"పరిక్షలు పాసవటం వేరూ-హింది రావటం వేరూనయ్యా! ఆ అటెండరు ఇందాకటినుంచి మిమ్మల్ని బయటకు పొమ్మని ఒకటే తిడుతూంటే మీరు అర్దమయినట్లు చిరునవ్వుతో వింటూన్నారు."
సారధి మొహం వాడిపోయింది.
"వాడు తిడుతున్నాడా?"
"కొంచెం పెద్ద తిట్లతో."
"అయితే వాడి చొక్కా పట్టుకుంటాను"
"అక్కర్లేదు.....!వాడు పోలిస్ ని తిసుకోస్తానంటున్నాడు."
మాకు గుండె ఝల్లుమంది 'పోలిస్ 'పేరు వినేసరికి ఎవరితోనయినా ఎలాంటి పెచికయినా దిగవచ్చు గాని పోలిసుల చేతికి మాత్రం ఏ పరిస్ధితుల్లోనూ చిక్కకూడదు అన్న సూక్తి ఎన్నోమార్లు మాకు అనుభావయింది.
"అయితే సామాను తీసుకుని బయటికెళ్ళిపోదాం పదండి" అంది మా ఆవిడ
వెంటనే అందరం సామాను తీసుకుని బయటకు బయల్దేర బోయము కాని మిలటరీ ఆఫీసరు మమ్మల్ని చూసి నవ్వాడు.
"మీరు ఇంతకాలం మనదేశంలో లేరా?"
"ఎందుకలా అడిగారు?"
"లేకపోతే ఏమిటయ్య! ఆ అటెండర్ గాడికి ఓ రూపాయ్ పడేసి హాయిగా వాడితో సేవలు చేయించుకొక-వాడు గెంటుతూంటే వెళ్ళిపోతానంటారేమిటి?"
"అంటే ....వాడు లంచం ....అయ్ మిన్ ....రూపాయి తీసుకుంటాడా?"
అతను మళ్ళి విరగబడి నవ్వాడు.
"మీతో మాట్లాడడం చాలా ఎంటర్ టేయినింగ్ గా ఉంది. లంచానికి మనదేశంలో 'సలాం' కొట్టానివాడేవాడయ్య-అహ! నాకు తేలికడుగు తాను! అందులోనూ ఇఅది ర్తేల్వే! ర్తేల్వే వాళ్ళ జీతాలు ఎంత దారుణంగా ఉంటాయో మీకు తెలుసా? పావలా ఇచ్చినా కలలకకద్దుకని తీసుకునే క్లాస్ త్రి ఉద్యోగస్తులే బోలెడుమంది ఉన్నారు. ఇక క్లాస్ ఫోర్ సంగతి చెప్పేదే ముంది?"
"ధాంక్యూ సార్" అన్నాన్నేను.
వెంటనే సారధి జేబులోనుంచి రూపాయికాగితం తిసి అటెండర్ కిచ్చాడు.
అంతే! అటెండెంట్ మొత్తం ప్రవర్తన మారిపోయింది. వాడి మొఖంలో ఎక్కడలేని గౌవరం కనబడుతోంది. పరుగుతో వెళ్ళి బక్కెట్టు నిండా వేడినిళ్ళు తెచ్చిఇచ్చాడు స్నానం చేయమని. మేము స్నానాలు చేసి బట్టలు మార్చుకుని సిద్దమయ్యేవరకూ మాకు స్వంత కూలికంటే దారునంగా సహాయం చేశాడు. ఆఖర్లో మేము ఇంకో అర్ధరూపాయ్ ఇచ్చాం ఆనందం పట్టలేక.
ఆ తరువాత సామానంత క్లోక్ రూంలో పడేసి స్టేషన్ బయట కొచ్చాం. టేం పోలు, గుర్రబ్బళ్ళూ రెండూ ఉన్నాయ్ అక్కడ. గుర్రబ్బండి వాళ్ళిద్దరూ మమ్మల్ని చుట్టూముట్టారు.
"ఫోర్ట్ జానా హ్తె" అన్నాడు సారధి అయిదు నిమిషాలు తడుముకుని.
"దాస్ రూపయ్" అన్నాడొకడు.
"చార్ రూపయ్" అన్నాడింకొకడు.
కొంచెం సేపు బెరలాడాక చివరకు రెండు టాంగాల్లో అందరం ఫోర్ట్ కి చేరుకున్నాం! ఊరిమధ్యలో చాలా ఎత్తుగా ఉందది. దానిని మన మిలటరీవాళ్ళు అధినంలోకి తీసుకున్నారు కాబోలు చాలాచోట్ల వాళ్ళ ఆఫీసులున్నాయ్.
లోపల కెళ్ళేముందు మమ్మల్నందరిని ఆపి సోదా చేసి అప్పుడు వదిలారు. ప్తెన భావనమంతా శిధిలావస్ధలో ఉంది. ప్తెనుంచి చూస్తే జాన్సీ నగరమంత చక్కగా కనబడుతుంది. ఓ పక్క పెద్ద బంగళ దాని దగ్గరే ఇంగ్లీష్ వాళ్లు యుద్దంలో ఉపయోగించిన ఫిరంగి ఉంది.
కోట వెనుకవేపు కెళ్ళాము. అక్కడోచోట ఓ పెద్ద బోర్డు పెట్టి వుంది.
"ఈ ప్రదేశంనుంచే జాన్సీలక్ష్మిబాయ్ గుర్రం ప్తె దూకి పారిపోయింది" అని రాసివుంది దానిమీద ఇంగ్లీషులో అక్కడినుంచి అందరం కిందకు చూసేసరికి కళ్ళు తిరిగినట్లనిపించింది. అంత అగాధం!
"గుర్రం ప్తె దూకిందంటే, గుర్రంతో సహా దూకిందా? లేక కింద గుర్రాన్ని ఉంచి ప్తెనుంచి గుర్రంమీదకి దూకిందా?" అనడిగాడు సారధి.
పక్కనున్న పెద్దమనిషి మా అనుమానం తీర్చమని ఇంగ్లిష్ లో అడిగాము. అదే మేము చేసిన పెద్ద పొరపాటు.
అక్కడినుంచి అతను ఇంగ్లీషు మాట్లాడడం ప్రారంభించాడు. మొట్ట మొదటి సారిగా ఉత్తర హిందూదేశం ఇంగ్లీషు అనుభవమయింది మాకు. చాలా సేపటివరకూ అతను మాట్లాడేది హింది అని సారధి, కాదు ఇంగ్లిషని నేనూ వాదించుకుంటూనే ఉన్నాం.
చివరకు తాతయ్యతో అందరం కలసివచ్చిన నిర్ణయం ఏమిటంటే అతను ఇంగ్లీసు మాట్లాడాడని. లేకపోతే అతనంత బాధపడుతూ, ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ, అన్ని భంగిమల్లోకి మారాడని అన్నాడు తాతయ్య అంతకు ముందేప్పడో పదేళ్ళక్రితం ఓ ఉత్తరదేశస్తుడు మా ఊరు వచ్చినప్పుడు అతని ఇంగ్లీషు విన్నారట వాళ్ళు. అది ఇది ఒకటిగానే ఉంది కాబట్టి ఇది ఇంగ్లీషే ఆయుంటుందని తాతయ్య అయిడియా! ఉత్తరదేశస్తులు హింది అధికారభాషగా ఉండాలని ఎందుకంత గొడవచేస్తారో మాకు అర్ధమయింది ఎంతో సానుభూతి కూడా దూకిందని!
"అబ్బ! ఎంత ద్తేర్యం !" అంది మా ఆవిడ.
"ఆ రోజుల్లో ఆడాళ్ళలా ఉండేవారు కాబోలు" అంది సారధి భార్య.
"ఆ రోజూ లేదు-ఈ రోజూలేదు! ఆడళ్ళేప్పుడు అంతే! మొండి తనం వచ్చిందంటే బ్రహ్మను కూడా లెక్క చేయరు" అన్నాడు తాతయ్య.
"అంతేనంటావా?" అన్నాడు సారధి సాలోచనగా.