"ఆ విషవాయువు ఇంకా ఉంటుందంటారా?" ఒకాయన అనుమానంగా అడిగాడు.
"ఏమో! హిరోషిమా బాంబు ప్రభావం మొన్న మొన్నటి వరకూ లేదూ?"
అందరికి ఆ మాటతో మనశ్శాంతి కరువయిపోయింది. బండి ఎప్పుడు కదుల్తుంద అని ఆత్రుతగా ఎదురుచూడసాగారు.
సారధి భార్య మా కందరికి 'టి' తీసుకొచ్చి అందించాడు.
అదిచూసి తాతయ్య మండి పడ్డాడు.
"ఇదేమిట్రా-ఇలాంటి వెధవ పిడతల్లో ఇస్తాడు విడుట్టి అడుక్కుతినే వాడిలాగున్నాడు? టి ఇవ్వటానికి కప్పలు కొనే శక్తికూడా లేదు వీడికి-"
నాకు నవ్వాగలేదు.
"అదికాదు తాతయ్య! ఉత్తరదేశంలో టి, పాలు లాంటివాన్ని ఇలాంటి మట్టిపిడతల్లోనే ఇస్తారు. ఎందుకంటే వాటిల్లో తాగి- వాటిని పగల కొట్టేస్తే-'ఎంగిళ్ళు' అంటూ ఉండవ్ గనుక అందరూ ఒకే కప్పులో తాగటంకంటే ఇది మంచిపద్ధతి కదా!"
తాతయ్య ఆశ్చర్యపోయాడు.
"అయితే వీటిని మనం తాతగానే పగలగొట్టేయాలా?"
"అవును! అదిక్కడి ఆచారం"
"అయితే మీ పిడతలన్ని నేనే పగలగోడతా" అన్నాడు చిన్నిగాడు ఉత్సాహంగా.
"మనంకూడా ఎప్పటికయినా ఆంద్రాలో హొటల్ తెరుస్తే ఈ పద్దతే ప్రవేశ పెట్టాలి!" అన్నాడు సారధి.
నేనూ ఒప్పుకున్నాను.
"చాల్లెండి! ఇక ఆపండి!" అంది మా ఆవిడ చిరాకుగా వాళ్ళిద్దరికీ మేము అనేకరకాల వ్యాపారాల గురించీ మాట్లాడుకుంటుంటే ఎందుచేతో పరమ చికాకుగా ఉంటుంది.
అయినాగాని మేమెప్పుడూ నిరుత్సాహం చెందలేదు. మా యిద్దరి మెదడులూ అనేక ఉపాయలతో కిక్కిరిసిపోయి ఉన్నాయ్.
మా విధి చివర్లో ప్రారంభించిన ఓ ప్యాన్సిస్టోర్స్ చూసినప్పుడు మేమూ అలాంటిది ఒకటి తెరచి, ఆ వెధవ ఉద్యోగాలకు రాజినామాచేయాలనీ నిర్ణయించుకున్నాము.
వెంటనే దానికోసం ప్లాన్స్ ప్రారంభించాము.
నాలుగు చెక్క అల్మారాలు. ఒక కౌంటర్, ప్తెన ఆటక!- ఇవన్ని చేయించాలంటే ఎంతవుతుందో, నాలుగురోజులు తిరిగి కనుక్కున్నాము. ఆ తరువాత మా షాపు తెరవడానికి సరయిన షాపుకోసం వెతకంప్రారంభించాము వారంరోజులు చాలాబిజీ అయిపోయాము చివరకు మా వీధిలోనే ఆ ఫాన్సీషాప్ కు పోటి గా పెట్టాలని నిర్ణయించాము చివరకు మా వీధిలోనూ ఆ ఫాన్సీ షాప్ కు పోటోగా పెట్టాలని నిర్ణయించాను. ఎందుకంటే మిగతాచోట్ల పదివేలు పగిడి అడుగుతున్నారు. ఆ తరువాత ప్యాన్సి స్త్పోర్స్ వస్తువులు తాయారు చేసే వివిధ కంపెనిలతో కరస్పాండెన్స్ జరిపాము.
మా వ్యవహారం చూచి మా ఆఫీసర్ లో అందరూ మా మీద ఈర్ష్య పడటం మొదలు పెట్టారు.
"లేపోతే ఎంతకాలం సార్- ఈ వెధవ ఉద్యోగం! రిటైరయెంత వరకూ గోద్దూలా కష్టపడి పాతికవేలు బాంక్ బాలెన్స్ ఉండదు" అన్నం మా చీఫ్ క్లార్క్ తో .
మేము అతి త్వరలో పెద్ద ఫాన్సీ షాఫ్ పెడుతున్నామన్న వార్త ఆఫ్సర్ చెవిన కూడా పడింది. అంతవరకూ మమ్మల్ని పురుగుల్లా చూసిన ఆయన ధోరణిలో మార్పు వచ్చేసింది.
"నాక్కూడా ఈ ఉద్యోగం మీద అంతగా ఇష్టం లేదోయ్ ! మీ ఫాన్సీషాపులో నన్ను కూడా వాటాదారుడిగా చేర్చుకోకూడదూ?" అంటూ దీనంగా అడిగాడు
నేను సారధి వేపు చూశాను ఏమంటావ్! "పాపం ఆయన ఎప్పడూ ఏమీ అడగనివారు!" అన్నాను.
సారధి ఓ క్షణం ఆలోచించాడు.
"మేమిద్దరమే కలసి పెట్టాలనుకున్నాం! ఎందుకంటే ఎక్కువమంది పార్టనర్స్ వుంటే లేనిపోని గొడవలు" అన్నాడు అయిష్టంగా.
"మిగతావాళ్ళ సంగతి వెదు. మనాఫిసరుగారు సంగతి వేరు! ఆయనలాంటి మనిషి కాదు" అన్నాన్నేను.
"నా సంగతి మీకు తెలుసు కదా! ఇంతకాలమయింది! ఎప్పుడయినా, ఏ విషయమయినా పేచి పెట్టుకున్ననా?" అడిగారాయన విచారంగా.
"లేదులెండి! మీసంగతి వేరు! నేను జనరల్ గా మిగతా వాళ్ల గురించీ మాట్లాడుతున్నాను."
ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
"మిగతావాళ్ల గురించా! అయితే మీమాట కరక్టే? మహ పెచికోరులున్నారు-ప్రతి చిన్నవిషయానికి పేచిపెట్టుకుంటారు వాళ్ళు."
మేము ముగ్గురం తప్పు మిగతా ప్రజలంతా పేచికోరువాళ్లన్న విషయం మాకు అర్ధమయిపోయింది. అంచేత ఆయనకు కూడా వాటా ఇవ్వటానికి ఒప్పుకున్నడు సారధి!
"అన్నట్టు మీరు ఓసారి మా ఇంటికి 'టి'కి రాకూడదూ? ఎందుకో మొదటినుంచి మనాఫిసులో మీ ఇద్దరినే ల్తేక్ చేశాను నేను. ఎప్పటినుంచో మిమ్మల్ని 'టి'కి పిలవాలనుకుని కూడా-మళ్ళి మిగతా వాళ్లందరూ ఏమనుకుంటారోనని...."
"ఆ, దాన్దేముందిలెండి!" అన్నాం అది చాలా మామూలు విషయమ్తెనట్లు- మాకంతగా లేఖ్ఖలేనట్లు సాయంత్రానికల్లా ఈ వార్త ఆఫీసంతా గుప్పంది. అందరూ మా చుట్టూ మూగిపోయారు. "మేము కూడా ఎంతో కొంత పెట్టుబడి పెడతాం! మాకు వాటా యివ్వండి గురూ." అంటూ ఒకటే బ్రతిమాలసాగారు. ఎవ్వరిని కాదనడానికి మాకు మనసొప్పటంలేదు.