"ఇంతమందిని బాగాస్వాములుగా వేసుకుంటున్నప్పుడు ఆ వెధవ ఫాన్సీస్టోర్స్ ఎందుకు?స్మాల్ స్కేల్ ఇండస్టి ప్రారంభిద్దాం! బాంక్ లోన్లూ , అవికూడా ఉన్నాయగా-" అన్నాను నేను. సారధి ఆలోచించాడు. "ని ఐడియ బాగానే వుంది!" అన్నాడు. ఆ రోజునుంచి రకరకాల స్మాల్ స్కేల్ ఇండస్టి స్ కి తిరిగి అనేక వివరాలు సేకరించాం.
మిషనరి, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే లాబహం ఎక్కువ, ఏది ఉత్పత్తి వస్తే డిమాండ్ ఎక్కువ- ఇండస్టి మా పరిశ్రమ ఏ ప్రాంతంలో పెడితే సబ్సిడి ఎక్కువగా దోరుకుతుంది? ఇలా అన్ని పెద్ద రిపోర్ట్ తయారు చేశాము. అన్నిటికి మెదక్ జిల్లా అయితే అన్నివిధాలా లాభకరంగా వుంటుందని తేల్చారు కొంతమంది నిపుణులు.
ఓ పక్క ఇది జరుగుతూండగానే మరోపక్క బోలెడుమంది తెలిసినవాళ్ళు వాళ్ల పిల్లలకూ , బంధువులకూ మా కంపెనిలో ఉద్యోగాలు ఇవ్వమని బ్రతిమాలసాగారు.
వద్దన్నా అన్నిరకాల ఉద్యోగాలకు అప్లికేషన్స్ కొన్నివేలు వచ్చేశాయ్ ఆరునెలలు చాలా వుత్సాహంగా గడిచిపోయింది. అందరికిమా ఆఫీసులో ప్రతిఒక్కరూ ఓ పెద్ద కంపెని ఓనరులాగే మాట్లాడసాగారు.
ఉద్యోగం మీద అందరికి ఆసక్తిపోయింది నిర్లక్ష్యం ఎక్కువయి పోయింది.
ఓరోజు హఠాత్తుగా సారధిప్లాన్స్ మాగిపోయినాయ్. "స్మాల్ స్కేల్ ఇండస్టి లాభంలేదు. ఏ వస్తువు తయారు చేసినా పోటి ఎక్కువగా ఉండేట్లు కనబడుతుంది. దాని బదులు మనమందరం కలసి పాలకోపరేటివ్ సోస్తేటి పెట్టి పాలపొడి ఇతర పిల్లల డబ్బాపాలు-ఇలా రకరకాలప్రోడక్ట్స తయారుచేస్తే బాగుంటుంది. మన ప్రభుత్వ డెయిరీపారం లాగానే మనం కూడా పాకెట్లలో మిల్క్ సప్లయ్ చేయవచ్చు. మీకు "అముల్" ఫ్యాక్టరీ సంగతి తెలుసు కదా! మన కోపరేటివ్ లాంటిదే అది కూడా! నాలాగానే కురియన్ అనే డ్తె నమిక్ ఫెలో దానిని బ్రహ్మాండమయిన ప్రాజెక్టుగా మార్చి పారేశాడు.
అందరూ ఆ రోజునుంచి పాలుగురించే మాట్లాడసాగారు. మేమిద్దరం రెండు నెలలపాటు కరేస్పాండేన్స్ చేసి ఆ ప్రాజెక్టుకు కావలసిన వివరాలన్నీ సేకరించాము.
ఈలోగా ఓసారి మెంబర్స్ అందరితోనూ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడుసారధి. ఆ మీటింగ్ లో సారధి మేనేజింగ్ డ్తెరక్టరుగారు ,నేను చ్తేర్మన్ గానూ ఎన్నికయ్యాము.
మా ఆవిడను చ్తేర్మనుగారి భార్య అని, సారధి భార్యను మేనేజింగు డ్తె రెక్టరుగారి భార్య అని పిలువా'
సాగారు. చుట్టూపక్కవాళ్లందరూ మా పేటలో మిగతా స్త్రీలందరూ మా వాళ్ళిద్దరిని చాలా గౌరవంగా చూడటం ప్రారంభించారు మా ఇళ్ల దగ్గర వచ్చే పోయే స్త్రీల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ రష్ మూలాన ఓ పనిపిల్లను ఆదనంగా ఏర్పాటు చేశాం మేము. కాఫీలూ, టిలూ ఉదయంనుంచి సాయంత్రం వరకూ అతిదులకు ఇస్తూనే వుండేవాళ్ళం.
నెలాఖరయేసరికి పచారి దుకాణంలో ఆదనంగా రెండొందలు బిల్ అయేసరికి ఇద్దరం ఖంగారు పడ్డాము. వెంటనే కాఫీలు ,టిలు అన్ని మానిపించివేశాము. ఆ తరువాత సారధి అయిడియా మారిపోయింది. అందరం కలసి సినిమాహాల్ కడదమన్నాడు ఫిలిమ్ డెవలఫ్ మెంట్ కార్పోరేషన్ వాళ్ళు 75 శాతం లోన్ కూడా ఇస్తారు గనుక అదే తేలికయిన ప్రాజెక్టు అని తేల్చాడు.
అందరూ ఆ ఆలోచన జాగానే ఉందన్నారు. ఎందుకంటే మన దేశంలాంటి దిక్కుమాలిన దేశంలో నిరక్షరాస్యత ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందని, అంచేత ఎలాంటి సినిమాలు తీసినా చూపే జనం రోజురోజుకి పెరిగిపోతారని, అంచేత ఎన్ని సినిమాహల్స్ కట్టినా లాభాలు ఉంటాయని అందరూ పప్పకున్నారు.
"అదిగాక మా వాటాదార్లందరం ఏ సినిమా అయినా ఎన్ని సార్లయినా చూచేందుకు అనుమతి వుండనే వుంటుంది!" అన్నాడు సారధి.
అందరూ అమితానందంతో పొంగిపోయారు.
"కాని ఏ సినిమా అయినా మొదటి రేండువారాలూప్రిలు ఉండకూడదు. అది మన మంచికోసమే!" అన్నాను.
ఆ మాటా నిజమేనన్నారందరూ.
ఆ రోజునుంచి మంచి సెంటర్లో స్ధలంకోసం వెతకటం ప్రారంభించాము. చివరకు మార్కెట్లోనే ఓ మూలగా వున్న స్దాలం బాగుందని అందరూ ఏకగ్రీవంగా తిర్మానిచారు.
అందరం కలసి ఆ స్ధలం ఓనర్ దగ్గరకెళ్ళాం. ఆయన మా అందరికి నెస్ కాఫి తెప్పించాడు.
"ఎందుకు మీకా స్ధలం?" అడిగాడయన.
"సినిమాహల్ కట్టించాలని మా ఆలోచన" అన్నాడు సారధి.
అతను పొంగిపోయాడు.
"అద్భుతమయిన సెంటర్ ! ఏ చెత్త సినిమా రిలీజయిన అక్కడ యాభయ్ రోజులు గరంటిగా ఆడుతుంది!" అన్నాడు.
"మేము రెండు హాల్స్ కట్టించాలని ప్లాన్ లో ఉన్నాం ! ప్తెన ఒకటి కింద ఒకటి."
ఒనల్స్ లో కొంచెం వినయం పెరిగింది.
"అలాగాసార్! చాలామంచి ఆలోచన మీది! తిరుగులేని వ్యాపారం అన్నాడతను.
"చెప్పండి మరి! మీరే ధర కిస్తారో ....అడిగాను నేను టైమ్ చూసుకుంటూ.
"దాందేముందండి! మీకు తెలుసుకదా- ఆ ఏరియాలో రెట్లట్లాఉన్నాయో!"
"తెలుసననుకోండి- అయినా మీరు అనుకున్నది మీరూ చెప్పండి."
"గజం మూడువేలు" అన్నాడతను.