మరికాసేపు తిరిగేసరికి కాళ్లు నొప్పులు పుట్టసాగినయ్ అందరికి!
ఓ టెంపో తీసుకుని స్టేషన్ చేరుకున్నాం. అప్పటికి సాయంత్రం ఏడయిపోయింది.
ఆ రాత్రికి అందరం ఫస్టక్లాస్ వెయిటింగ్ హల్లో పడుకున్నాం. అటెండెంట్ కి ఓ రూపాయి కొట్టేసరికి వాడు ఆనందంతోసెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు.
"విడి ఉద్యోగమే బావుందే! రోజుకి వందరూపాయలు సంపాదించేట్లున్నాడు" అన్నాడు సారధి.
మర్నాడు ఉదయమే లేచి పాసింజేర్ టైన్ ఎక్కాము. అంత కంటే వేరే గత్యంతరం లేదు.
ఉత్తరప్రదేశ్ లోని ఊళ్ళు చూస్తుంటే చాలా తమాషాగా అనిపించింది. అన్ని పాతబడిన కట్టడాల్లాగానే ఉన్నాయ్. ఎక్కడా కొత్తదనం గాని ఆధునిక వాసనలు గాని లేవు. అక్కడి హింది మరి ఘోరం గా ఉంది. మాకు ఒక్కముక్క కూడా అర్ధం కావటంలేదు. ఎలాగాయితేనేం ఆ మర్నాడు తెల్లారుజామున అలహాబాద్ కి చేరుకున్నాం. అలవాటు ప్రకారం దర్జాగా పస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ లోకి నడిచి స్నానాలూ, వగ్తేరా ముగించి సామానంతా క్లోక్ రూమ్ లో పడేసి స్టేషన్ బయటి కోచ్చాము.
రోడ్డుమీదకొచ్చి నాలుగడుగులు వేశామో లేదో రోడ్డుకి రెండు ప్రక్కలా ఉన్న హొటల్ వాళ్లు మమ్మల్ని చూచి తమ హొటల్ కే రమ్మంటూ గట్టిగా కేకలు వేయసాగారు.
మొదట్లో మాకు వాళ్ళ కేకలు అర్ధం కాలేదు. మేమేదయినా తప్పు చేస్తున్నామేమో అందుకే వాళ్ళందరూ కలసి అలా చేతులూపుతూ కేకలు వేస్తున్నారు అని అనుకున్నాం గాని- వాళ్ళలో ఒకడు హొటల్ అరుగుమీద నుంచి దూకి మా దగ్గరకొచ్చి బ్రతిమాలడం మొదలు పెట్టేసరికి అసలు సంగతి తెలిసింది.
"పోనీలెండి వాడంత బ్రతిమాలుతున్నాడు కదా! వాడి హొటల్ కే వెళదాం!" అంది సారధి భార్య జాలిగా.
"అవునండి పాపం! మనం వెళ్ళాకపోతే వాడు ఎడ్చేసేటట్లున్నాడు" అంది మా ఆవిడ.
మాక్కూడా ఆ మాట నిజమేననిపించింది.
ఈ లోగా వాడు తాతయ్యను బలవంతంగా తన హొటల్ కు లాక్కెళ్ళి కూర్చోబెట్టేశాడు.
నిజానికవి హొటళ్ళన్న సంగతి మాకు మొదట తెలిలేదు. రోడ్డు మీదకు మెరసిపోయే పెద్ద ఇత్తడి దబరాలు-వెనుక బెంచీలు అంతే!
అందరం వెళ్ళి బెంచిలమీద కూర్చున్నాం.
"ఏం కావాలి?" అంటూ హిందిలో అడిగాడు వాడు.
మాకేం చెప్పాలో తెలిలేదు.
"ఇడ్లి ఉందా?" అనడిగాడు సారధి హిందిలో
వాడికి అర్ధం కాలేదు.
"ఇడ్లివా?-కౌన్ సి ఇడ్డిలి?" అంటూ ఎదురుప్రశ్న లేశాడు.
"దోశె హ్తెక్యా " అనడిగాడు సారధి.
"దోశె కౌన్ సి దోశేజి?"
ఇక ఇలా లాభం లేదని వాడినే అడిగాడు సారధి. "నీ దగ్గర ఏమున్నాయో చెప్పమని."
"కచోరి ఖాయియే."
"కచోరి అంటే ఏమిటి?"
వాడు ఓ గిన్నెలోనుంచి వో గుండ్రని వస్తువు చూపాడు.
"అబ్బ బావుందండి అదేమిటో తిందాం" అంది మా ఆవిడ.
"ఆరు కచోరి" అనబోయి నాలిక్కరచుకుని "ఒక కచోరి" అని చెప్పాము. వాడు ఒక కచోరి ప్లేట్లోపెట్టి దానిమీద అదేదో నల్లని చట్ని వేసి ఇచ్చాడు.
అదెలా వుందో రుచి చూసి చెప్పమని మా ఆవిడనడిగాము. బాగుండంటే అప్పుడు మాకూ అర్దరివ్వవచ్చని మా అభిప్రాయం. ఎందుకంటే అడివరకోసారి ఇలాంటి అనుభవం జరిగింది మాకు. ఒకసారి అందరం ఎవరింట్లోనో పెళ్ళికని హ్తేద్రాబాద్ వెళ్ళాం. పెళ్ళి అయిపోయాక తిరిగి వచ్చేప్పుడు ఓ హొటల్ కెళ్ళాం. అక్కడ 'ఏమున్నాయ్' అన్న ప్రశ్నకు సర్వరు ఓ లిస్టు చదివాడు. ఆ లిస్టులో కొన్ని అంతవరకూ మేము వినని పదార్ధాల పేర్లు వినిపించినయ్. వాతోల్లో 'బిస్ బిలే బాత్' మమ్మల్ని బాగా ఆకర్షించింది.
"అదేదో చాలా బాగుండేట్లుందండి! అదే తెప్పించండి!" అంది మా ఆవిడ. అందరికి వెంటనే బిస్ బిలే బాత్ తెప్పించాం.
తీరా తెచ్చాక చూస్తే ఏముంది? సాంబారు అన్నం- నాలుగు చిప్స్ ఇచ్చాడతను. అందరికి వళ్ళు మండిపోయింది. "తెల్లారి లేస్తే ఇంట్లో రెండుపూటలా మెక్కె సాంబారన్నం తినడానికే ఈ హొటల్ కొచ్చింది?" అంటూ విసుక్కున్నాడు సారధి.
చిన్నిగాడు అసలా ప్లేట్ ముట్టుకొనే లేదు.
మా ఆవిడా కూడా బలవంతగా సగమే తింది. మేముమాత్రం బలవంతంగా అంతా తినేశాం తీరా బిల్లు చూస్తే ఒక్కో ప్లేట్ కి అయిదు రూపాయల చార్జి చేశాడు.
"అమ్మో! అయిదురూపాయలా దీనికి? దిని బదులు నాలుగున్నరకి పుల్ మిల్స్ వచ్చేదిగా! లేదా మనకిష్టమ్తెన రావ్వదోసేలు , ఎమ్మెల్యే పెసరట్లు తినేవాళ్ళం! గోంగముండా కొడుకులు ఇంత మోసమా?" అంది సారధి భార్య.
ఆ రోజునుంఛి కొత్త వస్తువేద్తేనా తినాలపిస్తే....ముందు ఒకరు రుచిచూసి బాగుందని సర్టిఫికేట్ యిస్తేనే రెండోవారు తినాలని అనుకున్నాము.
మా ఆవిడ కచోరి ఓ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంది. అంతే, హఠాత్తుగా ఆమె పళ్ళంతా జలదరించింది.


