Read more!
 Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 3

    విడివి పెట్టాడు పరమహంస.

     న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్నాడు.
              
    రెండు నిమిషాల తర్వాత పరమహంసకు బి.పి రేయిజ్ అయింది. గట్టిగా బెల్ నొక్కాడు బోయ్ పరిగెత్తుకు వచ్చాడు.అతని చేతిలో బి.పి మత్రాలు ఉన్నాయి. చైర్మెన్ చేతికి మాత్రలు ఇచ్చి, "మంచినీళ్ళు ఇమ్మంటారా సార్?" అని అడిగాడు వినయంగా.

    బ్లాంక్ గా బోయ్ వైపు చూశాడు.

    "ఇదెప్పట్నించి మొదలెట్టావు. నాకు బి.పి మాత్రలు కావాలని నేను అడిగానా? ఆలు ఈ మాత్రలు నీ దగ్గర ఎక్కడివి?" అనుమానంగా అడిగాడు పరమహంస.

    "అంకితగారు ఇచ్చారు..... మాములుగా కాక, చాలా కోపంగా మీరు బెల్ నొక్కినప్పుడు, మీరు చాలా కోపంగా ఉన్నారని అర్ధమని, అప్పడీ మాత్రలు మీకు ఇవ్వమని చెప్పారు" ఆ బోయ్ వినయంగా చెప్పాడు.

    అతనకి మరో సారి రేజయింది. వెంటనే అ బోయ్ ఇచ్చిన మాత్రంలు నోట్లో వేసిఉకుని, నీళ్ళుతాగి. "నువ్వెళ్ళి న్యూస్ ఎడిటర్ ని పిలుచుకురా" చెప్పాడు.

    బోయ్ వెళ్ళిపోయాడు.

    సరిగ్గా నాలుగు నిమిషాల తరవాత చేతిలో కేసెట్ తో పరుగు పరుగున వచ్చాడు న్యూస్ ఎడిటర్

    "పిలిచారా సార్?" అని అడిగాడు వచ్చీ రాగానే. కోపాన్నీ కంట్రోల్ చేసుకుంటూ " లేదు...." అన్నాడు పరమహంస

    న్యూస్ ఎడిటర్ కోపంగా ఓ సారి బోయ్ వంక చూసి  "సారీ సర్... వీడొచ్చి మీరు పిలిచారని చెప్పాడ్సార్" అన్నాడు తలదించుకుని

    "మరి వాడొచ్చి చెప్పేక, న దగ్గరకి వచ్చి, 'పిలిచారా సార్' అంటే ఏమీటర్డం?" కూల్ గా అడిగాడు పరమహంస.

    అతనకి చైర్మెన్ గురించి తెలుసు కాబట్టి కాం గా తలదించుకుని "సారీ సర్" అన్నాడు.

    "నువ్వు ఇలా రోజుకు పదిసార్లు అయినా సారీ చెబుతారా?' అడిగాడు చైర్మెన్.

    ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్దంకాలేదు న్యూస్ ఎడిటర్ కు

    ఓ సారి రిమోట్ నొక్కి 'న్యూస్'చాడమని చెప్పాడు రమహంస.బుద్దిగా న్యూస్ చూడసాగాడు. న్యూస్ చూస్తున్నంతసేపూ అతనిలో భయం ఆవరించుకుంది.

    ఓడి (ఓవర్ డ్రాప్ట్) బదులు, బీడీ ని, వెంటనే వాలిక్కర్చుకొని, 'బాడీ' అని, మళ్ళీ నాలుక కరచుకుని సరిచేసుకోడం, 'ఛ'ను 'ఛ'గా 'బ'ను 'భ'గా పలకడం, 'స' ను 'శ'గా పలకడం శనివారం అనడం...అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.

    "ఇతడ్ని ఎక్కడ కొట్టుకువచ్చావు?" ఇరిటేషన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు చైర్మెన్ పరమహంస.

    "సారీపర్.... ఫేస్ బావుందని..."

    "ఇది ఐదోసారి 'సారీ...' ఫేస్ బావుంటే చాలా? వాయిస్'బెస' బావుండక్కర్లేదా?"
 
    "సారీసర్" అని నాలికర్చుకున్నాడు న్యూస్ ఎడిటర్

    ఉచ్చారణ దోషాల గురించి అతనికి చెప్పావా?"

    "మొన్నోసారీ  చెప్పానుసార్..."
                     
    "చెబితే ఏమన్నాడు?"

    "సినిమాలో హీరోలకు డబ్బింగ్ చెప్పించినట్టు, డబ్బింగ్ చెప్పించ్చోంచ్చు కదా అన్నడండీ..." సిన్సియర్ గా చెప్పాడా న్యూస్ ఎడిటర్.

    ఒక్క క్షణం సీలింగ్ వంక పిచ్చి చూపులు చూసి, ఆ తర్వాత మళ్ళీ న్యూస్ ఎడిటర్ వంక చూశాడు పరమహంస.
 
    "సారీ సర్" చెప్పాడు న్యూస్ ఎడిటర్.

    "ఏడు... ఇది ఏదో సారీ... ఇంకోసారి యిల 'సారీ' చెప్పే పనులు చేసి 'సారీ'చెబితే నేనే నీకు 'సారీ' చెప్పి నీ ఉద్యోగం పీకేస్తాను."
 
    ఈ సారి 'సారీ' చెప్పాను సార్... అదే..'సారీ' చెప్పే పని చేయను సారీ అన్నాడు న్యూస్ ఎడిటర్.

    "ఒక్కసారి ఆ న్యూస్ చూడు.." మళ్ళీ రిమోట్ అన్ చేశాడు.

    క్లోజప్ లో న్యూస్ రీడర్ స్మయిలింగ్ ఫేస్ తో 'ప్రముఖ నాయుకుడు వల్లికాయల పాపన్నగారు ఈ రోజు కన్నుమూశారు' చెప్పాడు.

    "చూశారా...ఆ పల్లికాయల పాపన్నగారి అభిమానుల 'మ నాయుకుడు చనిపోతే మీకు నవ్వులాటగా వుందా?" అని మన మీదికి వస్తే ఏం చేస్తావు? వెంటనే అతన్ని అరవ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకోమను."

    న్యూస్ ఎడిటర్ 'అలాగే సార్' అంటూ బుద్దిగా తలూపి బ్రతుకుజీవుడా.... అంటూ అ చాంబర్ నుంచి జారుకున్నాడు.

    ఒక్కసారి అతనికి ఇలాంటి విషయాలు చాలా చికాకును తెప్పిస్తాయి. ప్రతిదీ దగ్గరుడి చూసుకునే సమయం వుండదు. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి వుశాయాల్లో వాళ్ల విమర్సలు నిర్మోహమాటంగా ఉంటాయి.

    టీవీ ఛానల్స్ మారుస్తూ వుండగా గుర్తొచ్చాడు. అంకిత్.

    అతను బోయ్ కి బిపి మాత్రలు ఇచ్చి, తను కోపంగా పిలిస్తే ఇవ్వమని చెప్పడం గుర్తొచ్చింది.వెంటనే గట్టిగా బెల్ నొక్కబోయి, ఆ ప్రయత్నం మానుకొని మెల్లిగా బెల్ నొక్కాడు.

    బోయ్ వచ్చాడు.

    "అంకిత్ సార్ ని పిలుచుకురా..." చెప్పాడు పరమహంస.

    "ఆఫీసులో లేరండీ" చెప్పాడు బోయ్.

    "నీకెలా తెలుసు?"

    "ఇందాక మీరు న్యూస్ ఎడిటర్ గారి మీద అరవడం చూసి.... 'చైర్మెన్ గారు ఎవరి మీదో విందులేస్తున్నట్టున్నారు...నా గురించి అడిగితే, 'నేను లేను' అని చెప్పమని కెమెరామెన్ ని, అసిస్టెంట్ డైరెక్టర్ ని తీసుకుని వెళ్ళిపోయాడండీ"చాలా ఒబీదియంట్ గా చెప్పి, చైర్మెన్ గారి రియాక్షన్ కోసం ఎదుర్చూశాడు.

    పరమహంస బోయ్ వంక బ్లాంక్ గా చూసి, "నువ్వెళ్ళిపో..." అన్నాడు. తను గట్టిగా అరిస్తే మళ్ళీ బి.పి మాత్రలు ఇస్తాడన్న భయం కూడా వుంది. అతనిలో.

    బోయ్ వెళ్ళిపోగానే బి నెంబర్ కు డయల్ చేశాడు. అటు వైపు రింగ్ తాన్ వచ్చింది.

    "హలో... అంకిత్... నేను చైర్మెన్ ని " అటు వైపు నుంచి వినిపించింది.

    "సెల్ నీదా,అంకిత్ దా?" కోపంగా అడిగాడు పరమహంస.

    "అంకిత్ దేనండీ... తనిప్పుడు..."

    "తనిప్పుడు ఏం చేస్తున్నాడు?" అడిగాడు పరమహంస

    "పరుగెడుతూన్ననండీ..."

 Previous Page Next Page