Previous Page Next Page 
హనీమూన్ పేజి 30


    పాదర్ వాళ్ళందరిని సమావేశ పరిచి  ఉపన్యాషం ప్రారంభించాడు.

    "మీకు 'మతం' అంటే ఏమిటో, అసలది యెలా  ఉంటుందో తెలుసా?" అడిగాడతను ముందస్తుగా.

    "ఎందుకు తెలీదండి! కిందటిసారి మీలాగే ఓ మత ప్రచారకుడు వచ్చినప్పుడు కొంచెం రుచి చూశాము అందరమూ!" అన్నాడు వాళ్ళ నాయకుడు తన వాళ్ళకు స్తెగాజేస్తూ.

    ర్తేల్వే కాటరింగ్ డిపార్ట్ మెంట్ కి చెందిన వ్యక్తి మా కోచ్ లో కొచ్చి అందరి దగ్గరా భోజనానికి ఆర్దార్స్ తిసుకోసాగాడు. రాత్రికి మాకు తినడానికేమి మిగలకపోవటంచేత అందరం భోజనానికి ఆర్డర్ చేశాము.

    అందరం కబుర్లు చెప్పకుంటూండగానే ర్తెలు వార్దా చేరుకుంది.

    "ఇక్కడే గాందిగారు గడిపిన సేవాగ్రమ్ ఆశ్రమం ఉంది" అన్నాడు తాతయ్య.

    మా బండి అప్పటికి రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది మాకు.

    ప్లాట్ ఫారం మీదకు దిగి వాటర్ బాటిల్ నిండా  మంచినీళ్ళు తిసుకోచ్చాము.

    'సంత్రా' అంటూ కమలాపళ్ళు అమ్మేవాళ్ళు ప్లాట్ ఫారమంతా  తిరుగుతున్నారు.

    తాతయ్య అరడజను సంత్రాలు కొనేశాడు.

    రాత్రి ఎనిమిది గంటలకు నాగపూర్ చేరుకుంది మా బండి. అందరికి భోజనాలు తెచ్చి అందించారు బేరర్ లు.

    భోజనం ప్రారంభించబోతూండగా వో వ్యక్తి గట్టిగా  అరచాడు.

    "ఎవ్వరూ భోజనం చేయకండి! రూలు ప్రకారంప్రతి ప్లేట్లోనూ ఆరు చపాతిలు ఉండాలి. ఈ రాస్కేల్స్ నాలుగే ఇచ్చారు. అన్నంకూడా తక్కువ ఉంది."

    అందరం చపాతీలు లెక్క చూసుకున్నాం నాలుగే ఉన్నాయ్. అందరికి ఈ మోసానికి ఒళ్ళు మండిపోయింది. బేరర్స్ నీ పిలుచుకోచ్చాడు ఒకతను.

    "ఏమయ్యా చపాతీలు నాలుగే పెట్టావ్ ఏమిటి సంగతి? మర్యాదగా చపాతీలు తేకపోతే నీ ప్లేట్లు తిరిగి ఇవ్వం జాగ్రత్త!" అంటూ బెదిరించాడు ఆ పెద్దమనిషి.

    బేరర్లు ఖంగారుపడిపోయారు.

    "ఇప్పడే తేస్తాన్సార్! పొరపాటు జరిగింది" అంటూ పరుగుతో వెళ్ళి పది నిమిషాల్లో అందరికి రెండు  రెండు చపతిలు తెచ్చి   ఇచ్చాడు.

    మేమంతా ఈ విషయం  కనిపెట్టిన  వ్యక్తిని అభినందించాము.

    "అసలు భోజనంలో ఆరు చపాతీలు ఇవ్వాలన్న రూల్ సంగతి మాకు తెలీనే తెలిదు. మికెలా  తెలిసింది?" అడిగాడు సారధి అతడిని.

    అతను ఓ క్షణం  తటపటాయించాడు.

    "ఫర్లేదు చెప్పండి గురూజీ! మికెలా తెలిసింది?

    "నేను....ర్తేల్వేకాటరింగ్ లో పనిచేశానులెండి కొన్నాళ్ళు."

    అందరూఘొల్లున నవ్వారు.

    ఆ తరువాత ఆ పెద్దమనిషి ర్తేల్వే కాటరింగ్ డిపార్టు మెంట్ గుట్టు అంతా బయట పెట్టేశాడు.

    "నేనూ ఇలాంటి వెధవ పనులు చేశాన్సార్ సర్విస్లో ఉండగా! భోజనం టైముకి ర్తెలు వచ్చిందనుకోండి! పాసింజేర్స్ అందరూ భోజనం  త్వరగా చేయాలనీ చూస్తారుగాని- అన్నం ఎంత పెట్టారూ , చపాతీలు ఎన్ని వేశారూ, కూరలూ, పప్పూ లెక్కకు తగ్గట్లుగా  ఇచ్చారా లేదా అనియేవరూ  చూడరుగా! కొట్టోకొట్టు-ఒక్కర్తెలు  వెళ్ళేసరికి వెయ్యిరూపాయల లాభం ఎక్కడికి పొదనుకోండి!"

    అందరం ఆశ్చర్యపోయాము.

    "అంటే విజయవాడాలంటి స్టేషన్ లో - కాటరింగ్ వాళ్ళు రోజుకి పదివేల రూపాయల లాభం కళ్ళచూస్తారన్న మాట."

    "ఓ ! తప్పకుండా!"

    "అంటే సంవత్సరానికి కనిసం ముప్పయ్ లక్షలు"

    "కాని ఆ డబ్బంతా కేటరింగ్ మేనేజర్ ది కాదు సార్. అక్కడే మీరంతా  పొరబాటుపడేది."

    "మరి?"

    "అందులోనే ర్తేల్వే కాటరింగ్ డిపార్టుమెంట్ కి చెందిన ఆఫీసర్లకు ఇఅతర డిపార్ట్ మెంట్స్ కొన్నింటికి ప్రీగా మిల్స్  సప్లయ్ చేయాలి. ఇంకేంతో మంది వి.ఐ పి లకు కూడా మాకే ఆముచం! ఇవిగాక ఇంకా లంచాలు పగయిరాలు వేరే!"

    అప్పడే టి అమ్మేవాడు ఓ కప్పులో 'టి' తెచ్చి ఒకతని కిచ్చాడు.

    "చూశారా! అ కప్పులో 'టి' ఆ చుట్టూ ఉన్న గితవరకూ ఉండాలి. అంటే సగానికి సగమే ఇస్తున్నాడన్నమాట వాడు అసలే చెత్త 'టి!' ఆ చెత్త 'టి' కూడా  ఇవ్వాల్సిన దాంట్లో సగమే- వీళ్ళేంత లాభం, కోడతారో చూసుకోండి!"

    మాకు వళ్ళు మండిపోయింది ర్తేల్వేమీద. ప్రయాణికులను ఎన్నో విధాలుగా దోచుకొంటున్న ఎక్తేక ప్రభుత్వ యంత్రాంగం ఇది!

    "తప్పదండి బాబూ! ర్తేల్వే ప్రయాణం అంటేనే తిరుపతి క్షౌరం అన్నమాట!స్టేషన్  కెళ్ళాగానే కూలీలు దోచుకుంటారు ముందు. ఆ తరువాత టికెట్ పేరుతో బుకింగ్ ఫీస్ దోచుకుంటారు ముందు. ఆ తరువాత  టికెట్  పేరుతో బుకింగ్ ఫీస్  దోచుకుంటోంది. అర్జంట్ రిజర్వేషన్ కావాలంటే బ్రోకర్లు ట్రావెల్ ఏజంట్లు దోచుకుని బెర్తులు ఇప్పిస్తారు. ఆ తరువాత ప్రయాణంలో దొంగలు దోచుకుంటారు. మధ్య మధ్యలో కాటారింగ్ డిపార్టు మెంట్ దోచుకుంటుంది. ర్తెలు దిగగానే మళ్ళి కూలీలు దోచుకోవడంతో సర్కిల్ పూర్తవుతుంది."

    ముందురోజు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వాళ్ళ పెందలాడే బెర్తులు తెరిచి  అందరం పక్కలు పరిచేశాము.

    ఉదయం మెలకువ వచ్చేసరికి ర్తెలు భోపాల్ చేరుతోంది. మా పెట్టెలో తెలుగాళ్ళు  చాలా మంది భోపాల్  లో దిగిపోయారు.

    "ఎందుకయినా మంచిది-బొపాల్ వదిలే వరకూ ఊపిరితిత్తుల నిండుగా గాలి పిల్చకండి!" అన్నాడు సారధి.

 Previous Page Next Page