Read more!
 Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 2

    గూర్ఘా బిత్తరపోయి చూశాడు.

    "ఇక్కడికే అమ్మాయి పారిపోయి వచ్చిందా?" కరుగ్గా అడిగాడో పోలీస్ ఆఫీసర్ హిందీలో.

    "ఎవరూ... మృదువని మేడమా?" గూర్ఘా అడిగాడు.

    "అవును... ఇక్కడికి వచ్చిందా...?" డిఫెన్స్ సెక్యూరిటీ ఛీప్ గూర్ఘాని అడిగాడు.

    "వచ్చారు సాబ్...కంగారుగా పరుగెత్తుకు వచ్చారు. శరణ్య మేడమ్ ఉన్నారా? అని అడిగేరు. 'లేరని' చెప్పగానే వెళ్ళిపోయారు" గూర్ఘా చెప్పాడు.

 
    "ఎటు..ఎటువైపు వెళ్ళింది?" పోలీస్ అధికారి అడిగాడు.

    గూర్ఘా ఆమె వెళ్ళిన వైపు చేయి పెట్టి చూపెట్టాడు. ఫోలీస్ వెహికల్స్ గూర్ఘా చూపించిన దిశిగా ముందుకు కదిలాయి. రెండు నిమిషాల్లో ఆ వెహికల్స్ ఫౌండ్ దూరమయ్యాక ఓ బీల్దింగ్ చాటునుంచి బయటకు వచ్చింది ఆమె.

    ఆ దృశ్యం చూసిన గూర్ఘా నోరు వెళ్ళబెట్టాడు. అతని మనసు ఏదో కీడు శంకించింది. "మేడమ్..." అంటూ ఏదో అడగబోయెంతలోనే, తను వచ్చిన దారివైపు పరుగుపెట్టిందా అమ్మాయి.

                             
                                                                            ***
    అర్దరాత్రి ఒంటిగంట.
 
    క్లాక్ రూమ్ లో నుంచి కంగారుగా బయటకు వచ్చింది. హైదరాబాదుకు వెళ్ళే ట్రెయిన్ ప్లాట్ ఫామ్ మీద రెడీగా ఉంది. ఆ రోజు అది ఆలస్యంగా బయల్దేరడం ఆమె అదృష్టం. కదులుతున్న ఆ రైలును క్యాప్ చేసింది.  
    ట్రెయిన్ ప్లాట్ ఫామ్ వదిలి వెళ్తుండగా, రైల్వేస్టేషన్ ని డిఫెన్స్ ఫోలీసులు చూట్టూ ముట్టారు. దూరమవుతోన్నడిల్లీ నగరాన్ని, ఫోలీసులను చూసి ఆ అమ్మాయి ఓ నిటూర్చి విడిచింది.
 
    అప్పటికే డిల్లీ అంతటా రెడ్ ఎలర్ట్ ప్రకటించారు.అ అమ్మాయి పేరు మ్రుడువని. డిఫెన్స్ చీఫ్ ఫర్సనల్ సెక్రటరీ ఆమె!

                                                                          ***

    విరజ టెలిఫోన్ ఛానల్ చైర్మెన్ పరమహంస తన ఛాంబర్ లో కూచొని, రిమోట్ తో తరచూ చానల్స్ మారుస్తూ రెస్ట్ లెస్ గా ఉన్నాడు.

    యాబైనాలుగేళ్ళ పరమహంస తన టీవి ఛానల్ వెరైటీ ప్రోగ్రామ్స్ రావాలని, ఫోటీ టీవి ఛానల్స్ తన వీతీవి చానల్ ని చూసి కుళ్ళుకోవాలని ఆశిస్తూ ఉంచాడు.

    ఎప్పటికప్పుడు అతనకి వెరయిటీ దాట్స్ వస్తూ వుంటాయి. అయితే, ఆ థాట్స్ వర్కవుట్ అవ్వమని తెలిసేక, ఇలా తన కోపాన్ని రిమోట్ మీద చూపించి, తరమా ఛానల్స్ మారుస్తూ ఉంటాడు.

    తక్కువ బడ్జెట్ టీవి సీరియల్స్ ప్లాన్ చేసి ఘేరంగా దెబ్బతిన్నాడు. ఒకేగదిలో దూరదర్శన్ సీరియల్స్ లా ప్లాన్ చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు. ఒకే గదిలో దూరదర్శన్ సీరియల్స్ లా  పాత్రలు మైకు ముందుకు వచ్చి,మాట్లాడి వెళ్ళిపోయినట్టు వుండేసరికి వీక్షకులు తమ టీవి ఛానల్స్ ని అతి సునాయాసంగా మార్చి, మరో ఛానల్ చూస్తున్నారని తెలిసి, టీవీ సేరియల్స్ ప్రొడక్షన్ కాస్త పెంచాడు.

    ఎన్ని రకాలుగా ప్రయత్నించినా,వీక్షుకుల సంఖ్య పెంచలేక పోతున్నానని తరుచూ ఫీలవుతూ వుంటాడు పరమహంస.

    అలాంటి పరమహంస తనకో బ్రిలియంట్ యంగ్ చావ్ కావాలని ఆలోచిస్తున్న సమయంలో,  అంకిత్ అ తీవె ఛానల్ లోకి ఎంటరయ్యాడు.

    కేబిసి (కౌన్ బనేగా కరోడపతి) కి ఆదరణ పెరిగిపోతూంది. ఆ టైం లో మిగతా ఛానల్స్ జనాలు చూసిన పాపాన పోని టైంలోకేబిసి నుంచి విటివికి ఎట్ లీప్ట్ తెలుగులోనైన అసియన్స్ ని డైవర్ట్ చేస్తానని చాలెంజ్ చేసినవాడు అంకిత్.

    తను అలా చేయకలిగితే ఈటీవీ ఛానల్స్ ముఉతపడే వరకూ తనకు ప్రోగ్రామ్స్  డిజైనర్ గా మంచి జీతం, రేస్పెక్తూ ఇచ్చి చూసుకోవాలన్న కండిషన్ పెట్టాడు.

    ఇలాంటి వెంచర్స్, అడ్వంచేర్సూ ఇష్టపడే పరమహంస ఓ.కే అన్నాడు.సరిగ్గా అప్పుడు ప్రారంభించాడు. కేబిసికి పోటిగా కేబికేసి ప్రోగ్రామ్స్.

    కౌన్ బనేగా కిస్ పతీ అన్నా ప్రోగ్రామ్ అది. కేవలం మగవాళ్ళకు మాత్రమె పరిమితమైన ఆ ప్రోగ్రాంలో క్విజ్ మాస్టర్ ఓ ఇరవైయ్యేళ్ళుఅమ్మాయి. ప్రముఖ హీరోయిన్.
 
    క్విజ్ పైనల్ గా  గెలిచినా వాళ్లకు ఆ యమ్కరమ్మ ముద్దు పెట్టుకుంటుంది. అదీ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్.... మొదటి వరం రోజులు అన్ని పత్రికల్లో యాడ్స్ వచ్చాయి.'ఇది కేబిసి కాదు, అన్నా కాప్షన్ తో వచ్చిన యాడ్ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసింది.

    ఈ ప్రోగ్రామ్స్ యాంకర్ గా ఓ ప్రముఖ హీరోయిన్ ని బుక్ చేశారు. అంతే, ఆ హీరోయిన్ తో క్విజ్ నెగ్గి, ముద్దు పెట్టించుకోవాలన్నవాళ్ళంతా ఎంట్రీ ఫారాలను నింపి పంపించారు.

    స్పాన్సర్ చేయడానికి నలుగు పెద్ద కంపినీలు ముందుకు వచ్చాయి. రెండు శీతల పానీయాల కంపెనీలు, మరో రెండు వయాగ్రా టివ్ కంపెనీలు ముందు కొచ్చాయి.ఎంట్రీల సంఖ్య లక్షల్లో చేరింది.
     
    ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయింది.మగవాళ్ళంతా ఠంచనుగాఆ టైం లో కేబికేసి ప్రోగ్రామ్స్ ముందు కూర్చుంటున్నాడు. భార్యాలను బతిమిలాడ్డం... లేదంటే బయటకు వెళ్ళి చూడ్డం.

    ఆ ప్రముఖ హీరోయిన్ ఎవర్ని ముద్దు పెట్టుకుంటుందోననే యాంగ్జయిటీ.... మెల్లిమెల్లిగావీక్షకాదరణ పెరగసాగింది.

    వారం గడిచింది....

    పది రోజులు గడిచాయి....

    క్విజ్ లో ఎవరూ గెలవలేక పోతున్నారు.

    ప్రోగ్రామ్ చివర ఆ హీరోయిన్ పలువరస తళుక్కుమనేలా నవ్వి,తన గులాబీరంగు పెదవులను క్లోజప్ లో చూపిస్తూ, బెటర్ లక్ నెక్స్ ట్టైం అని... గాల్లోకి ముద్దులు విసురుతుంటే....

    ప్రేక్షుకులంతా మంత్రముగ్దలయ్యారు.

    అయితే, కొద్ది రోజుల్లో ప్రోగ్రామ్ మీద అనుమానాలు గుప్పుమన్నాయి. ఎవరూ గెలవడంలేదు. అంటే క్విజ్ కు వచ్చేవాళ్ళు ఎవరు? టీవీ చానల్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళేనా? వీక్షుకుల్లో గొడవ మొదలవటంతో, ఆ హీరోయిన్ యాంకర్ పక్కకు తప్పుకుంది.

    మరో ప్రముఖ హీరోయిన్ తో ఆ కార్యాక్రమం మొదలవుతుందని ప్రకటన వచ్చింది. ఈ సారి క్విజ్ లో గెలిచారు. ఆ హిరోయిన్ ఆ విజేతను ముద్దు పెట్టుకుంది.

    ఆ విజేత వయసు పాతికేళ్ళు. కానీ ఆ హీరోయిన్ వయసు డెబ్బయి ఐదేళ్ళు.క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపూ ఆ ప్రముఖ హీరోయిన్ ఫేస్ ని చూపించలేదు. ఆ తర్వాత చెప్పించారు... యాబై ఏళ్ల కిందట ప్రముఖ హీరోయిన్ అని...

    ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ ఆగిపోయినా,కొన్ని రోజులైనా, తమ వీక్షుకుల సంఖ్య పెరిగేలా చేసిన, అంకిత్ అంటే విపరీతమైన గురి, అభిమానం పెరిగాయి చైర్మెన్ పరమహంసతో......

   
                                                                        ***

 Previous Page Next Page