Read more!
Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 1

                                         డింగ్ డాంగ్ బెల్                             

                                                        ------ ముచ్చర్ల రజనీశకుంతల

    న్యూడిల్లీ

    జనవరి నెల.
 
    అర్దరాత్రి పన్నెండు గంటలు.

    నగరమంతా చలి బూచికి జడిసి ముడుచుకుపోయింది.రోడ్లన్నీ చలి విధించిన కర్ఫ్యూలా మారిపోయాయి. స్ట్రీట్ లైట్ల వెలుతురులో నగరం వెలిగిపోతుంది. అప్పుడప్పుడు పెట్రోలింగ్ వెహికల్స్ చేసే శబ్దాలకు రోడ్డుపక్కన పడుకున్న కుక్కలు 'భౌభౌ' మంటూ లేచి అరుస్తున్నాయి.

    సరిగ్గా అదే సమయంలో...

    నార్త్ సిటీలోని రోడ్ నెంబర్ సిక్స్తే కలకలం చెలరేగింది. ఈస్ట్  ఫేస్ లో వున్న డిఫెన్స్ కార్యాలయం ఎలర్ట్ అయింది.విశాలమైన ప్రాంగణంలో వున్న డిఫెన్స్ కార్యాలయంలో డేంజర్ అలారమ్ పెద్ద శబ్దం చేస్తూ నగరాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

    డిఫెన్స్ సెక్యూరిటీ బిలబిలమంటూ అ ఆవరణను చుట్టుముట్టింది. క్షణాల్లో వైర్ లెస్ లో ఆ సమాచారం కంట్రోల్ రూమ్ కి చేరిపోయింది.

    కొద్ది నిమిషాల వ్యవధిలోనే పోలీస్ వెహికల్స్ నార్త్ సిటీ వైపు దూసుకోచ్చేస్తున్నాయి...డిఫెన్స్ సెక్యూరిటీ చకచక కదులుతోంది.

    అప్పటివరకూ నిశబ్దంలోమునిగిపోయిన డిల్లీ నగరం పోలీస్ వెహికల్స్ శబ్దంతో, బూట్ల టకటకలతో దడదడ లాడిపోతోంది.

     సరిగ్గా అప్పుడే...

    ఆమె ప్రాణ భయంతో డిఫెన్స్ కార్యాలయం పిట్టగోడ దూకి రోడ్డు మీదకి వచ్చింది.

    ఆమె పా..రు..గే..డు..తొం..ది.

    విలుకాడు అతి బలంగా వింటి నుంచి సంధించిన బాణంలా పరుగెడుతోంది.

    చలికి చేతులు కొంకర్లు పోయేంత చలిలో ఆమె మొహం స్వేదంతో తడిసిపోయింది. తనేమాత్రం ఆలస్యం చేసినా, తనేమాత్రం ఆలస్యం చేసినా తన ప్రాణాలేకాదు, ఈ దేశ రక్షణ వ్యవస్థ కుప్పకులుతోందనిఆమె భయం.

    వేగాన్ని పాదాల్లోకి తెచ్చుకుంది. ఏ క్షణమైనా డిఫెన్స్, పోలీస్ తనని వేటకుక్కలా వేటాడుతుంది. తనీలో గాత...ప్పిం..చు..కో..వా ..లి.

    తన పరుగు అడ్డం పడుతోన్నహైహీల్స్ ని చేతుల్లోకి తీసుకుంది.

     తనను చూపించేస్ట్రీట్ లైట్ల వైపు వాటిని గురిపెట్టి విసిరింది.భళ్లుమంటూస్ట్రీట్ లైట్లు పగిలిపోయాయి. ఒక్క నిమిషంలో అక్కడ పోడువాటి రెయిలింగ్....

    అక్కడికి చేరుకుంది. రెయిలింగ్ నుంచి కిందకి చూసింది. దాదాపు అరవై అడుగులు ఉంటుంది. రెయిలింగ్ నుంచి కిందకి దూకితే కాళ్ళూ, చేతులూ విరగడం ఖాయం.

    ఆమెకేం చేయాలో పాలుపోలేదు. వెనక డిఫెన్స్ సేక్యూరీటి బూట్ల శబ్ద.. అప్పటి వరకూ తనని ఇబ్బంది పెడుతోన్న చున్నీవైపు చూసింది.

    రెయిలింగ్ చివరి రాడ్ కు చున్నీని ఓ వైపు ముడి వేసింది. తర్వాత చున్నీకొనను రెయిలింగ్ కు అటువైపు వదిలేసింది. నెమ్మదిగా చున్నీని పట్టుకుని, బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి దిగుతోంది.

    తనే మాత్రం పట్టుతప్పినా,అరవై అడుగుల కిందకి జారిపడి కాళ్ళూ, చేతులు విరగ్గొట్టుకోవడం గ్యారంటీ.

    చున్నీ దాదాపు ఐదడుగులుఉండడం ఆమెకి కలిసొచ్చింది. ఆ చున్నీ చివరనరకూ వచ్చి, ఓ చిన్న రాయిని సపోర్టు చేసుకుని ఆగిపోయింది.కిందకి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె చున్నీ చివర్న పట్టుకుని గాల్లో వేలాడుతోంది.

    అరవై అడుగుల ఎత్తున్న ప్లయిఓవర్ అది. గట్టిగా కళ్ళు మూసుకుని,చున్నీ చివరకు బిగించి పట్టుకుంది.క్షణాలు లెక్కబెడుతోంది.క్రమక్రమంగా అప్లయ్ ఓవర్ మీద వేహోకల్స్ శబ్దం, బూట్లశబ్దం దూరమైంది. అతికష్టంమ్మీద పైకివచ్చింది.ఏ మాత్రం ఆలస్యమైనా చున్నీ ఆమె బరువుకు తెగిపోయేది. చున్నీ ముడివిప్పి, మొహం తుడుచుకుంది.మళ్ళీ పరుగు పెట్టడం మొదలుపెట్టింది.

                                                                 ***

    మోడ్రన్ అపార్ట్ మెంట్స్.

    గూర్ఘా తాఫీగా బీడీ కాలుస్తున్నాడు.
 
    ఓసారి టైం చూసుకున్నాడు.

    అర్దరాత్రి పన్నెండున్నర... కాసేపు స్టూల్ మీద కూచూని కునుకు  తీయాలనే ఆలోచన వచ్చిందతనికి.

    చేతిలో వున్న కర్రను ఓ పక్కగా ఆన్చి, స్టూలు మీద కూచొని, కళ్ళు మూసుకున్నాడు.అప్పుడే అతనికి అడుగుల శబ్దం వినిపించింది.

    చుటుక్కున కళ్ళు తెరిచి,కర్రను చేతిలోని తీసుకున్నాడు.

    'కౌన్ హై' ఎలర్ట్ యి గట్టిగా అరిచాడు.ఎదురుగారొప్పుతూవున్న అ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూసి
 
    "మేడమ్... మీరా?" ఆశ్చర్యంగా అడిగాడు.కాళ్ళకి చెప్పులేకుండా, కంగారుగా పరుగెత్తుకు రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

    "శరణ్యమేడమ్ వున్నారా?" ఆయాసంతో రొప్పుతూనే అడిగింది.

    "లేదు మేడమ్... వచ్చేసారు... మీరు కారిడార్ లో వెయిట్ చేయండి" వినయంగా అన్నాడు గూర్ఘా.

    ఆ తర్వాత అతను చెప్పేది ఏదీ వినిపించకుండా మళ్ళీ పెరుగేత్తింది.

    సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత, పోలీస్ వెహికల్స్ ఆ అపార్టుమెంట్స్ ముందాగాయి.

Next Page