పెద్ద పిల్లవాడు డాక్టరు అయ్యాడు పిల్లకు కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు ఆకస్మాత్తుగా గుండె ఆగి భర్త చనిపోయాడు ఆమె పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు హైస్కూల్లోనే చదువుతున్నారు సవతి కొడుకు (డాక్టర్) ఆమెనూ, ఆమె పిల్లల్నీ దగ్గిర పెట్టుకోవడానికి ఇష్ట పడలేదు నెలకు రెండు వందలు పంపిస్తాడు మంచీ చెడూ కనుక్కోడు సవతి కూతురు అసలు పట్టించుకోదు.
ఆమె ఏదో ఆఫీసులో ఆయా పనిచేస్తున్నది ఒకసారి నాకు కన్పించింది గతాన్ని గుర్తు చెయ్యబోయాను.
"ప్లీజు గతాన్ని గుర్తుచెయ్యకండి దాన్ని మరచిపోవాలనుకుంటున్నాను నా ముందు నా బిడ్డల భవిష్యత్తు మాత్రమే ఉన్నది" అన్నది.
"నువ్వు వాళ్ళను ఎంతో ప్రేమగా పెంచావు డాక్టరుగా వేలు సంపాదిస్తున్నాడు అయినా...."
"ఆ విషయం కూడా నేను ఆలోచించదలచుకోలేదు వాడికి తోచింది వాడు పంపిస్తున్నాడు వాళ్ళూ నా బిడ్డలే రెక్కలురానంతవరకూ వాళ్ళనీ పెంచాను ఇప్పుడు వీళ్ళకు నా అవసరం ఉన్నది వీళ్ళను పెంచుతున్నాను" అన్నది.
ఇలాంటి సవతి తల్లులు కూడా ఉంటారు అయినా ఇలాంటి వారి గురించి ఎవరూ చెప్పుకోరు.
శకునాలు
నా కొలీగ్ ఒకామె సెలవు చీటీ రాసి ఆఫీసరు గదిలోకి వెళ్ళబోతూ నేను తుమ్మటంతో ఆగిపోయింది "తుమ్మావ్! ఇక సెలవు దొరికినట్లే:" అన్నది విసుగ్గా కూర్చుంటూ. నా మనసు చివుక్కుమన్నది.
నాకు ఆ రోజుల్లో జలుబు ఎక్కువగా చేస్తూండేది. "దీనికీ దానికీ సంబంధం ఏమిటి? పిచ్చి నమ్మకాలు, పైగా నాకు జలుబు చేసి ఉంది హా....చ్" అంటూ మళ్ళీ తుమ్మాను.
"పిచ్చి నమ్మకం కాదు చూస్తూండు నాకు బాస్ సెలవు ఇస్తుందేమో?" అంటూ ఆఫీసరు గదిలోకి వెళ్ళింది.
పది నిమిషాల తర్వాత రుసరుసలాడుతూ వచ్చింది.
"ఏమైంది?" అడిగాను.
"తల్లీ: ఆశీర్వదించావుగా? ఇంకా ఏమవుతుంది? సునీతా, లక్ష్మి కూడా సెలవులో ఉన్నారు! సెలవు ఇవ్వడానికి వీల్లేదు అన్నారు వాళ్ళు వచ్చాక వెళ్ళమన్నది."
"ఆమె ఆ మాట అంటుందని నాకు ముందే తెలుసు ఆమే కాదు ఎవరైనా ఆ మాటే అంటారు మార్చిలో అందరూ సెలవులు పెడితే పని ఎలా జరుగుతుంది? నేను తుమ్మడం, నీ పని కాకపోవడం కేవలం కాకతాళీయం మాత్రమే!" అన్నాను కాని ఆమెకు మాత్రం నేను తుమ్మడం వల్లనే తనకు లీవు శాంక్షన్ కాలేదని గట్టి నమ్మకం.
ఈ వైజ్ఞానిక యుగంలో కూడా ఆమె లాంటి నమ్మకాలు గలవాళ్ళు ఎందరో కనిపిస్తారు పరంపరా గత విశ్వాసాల్ని గుడ్డిగా నమ్ముతారే గాని వాటిని గురించి ఆలోచించరు అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోడానికి ప్రయత్నించరు.
తమ్మును అపశకునానికి సూచనగా మనమే కాదు, చాలా దేశాలవారు నమ్ముతారు మనవాళ్ళు పనిమీద బయటికి వెళుతూ, ఎవరైనా తుమ్మితే కూర్చుంటారు ఇక ఆ రోజు పని జరుగుతుందో లేదోననే గిలిపట్టుకుంటుంది.
పని జరిగితే తమ్ము వినగానే కూర్చున్నాం, కనక ఆ దోషం పోయిందనుకొంటాం పని జరక్కపోతే తుమ్మిన వాళ్ళను తిట్టుకుంటాం ఆ తుమ్మువల్లే పని జరగలేదని పదిమందికి చెప్తాం.
పెళ్ళిళ్ళలో మంగళసూత్రధారణ సమయంలో వాద్యాలు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతాయి చెవులు దిబ్బెళ్ళు పడిపోతాయి కారణం ఆ సమయంలో ఎవరైనా తుమ్మితే వినిపించకుండా ఉండాలనే:
ఆసియాలోని ముసల్మానులు ఎవరైనా తుమ్మితే "పరవర్దిగార్ అల్లా" అంటారు సైతాన్ ముక్కులోంచి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించగా తుమ్ము రావడంతో వెళ్ళలేకపోయాడని వారి నమ్మకం.
అలాగే రోమన్లు తుమ్మి వెంటనే "ఓ బస్లీ ఓమన్" (అశుభం జరగకుండుగాక) అంటారు. 589 లో రోమ్ నగరంలో దారుణంగా ప్లేగు వ్యాధి వ్యాపించిందట ఏడవ పోప్ గ్రెగరీ ఒక ఫర్మానా జారీ చేశాడు అందులో "తుమ్మగానే, ఓ బస్ ఓమన్ అనండి" అనే మాటలు ఆ ఫర్మానా ద్వారా అందరికీ అందించడం జరిగింది తుమ్మేవాని చుట్టూ భూత ప్రేతాలు చేరుతాయని వారి నమ్మకం.
జర్మన్లు తుమ్మువల్ల ఆయుక్షీణం అవుతుందని నమ్ముతారు అందుకే తుమ్మగానే దీవిస్తారు మనవాళ్ళు కూడా పిల్లలు తుమ్మితే "చిరంజీవి" అనడం వింటూనే ఉంటాం.
ఆఫ్రికాలోని ముఖ్యంగా 'ఝూలూ' తెగవారు తుమ్మును ఆరోగ్యానికి సూచనగా భావిస్తారు జబ్బు చేసిన వ్యక్తి తుమ్మితే మంచిదని వారి భావం అందుకే నాటు వైద్యుల రోగికి తుమ్ములు వచ్చేందుకు సహకరించే చికిత్స చేస్తారు అప్పుడే ఆ కుటుంబంలోని వారికి ఆ వైద్యుడి మీద నమ్మకం కుదురుతుంది.
స్పేన్ మరియు ఫ్రాన్స్ దేశాలలో తుమ్మును శుభసూచకంగా భావిస్తారు తుమ్మిన వారిని "మీ కోరిక ఫలించుగాక" అని దీవిస్తారు.
జపాన్ లో ఒక తుమ్ముతుమ్మితే ఎవరో ఎక్కడో అతన్ని తల్చుకుంటున్నారు అని భావిస్తారు రెండు తుమ్మితే ఎవరో నిందిస్తున్నారని భావిస్తారు మూడో తుమ్ము రాగానే అనారోగ్యానికి సూచకంగా గుర్తిస్తారు.
అసలు తుమ్ములు ఎందుకొస్తాయో చూద్దాం ముక్కు రంధ్రాలలో వెంట్రుకలు ఉంటాయి అవి మనం పీల్చుకొనే గాలిలో ఉండే ధూళికణాలను లోపలకు వెళ్ళకుండా అడ్డగిస్తాయి ముక్కులలో చిన్న గ్రంధులు ఉంటాయి.
అవి ఒక రకమైన రసాన్ని ఉత్పత్తి చేస్తాయి ఫారెన్ మాటర్ (కారపు పొడి వగైరా) లోపలకు వెళ్ళినప్పుడు, ఆ గ్రంధులు ఉత్తేజం పొంది తుమ్ములు వస్తాయి వేడి ప్రదేశం నుంచి ఒకసారి చల్లటి ప్రదేశంలోకి వెళ్ళినా, చల్లటి గాలిలో తిరిగినా తడిబట్టల్లో ఎక్కువసేపు నానినా, వేడివేడిగా ఏమైనా తిని వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగినా తుమ్ములు వస్తాయి.
ఎక్కువ తుమ్ములు వస్తే జలుబు ప్రారంభమయిందనుకోవాలి తుమ్మును మనం జబ్బులా భావించం కాని ఈ జలుబు అంటువ్యాధి దీని ద్వారా అనేక క్రిములు (బాక్టీరియా) బయటికి వచ్చి గాలి ద్వారా దగ్గిరగా ఉన్న వ్యక్తుల శరీరంలోకి ప్రవేశిస్తాయి అందుకే తుమ్మే సమయంలో ముక్కు మీద రుమాలు అడ్డు పెట్టుకోవాలి జలుబే కదా అనిసాచాత చెయ్యకూడదు.
తుమ్ము కూడా అనారోగ్యానికి సూచనగానే భావించాలిగాని, దానిని అపశకునంగా భావించకూడదు శుభకార్యానికి వెళ్ళినప్పుడు నలుగురి మధ్యలో ఒకోసారి తుమ్ము వస్తుంది ఎంత ప్రయత్నించినా ఆగదు. కాని అక్కడ ఉన్న అందరూ ఆ తుమ్మిన వాళ్ళను అపరాధిని చూసినట్లు చూస్తారు తుమ్మిన వ్యక్తి తనేదో తప్పు చేసినట్లే కుంగిపోతారు ఇవన్నీ ఇలా ఉండగా ఇంటివారి మనసులో, గిలి ఏర్పడుతుంది ఏ అశుభం రానున్నదో అనే భయం కలుగుతుంది.
ఇలాంటి భయాలూ, నమ్మకాలు కొందర్ని కృంగదీస్తాయి.
అందుకే మీకు ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉంటే తర్కబుద్ధితో ఆలోచించి చూడండి.
ప్రేమ వివాహాలు విఫలం అవుతున్నాయా?
ఈ మధ్య ఒక సినిమా చూడటం తటస్థించింది భర్త మరో వన్నెల విసనకర్ర వలలో పడిపోయి భార్యాబిడ్డల్ని విస్మరిస్తాడు ఆ భార్య "స్వామి" అంటూ ఏడుస్తూ ప్రారంభించిన ఉత్తరం "మీ పాదదాసి" అంటూ ముగిస్తుంది అది చూసి పాపం ఎందరో ఆడవాళ్ళు కన్నీళ్ళు కార్చేశారు.
అదే ఆమె ఎదురు తిరిగిందనుకోండి ఆ సినిమా ప్లాప్ అవుతుంది ఎందుకంటే అది ఆడవాళ్ళకు పట్టదు కనుక కాని స్త్రీలందరూ ఈనాడు కూడా అదే స్థాయిలో ఆలోచిస్తున్నారనుకోవడం పొరపాటు.
ఒకనాడు స్త్రీకి భర్తభగవంతుడు భగవంతుడు చేసే పనుల్ని విమర్శించే హక్కు భక్తులకు ఉండదు కాబట్టి ఆ సంసారాలు విచ్చిన్నం అయే అవకాశమే ఉండేది కాదు భర్త తన్నినా, అవమానించినా, ఆ పాదాలలో ఇంతచోటు చేసుకొని పడి ఉండేది.
కాని ఈనాడు చదువుకున్న యువతీ యువకులు వివాహం అనేది భగవంతుని ప్రకారం జరుగుతుందనే విషయాన్ని నమ్మడం లేదు స్త్రీలు కూడా వరుణ్ణి ఎన్నుకొనే విషయంలో తమ ఇష్టాయిష్టాలను తెలియజేస్తున్నారు ఆధునిక నారికి కావలసింది "స్వామి" కాదు "సహచరుడు" అందువల్లనే స్త్రీ తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక ఒకసారి తిరగబడుతూంది డైవర్స్ వరకూ వెళుతూంది కథ.
నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎం.ఏ. చదివింది స్వతంత్ర భావాలు కల పిల్ల ఒక మిలిటరీ ఆఫీసరుతో వివాహం జరిగింది పెళ్ళిచూపుల్లో ఒకరిని ఒకరు ఇష్టపడిన తరవాత ఈ వివాహం జరిగింది.
కాని వివాహం అయిన నెల తరవాత ఆ పిల్ల పుట్టింటికి వచ్చింది మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళనని మొండికేసింది అతని అభిప్రాయాలూ, అలవాట్లూ ఈ అమ్మాయికి నచ్చలేదు.
నాకు తెలిసిన మరో లేడీ డాక్టరు ప్రేమించినవాడినే పెళ్ళి చేసుకుంది ఇద్దరూ అమెరికా వెళ్ళారు ఆమె డాక్టరు ఎందరితోనో కలవాల్సి ఉంటుంది భర్త వట్టి అనుమానపు మనిషి వేధించసాగాడు విషయం విడాకులు తీసుకునేంతవరకూ వెళ్ళింది.