Previous Page Next Page 
హనీమూన్ పేజి 37


    "అవున్రా! ఎవరిదాకానో ఎందుకు? మీ హిరణ్మయిమాటేమిటి?" అంటూ మా బందువులమ్మాయ్ హిరణ్మయి సంగతి గుర్తు చేశాడు.

    "హిరణ్మాయి మా మరదలు! పెళ్ళి జరుగుతూండగా పెల్లివాళ్ళు ఏవో లాంచనాల దగ్గర పేచి పెట్టేసరికి వళ్ళుమండి పెళ్లిపిట ఎత్తి పెళ్ళి కొడుకుమీదకు  విసిరేసి తన దారిన తను ఇంట్లో  కెళ్ళిపోయింది. దాంతో పెల్లివాళ్ళు  చెల్లాచేదురాయి  పారిపోయారు. దానికి  తోడు పెళ్లికూతురు బయటనుంచి  రాళ్లతో  పెళ్ళివారి తలలు పగలగోడుతోందన్న పుకారు లేవదీశారెవరో ! ఆ సిన్ చూసి తీరవలసిందే! రెండు నిమిషాలలో మొత్తం పెళ్లిపందిరి ఖాళి అయిపోయింది.

    తమాషా ఏమిటంటే కాసేపటి తర్వాత పెళ్లికొడుకే వచ్చి క్షమార్సనలు చెప్పుకుని ఆమె మెడలో  తాళి  కట్టేశాడనుకోండి! అది వేరే సంగతి.

    "అవును! హిరణ్మాయి  మాత్రం జాన్సీ లక్ష్మిబాయ్  కంటే తక్కువెముంది?" అన్నానేను.

    ఝన్సీలక్ష్మిబాయ్ గడిపిన ప్రదేశాలన్నీ చూశాక మళ్ళి పోర్ట్ నుంచి  కిందకు దిగాము.

    మొత్తంమీద పోర్టు మేము ఎదుర్చూసిన త్రిల్ లభించనేలేదు. ఆసక్తికరంగా ఏది కనిపించలేదు.

    కిందకు దిగాక మెయిన్ బజార్  వేపు నడవసాగాము. కాస్తదూరం నడిచాక ఓ పెద్దమనిషి ఆ ప్రాంతంలో మంచి హొటల్ ఎక్కడుందో చెప్పమని ఇంగ్లీష్ లో అడిగాము. అతనికి  మా ఇంగ్లీష్ అర్ధం కాలేదు.

    "క్యా చాహియే" అంటూ హిందిలో అడిగాడు మళ్ళి.

    అతన్ని వదిలేసి మరో వ్యక్తినిఅడిగాడు సారధి. అతనికి ఇంగ్లీష్ రాదనీ  తెలిసిపోయింది.

    వాళ్ళిద్దరూ మా గురించీ హిందిలో మాట్లాడుకొసాగరు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ మాటల తాత్సర్యం  తెలిసిపోతూనే వుంది.

    "బ్రిటీష వాళ్ళు మనల్ని వదిలినా వాళ్ళ బాషనుమాత్రం వదలటం లేదు సిగ్గులేనివాళ్ళు!" అన్నాడు ఒకతను మరోకతనితో.

    "అవును! ఈ దక్షిణ దేశస్తులందరూ ఇంతే! ఇంగ్లీష్ అంటే పడి చస్తారు. దాసీ వెధవలు" అన్నాడు ఇంకొకడు.

    "ఏయ్ మిస్టర్- వన్ మినిట్" అంటూ వాళ్ళ దగ్గరకు కోపంగా నడిచాడు సారధి.

    అక్కడినుంచి వాడి హింది పొంగిపొరలిపోయింది. హింది, ఇంగ్లీష్ తెలుగూ అన్ని కలిసి  వారిమీద వీర విహారం చేశాడు అయిదు నిమిషాల పాటు.

    "ఏమిటి? మేము  ఇంగ్లీష్ కి దాసీ వెధవలమా! అయితే మీ సంగతేమిటి? వాళ్ళ దుస్తులు , వాళ్ళ  ఆచారాలూ, వాళ్ల హెయిర్ స్టయిలూ ఇవన్ని మీరెందుకు అనుసరిస్తున్నారు? ఇంగ్లీషు మగజ్తేన్స్ ఎందుకు చదువుతున్నారు? ఇంగ్లీషు సినిమాలెందుకు చూస్తున్నారు? ఇవన్ని కావాలి గని వాళ్ల  భాష మాట్లాడ్డానికి  మాత్రం  చెదయిపోయిందా? ఆడలేక మద్దేలోడు  అన్నట్లు మీకు మాట్లాడడం చేతకాక మాట్లాడేవాళ్లని పరిహసిస్తూన్నారా?" అంటూ దులిపి పారేశాడు.

    వాళ్ళిద్దరిలో ఒకడు ఆ అవమానం భరించలేక కోడతానికి  సారధి మిదకోచ్చాడు గాని నేనూ ముందుకు దూకేసరికి రెండోవాడు అతనికి సర్దిచెప్పి తీసుకెళ్ళి పోయాడు.

    బజార్ రోడ్  చాలా ఇరుగ్గా, బాగా రష్ గా  ఉంది నడవటానిగ్గూడ స్ధలం చాలటంలేదు.

    "ఈ ఉత్తర దేశంలో అన్ని ఊళ్ళూ ఇంతేరా అబ్బాయ్ ! తెగ ఇరుకు!" అన్నాడు తాతయ్య తను టూర్ వెళ్ళినప్పటి విశేషాలు గుర్తు తెచ్చుకుంటూ.

    ఆడపిల్లలు స్తేకిళ్ళమీద తిరగటం చాలా తరచుగా కనబడే దృశ్యం అక్కడ.

    మాకది  చాలా ఆశ్చర్యం వేసింది. మా ఊళ్ళో ఆడపిల్లలేవరూ స్తేకిల్స్ తొక్కారు.

    అధవా ఒకరిద్దరు తొక్కినా వాళ్ళని కుర్రాళ్ళందరూ వెంబడించి, నానా అల్లరి పట్టించిగాని వదలరు.

    ఎంతదూరం నడచినామా వూళ్ళో కనిపించే మంచి హొటల్ ఒక్కటికూడా కనిపించలేదు మాకు. మాకు  కనిపించిన చాలా హొటళ్ళు మా ఊళ్ళోని గునపంగాడి హొటల్  కంటే ఆధ్వన్నంగా ఉన్నాయ్.

    వాటిల్లో రోడ్డుకానుకునే పెద్ద కళాయిలున్నాయి పొయ్యి మీద వాటిలో వేడి జిలేబి, గులాబ్ జామ్ లు తాయారు చేస్తున్నారు. మరో కళాయిలో పాలు కాగుతున్నాయి. రోడ్డుమీద దుమ్మంతా వాటిల్లోనే చేరుతోంది. అయినా ఎవరూ ఆ విషయం  పట్టించుకోవటంలేదు. ఎవర్దారిన వాళ్ళు నిలబడే ఆ దుమ్ము జిలేబి తినేసి  మురికిపాలు తాగి వెళ్ళి పోతున్నారు.

    బాగా చదువుకున్నవారూ, సంస్కారం ఉన్నవాళ్ళూ కూడా ఆ దుమ్ము విషయం ఏ మాత్రమ పట్టించుకొకపోవడం మాకెంతో ఆశ్చర్యం కలిగించింది.

    "మనం ఊరికే  ఆరోగ్యం , శుభ్రత అని అన్ని చూస్తాంగాని వాళ్ళు చూడు! ఆ అడ్డమయిన  చెత్తా తినేస్తున్నా ఎంత  ఆరోగ్యవంతంగా ఉన్నారో?" అన్నాడు సారధి.

    "అన్నిశ్రద్దలూ తీసుకున్నా మనలాంటివాళ్ళకే అన్నిరకాల జబ్బులూ వస్తాయి" అన్నాను.

    కొద్దిదూరం నడిచాక ఓ చోట అంతగా దుమ్ముపడని మరోహొటల్ కనిపించింది. అందరం అక్కడే కూర్చుని వేడివేడి గులాబ్ జామ్ లు  తిని, దుమ్ముతో కప్పబడిన పాలే తాగేశాము.

    తాతయ్య మాత్రం ససేమిరా ఆ పాలు తాగాన్నాడు. నిజం చెప్పొద్దూ - దుమ్ము పడటంవల్లే కాబోలు! పాలకు మహాచక్కని రుచి వచ్చింది.

 Previous Page Next Page