Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 11



    "నిన్నేంచేయాలో తెలీడం లేదు!" అన్నాడు బొంగురు గొంతుతో ప్రసాంత్.

     అతని షర్టు బటన్స్ విప్పుతూ అంది.

    "మధ్యాహ్నం నుంచీ ఏదో చేస్తూనే వున్నావుగా!" అంది. ఆ మాటతో తన మగతనం మీద ఆమె సవాల్ చేసినట్లు అనిపించి రెచ్చిపోయాడతను. అతని హస్తాలు ఆమె పిరుదులని నొక్కిపట్టాయి. సిల్క్ లంగాకిందినుంచి మెత్తమెత్తగా... అతని చేతులకి ఆమె పిరుదుల స్పర్శ......... అతనిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించసాగింది.

    ఆమె పెదవులు చిత్రంగా వంపులు తిరిగాయి. లిప్ స్టిక్ వేసుకొన్న పెదవులని నాలుకతో తడి చేసుకోగా వింత మెరుపులు మెరవడ ప్రారంభించాయి.

     "సల్మా!" పిలిచాడు. అతని గొంతులోమార్పుని ఆమె పసిగట్టింది. ఉద్రేకంతో అతని శరీరం కొద్దిగా కంపించడం సల్మాకి తెలుస్తూనే వుంది.

     "ఏమిటి?" అంది గుసగుసగా.

     అతని ఛాతీపైన చేత్తో రాస్తోంది ఆమె.
 
     "నిన్ను చంపేయాలనుంది!" అన్నాడు ప్రశాంత్.
 
    "చంపేసి ఏం చేసుకొంటావు?" అడిగింది సల్మా. గుండ్రని జబ్బలని ఒకదాన్ని ఒకటి నొక్కుతూ అప్పుడు చూశాడు మళ్లీ ఆమె వక్షశిఖరాల్లోని నిగనిగల్లోగల బిగువుని.

     "నీ అందాన్ని ఈ విస్కీలో కలుపుకొని తాగేస్తాను!" అన్నాడు.

     ఆమె వక్షోజాలు ఎగిరి పడేలా నవ్వింది.

     "నీ చేతుల్లో ఏమైపోడానికైనా నాకిష్టమే ప్రశాంత్. అందుకు ఇష్టపడే నేను వచ్చాను" అంది.
 
     తలుపు దగ్గరికి నడిచి దాన్ని మూసి తిరిగి ఆమె దగ్గరికి వచ్చి ఆమె మెడ కింద ఓ చేతిని, నడుంకింద మరో చేతిని వేసి ఎత్తుకుని మంచం దగ్గరికి నడిచాడు ప్రశాంత్.

    ఆమెని మంచంమీద పడుకోబెట్టి ఆమెమీదకు వంగా డతను.

     "సల్మా! ఐలైక్ యూ!" అన్నాడు. ఆమె గుండెల మీద అతని చేతులతో సున్నితంగా రాస్తున్నాడు.
     ఆమె అతని వీపు చుట్టూ  చేతులువేసి  మీదకి లాక్కుంది.

     ఆమె శరీరంలోని ఎత్తు పల్లాలతో అతను ఆడుకోవడం ప్రారంభించాడు.

     "ఐ లవ్ యూ ప్రశాంత్!" కళ్లు మూసుకుని చేతులతో అతని వీపు పైన రాస్తూ మత్తుగా అంది సల్మా.
 
     ప్రశాంత్ ఆ మాటకి సమాధానం చెప్పలేదు.

    "డియర్... డియర్... డియరెస్ట్.

    ప్రశాంత్!" ఆమె గొంతు హస్కీగా వుంది. ఆమె కళ్ళమీద, చెంపలమీద, పెదవులమీద, మెడమీద ముద్దులతో నింపేసతున్నాడు. అతని చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి.

    "ప్రశాంత్!"

    "........................... ... ... ... ... .. .. ... ... ... "

    "ప్ర.....శాం.......త్....!" మత్తుగా పిలుస్తోంది సల్మా.

     "ఏమిటి?" అన్నాడు.

     "ఆడవాళ్లలో నిన్ను బాగా ఆకర్షించేదేమిటి?" సల్మా అతని చెంపలని అరచేతులతో సవరదీస్తూ అడిగింది.
 
     ఒక్క క్షణం ఆమె వైపు చూశాడు ప్రశాంత్. అతని పెదవుల మీద మెల్లిగా ఒక చిరునవ్వు పరుచుకుంది. ఆ నవ్వులో కొంటెతనం సల్మాకి ఎంతో ఇష్టం. నవ్వటం కూడా ఒక గొప్ప కళ అని ప్రశాంత్ నవ్వుని చూసిన ప్రతిసారీ అనుకుంటుందామె. ఆడవాళ్ళలో తనవి ఆకర్షించేదేమిటి అని ఆమె అడిగిన ప్రశ్నకి అతను ఇవ్వబోయే జవాబు కోసం ఆమె ఊపిరి బిగపట్టి చూస్తోంది.

     ఎరుపు మెరుపుతో తడితడిగా మెరుస్తున్న ఆమె పెదవులు సన్నగా ప్రకంపిస్తున్నాయి.

     అతని చూపులు ఆమె నున్నటి మెడమీదకి....

     ఆమె బిగువైన... .గుండ్రటి... వక్షశిఖరాల మీదకి ప్రాకాయి.

     అతను కిందకి వంగి... వాటిని సున్నితంగా తన పెదవులతో ముద్దు పెట్టుకుని..."ఇవి!" అన్నాడు.

     ఆమె గుండె ఝల్లుమంది.

     లోపలెక్కడో ఏదో ద్వారం తెరుచుకున్నట్లు....

     హఠాత్తుగా ఎక్కడో వర్షపు జోరు మొదలైనట్టు.

     ఏదోలా అయిపోయింది తనువంతా....

     గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.

    "రియల్లీ!" అంది....

    "ఊ......" అందుకున్నాడు.

     "ప్రశాంత్! మగాడంటే ప్రశాంత్.. అనే నిర్వచనం ఎంత మందికి తెలుసు.......?" గోముగా అడిగింది.

     "ప్రస్తుతానికి నీకు... మాత్రమే!"

    "అంటే ఇంకా ఎవరికైనా...?" చిరుకోపంతో అందామె.

     "ఎవరి గురించో ఆలోచించే టైంలేదు నాకు...! ఏ పనిలో నిమగ్నమై వుంటే... ఆ పని పట్ల నాకు ఏకాగ్రత, దీక్ష పెరిగిపోయి..... ప్రపంచాన్ని మర్చిపోయి... కర్తవ్య సాధనలో మునిగిపోవాలని వుంటుంది!" అంటూ ఆమె పెదవులను తన నోటితో మూసేశాడు.

     ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతూ... తియ్యగా మూల్గింది.

     అతని చేతుల్లో ఆమె ఎత్తుపల్లాలు చదును చెయ్యబడుతున్నాయి.
 
     ఆమె శరీరపు వెచ్చదనం అతన్ని పిచ్చెక్కిస్తోంది.

     ఆమె చెయ్యి అతని వీపు మీద నుంచి... ప్రక్కకి జారింది.

 Previous Page Next Page