Previous Page Next Page 
హనీమూన్ పేజి 33

   
    మాకు అర్ధంకాలేదు.

    "ఏమిటి గజం మూడువేలు?" అడిగాడు సారధి.

    "అదేనండి స్ధలం!"

    "అంటే ఆదేన్ని గజాలుంటుంది?"

    "రెండువేల గజాలు."

    "అంటే రెండువేలు ఇన్ టూ మూడువేలు ఈజీకొట్టా-" అని ఆగిపోయాడుసారధి.

    "అరవ్తే వేలు" అన్నాడు మా వాడొకడు.

    "కాదు! ఆరు లక్షలు" అన్నాన్నేను.

    అయిదులక్షల కిచ్చేట్లయితే చెప్పండి! ఇప్పడే పాతిక రూపాయల వరకూ ఎడ్వాన్స్ ఇచ్చేస్తాం ఆరు లక్షల మరి ఎక్కువ!" అన్నాడు సారధి.

    ఓనరు మా వేపు అయోమయంగా చూశాడు.

    మేము ఏమీ  మాట్లాడుతున్నామో అతనికర్ధమాయినట్లు లేదు.

    "ఏమిటి   అయిదు లక్షలు?" అనడిగాడు కొద్దిలక్షణలు ఆలోచించుకుని.

    "కాష్! ప్తేవ్  లాక్స్  కాష్ ! పాతిక రూపాయలు ఎడ్వాన్స్" అన్నాను నేను అతనికి  స్పష్టమయెట్లు.

    చాలామంది గోప్పాళ్ళు-ఎందుకనో ఒకసారి చెప్తే అర్ధం చేసుకోలేరని నా అనుమానం.

    "నేనడిగేది అయిదులక్షలు నాకు దేనికిస్తానంటున్నారని" కోలుకుని మళ్ళి అడిగాడతను.

    "దేనికేమిటండి! మీ స్దలానికి! అన్నాట్లు మీకు చెప్పనేలేదు. కచూ మీ స్ధలం కొనడానికి మేం ఇప్పడే నిర్ణయించుకున్నం. మీరు అయిదులక్షలకు వప్పకున్నట్లుయితే పాతికరూపాయలు కాష్  అడ్వాన్స్ గా  ఇచ్చేస్తాం!"

    "అంటే నా స్ధలం ధర అయిదు లక్షలా?"

    "మీరు చెప్పిన రేటుకి ఓ లక్ష తక్కువకు అడిగాం అంతే!"

    "నాకేం అర్ధం కావటం లేదు- నా స్ధలం  ఆరులక్షలని ఎవరు చెప్పారు?"

    "మీరే!"

    "నేనా?"

    "అవును!"

    "ఎప్పుడు?"

    "ఇంతకు ముందు."

    "నేనలా చెప్పలేదే?

    "చెప్పారు."

    "చెప్పలేదు."

    "చెప్పారు"

    అతనికి  విసుగొచ్చింది.

    "చెప్పలేదు" అంటూ టీపాయ్ మీద గట్టిగా  చరిచాడు.

    మాకు  అతని వ్యవహారమేమీ నచ్చలేదు.

    "దిసీజ్ బాడ్!" అన్నాడు సారధి ఇలా చెప్పి చెప్పలేదనడం పెద్ద మనిషి తరహ కాదు!"

    "నేను గజం  మూడు వేలన్నానయ్యా! ఆరులక్షలుకాదు!"

    అవునయ్యా! మూడువేల చొప్పనేగా  మేమూ లెక్క కట్టింది. గజం మూడు వేలు చొప్పన రెండువేల గజాలకు ఎంతవుతుంది మరి- ఆరులక్షలు.

    అతను లేచి వెళ్ళి కాగితం తీసుకుని లెక్కలు వేయసాగాడు అయిదు  నిమిషాల తర్వాత మా వంక వెధవల్ని చూసినట్లు చూశాడు.

    "అరవ్తే లక్షలు" అన్నాడు గర్వంగా.

    ఈసారి మాకు మతిపోయినట్లయింది. అతని మాట లేమాత్రం అర్ధం కాలేదు.

    "ఏమిటి అరవ్తేలక్షలు?" అడిగాన్నేను.

    "మీ ఆరు లక్షలు రాంగ్ " అన్నాడతను.

    "ఆరు లక్షలు సంగతలూ ఉండనియండి! అరవ్తేలక్షలన్నారేమిటి మధ్యలో?"

    "అవును! అరవ్తేలక్షలు!"

    "ఏమిటి అరవ్తేలక్షలు?"

    "నా స్ధలం!"

    "మీ స్ధలం  మొత్తం సినిమాహల్స్ రెండూ కట్టినందుకయే ఖర్చు గురించీ మాట్లాడుతున్నాం?"

    "రెండు సినిమాల్స్ సంగతి కాదు."

    "ఒకటే హల్ కి అంత ఖర్చవదు!" అన్నాడు సారధి.

    "మీ సినిమాహాల్స్ గంగలో కట్టండి! వాటి సంగతి నా కెందుకు?" కోపంగా అన్నాడతను.

    మాకు కన్ ప్యూజన్ మరింత ఎక్కువయిపోయింది.

    "మీ కెందు కమిటి? మీ స్ధలంలో నేగా కట్టాలి!" అన్నాను ఆశ్చర్యంగా.

    "నా స్ధలంలో ఏమిటి?"

    "సినిమాహాలు-"

    "స్ధలం!"

    "ఏ స్ధలం?"

    "సినిమాహాలు స్ధలం?"

    "స్ధలం మారదుకదా?"

    "సినిమాహాలు."

    "కాదు స్ధలం!"

    "నేనడిగేదికాదు."

    "స్ధలం గురించే-"

    "సినిమాహాలు!"

 Previous Page Next Page