ఆ క్షణం నుంచి సామాను గురించీ పట్టించుకోవడం మానేశాము.
మద్యాహ్నం ఒంటిగంటయినా జాన్సిలో ఇంకా బాగా చలిగానే ఉంది. మేమొచ్చిన ర్తెలు కదిలి వెళ్ళిపోసాగింది.
అంతవరకూ మాతో ప్రయాణం చేసిన తెలుగాళ్ళు మాకు చేతులు పూపుతూ "ఫిర్ కభిమిలేంగే" అంటూ అరచారు.
మేము ర్తేలేక్కిన దగ్గర్నుంచి దిగేవరకుమా తోటి ప్రయాణికులు మాట్లాడే భాష మాకు చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. ఆశ్చర్యం ఎందుకంటే - మద్రాసు నుంచి విజయవాడ స్టేషన్ వచ్చేవరకూ కారేజ్ లో అందరూ తమిళం మాట్లాడారు. విజయవాడ వచ్చాక మళ్ళి వాళ్ళే తెలుగు మాట్లాడడం మొదలు పెట్టి వార్దావరకూ తెలుగే మాట్లాడారు. హఠత్తుగా వార్ధ నుంచి మళ్ళి వాళ్ళ భాష మారిపోయింది. అందరూ వచ్చిరాని మారాఠి మాట్లడేశారు.
"కాపాయిజేతుమారా-రోటి చాంగ్ వాహ్తే ?" అంటూ మళ్ళి వాళ్ళే ఇటార్సి నుంచి ప్యూర్ హింది మాట్లడేయటం ప్రారంభించారు. ఇలార్తెలు ఎన్ని రాష్టాలు దాటితే అన్ని భాషలూ మాట్లాడేసేలా కనిపించారు మాకు.
వాళ్ళలా మాట్లాడడం ఆనందం కలిగించిన కారణం ఏమిటంటే వాళ్ళను చూస్తే 'హింది' అదికార భాష కావాలి అని అరచే సన్యాసులకు కొంతయినా కనువిప్ప కలుగుతుందేమోనని!
"ప్రజల్లో రాష్టం, భాష, కులం అనే అడ్డుగోడలు పోవాలంటే రేడియోలోనూ, టి వీ లోనూ స్లోగన్స్ రాసి, నాటికలేసి ప్రజలను భయ భ్రాంతులను చేయకూడదు, చౌకగా దేశంలోని మారుమూల ప్రాంతలకు కూడా అందరూ ప్రయాణం చేయగల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే దాన్ని మించిన పబ్లిసిటి లేదు. వీటన్నిటిని ఆ ప్రయాణాలే ఒకరి గురించీ ఒకరు తెలుసుకునే విజ్ఞానమే రూపుమాపుతాయ్" అన్నాడు సారధి.
అందరం ముందు ర్తేల్వే క్యాంటిన్ కెళ్ళి భోజనానికి ఆర్డర్ చేశాము. ఈ విషయంలో ర్తేల్వే లను మెచ్చుకోవాల్సి ఉంది. ప్రయాణికులకు ఎంత చెత్త పెట్టినా, దోచుకున్నా-భోజనం మాత్రం దేశమంత ఇంచుమించుగా ఒకే పద్ధతిలో ఉంటుంది. చపాతీలు, అన్నం, కూరలు ,పప్పు, పెరుగు-ఇవి దేశంలో ఏమూల ర్తేల్వే కాంటిన్ కెళ్ళినా దొరుకుతాయ్ ఇందువల్ల మనం ఏ రాష్టానికి ప్రయాణం చేసినా మన ఆహారపు అలవాట్లు పెద్దగా మార్చుకానక్కరలేదు.
భోజనాలయ్యాక సామాను మేమే మోసుకెళ్ళి వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాము. అందరం స్నానాలు వగ్తేరా కానిచ్చి, సామానంతా క్లోక్ రూమ్ లో పడేసి పోర్టు చూడ్డాని కెళ్ళాలని మా ప్లాన్ తీరా స్నానానికి రడి అయమో లేదో వెయిటింగ్ రూమ్ అటెండెంట్ వచ్చి ఓ రిజిష్టర్ మా ముందుంచాడు.
"క్యాహ్తె?" అన్నాన్నేను అయిదో క్లాస్ లో చదివిన హింది గుర్తు తెచ్చుకుని.
"ఆఫ్ కాటికేట్ నెంబర్ లిఖ్ దిజియే" అన్నాడు వాడు ప్యూర్ హిందిలో.
వెంటనే మా టికెట్లన్నీ తిసి రిజిష్టర్ లో రాయబోనుగాని వాడు రిజిష్టర్ ఠకిమని లాగేసుకుని "యే ఫస్టు క్లాస్ వేయింటిగ్ రూమ్ హ్తె" అన్నాడు కోపంగా.
మాకు పరిస్ధితి అర్ధమయిపోయింది.
మేము సెకండ్ క్లాస్ పక్షులమని, అంచేత ఫస్టుక్లాస్ వెయిటింగ్ రూములోకి రాకూడదని వాడి ఉద్దేశ్యం.
నేను ఇంకా ఎక్కువ హింది మాట్లాడడం బావుండదు గనుక సారధిని మాట్లాడమన్నాను ఎందుకంటే వాడికి హింది బాగావచ్చని వాడికి నాకూ చాలా అనుమానం! అందుకు సాక్ష్యంకూడా ఉంది. అదేమిటంటే హింది 'రాష్ట' పరీక్ష పాసయినట్లు హింది ప్రాచారసభ వారిచ్చిన సర్టి ఫికేట్! వాడు కాఫిగొట్టి పాసయాడని మా ప్రెండ్స్ అంతా అనేవాళ్ళు గాని నేను వాళ్ళ మాటలు లేక్కచేయదల్చుకోలేదు. ఎందుకంటే కాఫి కొట్టటాని కయినా యెంతో కొంత హింది వచ్చి ఉండాలికదా!
సారధి అటెండర్ వంక చూసి చిరునవ్వు నవ్వాడు.
"అరె భయ్య! హమ్ ర్తేల్వే- తుయ్ ర్తేల్వే-జగడాక్యోం" అన్నాడు ర్తెల్లో సర్దార్ జి చెప్పిన మాటలు గుర్తుంచుకుని. "ఎప్పుడయినా సరే మీకు ర్తేల్వే వాళ్ళతో పేచివస్తే మేముకూడా ర్తేల్వేవాళ్ళమే లేవయ్య అంటూ బుకాయించండి! దెబ్బకు దారికోస్తారు వాళ్ళు" అన్నాడతను. అందుకే సారధి ఆ మంత్రం ప్రయోగించాడు.
వాడు మరింత కోపంతో మండిపడ్డాడు. అడ్డమయిన హింది ప్రయోగించి ఏదేదో మాట్లాడసాగాడు. మధ్యమధ్యలో మాత్రం "ఆఫ్ ఫారన్ బాహర్ చలే జాయియే" అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మేము అతను చెప్పేదంతా అర్ధమయినట్లు చిరునవ్వుతో తల ఊపసాగాము. అలా వింటే వాడు శాంతించి మమ్మల్ని వదిలేస్తాడేమోనని మా ఆలోచన.
మ గొడవంతా చూసి అక్కడేవున్న ఓ మిలటరీ ఆఫీసరు మా దగ్గరకొచ్చాడు.
"మీకు హింది రాధనుకుంటాను" అన్నాడాయన తెలుగులో.
"నాకు వచ్చులెండి!" అన్నాడు సారధి కొంచెం ఫోజిచ్చి "నేను రాష్ట పాసయ్యాను."
అతను ఆశ్చర్యపోయాడు. "రాష్ట్రా?"
"అవును!"
"అంటే ఏమిటి?"
"ఓ హింది పరిక్ష-"
"అయితే?"
"ఇంకేంలేదండి! అంతే!"
"ఆ విషయం నాకెందుకు చెప్పారిప్పుడు?"
"అదే-హింది వచ్చా, అని అడిగారు కదా!"
ఆయన అయిదునిమిషాలపాటు విరగబడి నవ్వి తర్వాత తల్చుకుని తల్చుకుని నవ్వసాగాడు.
"ఎందుకలా నవ్వుతున్నారు?" అడిగాన్నేను చాలా శాంతంగా.