు చొక్కా ఎత్తి మొహం తుడుచుకుంటూ.
    "బాగానే ఉందిగానీ నువ్వు చెప్పిన ఈ ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్లో కాస్త రిస్కుంది. దీనికంటే నాకు తెల్సిన ఫ్రీ ఎంటర్ టైన్ మెంట ఇంకోటుంది... అదైతే దీనికంటే చాలా బాగుంటుంది... పైగా రిస్కుకూడా ఉండదు..." అన్నాడు విశ్వనాథం ఇందాకటి చెప్పుదెబ్బ తల్చుకుని గూబ నిమురుకుంటూ.
    "నీకు వేరే ఫ్రీ ఎంటర్ టైన్ మెంట్ తెల్సా?... అదేంటో త్వరగా చెప్పు..." హుషారుగా అన్నాడు కృష్ణారావు.
    "ఏం లేదు ...ఏదైనా సినిమాకి వెళ్ళడం... ముందు సీట్లో కూర్చున్న ఆడాళ్లని కళ్ళతో వెనకాల నొక్కడం... హిహి..."
    "హిహిహి..." కృష్ణారావు సంబరపడిపోయాడు.

 Previous Page Next Page