Previous Page Next Page 
హనీమూన్ పేజి 29

   
    "భింద్రేన్ వాలేని రంగం లోకి దింపింది  ఇండిగాంది , జ్తేల్ సింగ్ లే నన్న విషయం మీకు తెలిదా?"

    "దింపుతే ఖలిస్తాన్ కావాలంటే ఊరుకుంటారా?"

    "నేననేది కాదయ్యా! పంజాబ్  ముఖ్యమంత్రికి పొలిటికల్  గా ఒఅ ఫోటో పెట్టాలను కున్నారుఇపెట్టారుఅలాంటప్పుడుదానివల్ల వచ్చేచెడూ ఉంటుంది కదా."

    చాలామంది అర్జంటుగా నిద్రలేఛి  సర్దార్ జికి తామం మద్దతు తెలియజేశారు.

    "సార్దార్ జి ఈజ్  కరెక్ట్ !" అన్నాడో తెలుగాయన ఇంగ్లీష్ లో

    ఆ తరువాత టాపిక్ హాఠత్తుగా ఆంద్రప్రదేశ్ మీద కొచ్చేసింది.

    "ఏన్టి ఆర్  వచ్చ్కాక సగం  దరిద్రం వదిలిపోయింది మన రాష్టానికి" అన్నాదోకాయన లంక చుట్ట వెలిగిస్తూ.

    "సగం దరిద్రం వదిలిన మాట నిజమేగాని  కోత్హ్త దరిద్రం సగం పచ్చ్చి మీద పడింది" అన్నారు ఓ శర్మగారు.

    దాంతో అగ్గి రాగులుకుంది.

    ఎన్టిఆర్ కి మద్దతుగా సగం  మంది వ్యతిరేకంగా సగం మంది ఏర్పడిపోయారు.

    "ఏమిటా క్రొత్త దరిద్రం?"

    "ఇంకేముందయ్య! అసలే మూడనమ్మకాల వాళ్ళ అడుక్కుతింటూన్న మన జాతిని మరింత వెనక్కు తోసేస్తున్నాడు! పూజలు, పునస్కారాలు  ఎక్కువపోయాయ్.

    లెక్కకు  మించిన  మన దేవుళ్ళతోనే చస్తుంటే ఆయన శవాలకు కూడా పూజలు చేస్తున్నాడట.

    జ్యోతిష్యులు, సన్యాసులు ఏం చెప్తే అది చేసేస్తున్నాడు. టాంక్ బండ్ మీద ట్రాఫిక్ రద్దీ ఎక్కువయిందని అందరూ విగ్రహాలు ప్రతిష్ట చేయిస్తాదట! అంతే కాదు, ఆ విగ్రహాల కోసమని టాంకుబండ్ నీ కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో వెడల్పు చేస్తారట."

    మేము లేచి మొఖాలు కడుక్కున్నాము మా వాళ్ళు మాకు ఇడ్లిలు అఆవకాయ పచ్చడి ఇచ్చారు. సర్దార్ జికి కూడా  టిఫిన్  పెట్టాము.

    ఆవకాయ తిని నానా  అవస్దా పడుతూంటే  మాకు నవ్వు వచ్చింది,

    ఆడాళ్ళిద్దరూ సంవత్సరం క్రితం  చితంపండు  అప్ప  తీసుకుని ఎగ్గోట్టిన చివరింటి సీతారావమ్మ గురించీ మాట్లాడుకోసాగారు.

    మరి కాసేపట్లో సరదా కబుర్లలో మునిగిపోయం.

    "ఓ జోక్ చెప్పనా?" అడిగాడు సర్దార్ జి.

    "చెప్పండి!" అన్నాడు సారధి ఉత్సాహంగా మాతోపాటు మరి కొంత మందికూడా సర్దార్ జి చుట్టూ మూగారు.

    "ఫస్ట్ జోక్  సర్దార్ జిస్ మీదే చెపుతాను" అన్నాడతను.

    మేము ఆశ్చర్యపోయాము. సర్దార్ జిలు స్పోర్టివ్ గా  ఉంటారని తెలుసుగాని మరి ఇంత స్పోర్టివ్ అనుకోలేదు.

    ఓ ర్తేల్లో ఇద్దరు సర్దార్ జిలు కలుసుకున్నారు.

    కాసేపయాక సంభాషణలోకి దిగారు.

    "మీ రెక్కడి కేలుతున్నారు?"

    "ఝన్సీ."

    "అరె! మాది ఝాన్సియే! ఝాన్సిలో మీరెక్కడుంటారు?"

    "సిప్రిబజార్."

    "అరె  మాదికూడా  సిప్రిబజారే! సిప్రిబజార్  లో మిరేక్కడుంటారు?

    "గుప్తా రోడ్ లో."

    "అరె! నేనూ గుప్తారోడ్ లోనే  ఉంటాను. గుప్తా రోడ్ లో మీరెక్కడుంటారు?"

    "రెండో విధి."

    "అరె ! మాది రెండోవిదే-అందులో మీ యిల్లు ఎక్కడ?"

    "ఏడో ఇల్లు."

    "అరె! మాది ఆ ఇల్లె."

    అంతవరకూ వాళ్ళసంభాషణంతా వింటున్న ఓ పెద్ద మనిషికి తగని చిరాకేసుకొచ్చింది.

    "చూడండి! మీ ఇద్దరికీ ఒకటే ఊరు,ఒకేటే బజారు, ఒకటే విధి, ఒకటే ఇల్లు అయినా ఒకరికొకరు తెలిదా?"

    అందులో ఓ సర్దార్ జికి కోపం ముంచుకొచ్చింది.

    "మేమిద్దరం అన్నదమ్మాలమయ్య! టైమ్ పాస్ చేయడానికి మా ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుకుంటాం. కాదంటానికి మధ్యలో నువ్వెవడివి?"

    మాతో పాటు చుట్టూపక్కల వాళ్ళంతా ఘొల్లున నవ్వారు.

    మరికాసేపట్లో టైన్ బల్హర్ష అడవులు దాట సాగింది. మా సంభాషణ అడవులమీదకు పాకింది.

    అడవులనేసరికి తాతయ్యకు ఉత్సాహం వచ్చేసింది.

    "మా ప్రెండ్ చంద్రశేఖరం ఇక్కడే స్టేషన్ మాస్టర్ గా చేస్తూండే వాడ్రా! అప్పుడు ఈ అడవులు మరి భయంకరంగా ఉండేవి. ఓ రోజు సాయంత్రం ఓ పులి వచ్చి స్టేషన్ బయట కూర్చుందట! అంతే మర్నాటి పొద్దున్న వరకూ తిండి తిప్పలూ లేకుండా తలుపులేసు కూర్చున్నారట లోపల."

    అక్కడి నుంచి  ఆప్రికా అడవులమీదకు మళ్ళింది టాపిక్.

    మనుషుల్ని తినే  తెగకు చెందిన  ఒకావిడ వాళ్ళాయనకు జ్వరం వచ్చేసరికి మాత్రలు వేసే  డాక్టర్ నీ పిలిపించిందట.

    "డాక్టర్ గారూ! ఎన్ని మందులు వాడినా ఏమీ  ఉపయోగం కనిపించటం లేదు. ఈయన్ని ఏం చేయాలో తెలీటం లేదు" అందామె గాబరాగా.

    మంత్రాల డాక్టర్ ఓ క్షణం ఆలోచించి "సరే-నేను వెళ్ళి రకరకాల 'మనవ వంటల పుస్తకం' పంపిస్తాను అని వెళ్ళిపోయాడట!" అంటూ ఓ జోకు చెప్పాడు  సర్దార్ జి.

    దాంతో సారధి ఇంకో జిక్ అందుకున్నాడు.

    "ఒక మిషనరి పాదర్ క్రిష్టియాన్ మత ప్రచారంకోసం బయల్దేరి ఆప్రికా వెళ్ళాడు.  అనుకోకుండా  మనుషుల్ని తినే తెగ ఎదురయిందతనికి.

 Previous Page Next Page