Read more!
 Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 3

 

    అప్పుడే అంటే సరిగ్గా ఎప్పుడో చెప్పగలవా?"
    "ఊహు, సరిగ్గా చెప్పలేను."
    "సరే నా ప్రశ్నలకు త్వరత్వరగా సమాధానాలు చెప్పటానికి ప్రయత్నం చెయ్."
    మాధవి తల వూపింది. అంతవరకూ ఇదంతా ఏదో తమాషాగా, ఆటగా తీసుకున్న మాధవి సీరియస్ గా కూర్చున్నది.
    "మైక్ లో నీ పేరు పిల్చినప్పుడు-"
    "మాములుగానే ఉన్నాను. కొద్దిగా ఎక్సేయిట్ మెంట్! అది మాములుగా అందరికీ ఉండేదే."
    "నువ్వు నాకేమి వివరించవద్దు! నీకేదో అయి పోయిందన్నావే , అది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయిందో తెలియాలి."
    "ఓ. కే స్టార్ట్"
    "మైక్ లో పేరు వినిపించినప్పుడా?"
    "కాదు"
    "స్టేజి మెట్లెక్కినప్పుడా?"
    "కాదు"
    "స్టేజి మీద నడిచినప్పుడా?"
    "కాదు"
    "ప్రైజ్ అందుకొంటున్నప్పుడా?"
    "అవును"
    "ప్రైజ్ ను చూశా?"
    "కాదు"
    "ప్రైజ్ అందిస్తున్న చేతిని చూసా!"
    మాధవి ఎటో చూస్తుంది.
    "ప్రైజ్ అందిస్తున్న చేతిని చూసా? కమాన్ అన్సర్ మై క్వశ్చన్ , కమాన్"
    "ఓ ప్రేమ్ " అప్రయత్నంగా అరచింది.
    "కమాన్ చెప్పు. ఊ, కం అవుట్"
    "అవును, అవును"
    "ఆ చేతులు లేలా వున్నాయి."
    "ఎక్కడో ఎక్కడో చూసినట్లుగా."
    "ఆ చేతుల్లో ఏమన్నా ప్రత్యేకత ఉందా?"
    "చేతుల్లో లేదు .....ఉంది!"
    "చేతులో లేదు కాని ఉంది. ఎక్కడ ఉంది?"
    "ఎక్కడో ? ఎక్కడో? మాధవి చూపులు చెదిరి పోతున్నాయి.
    "చేతి వేళ్ళల్లో"
    "ఏముంది? ఆ వేళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?"
    "ఊ కమాన్! వెళ్ళు వంకరగా వున్నాయా? బాగా లావుగా వున్నాయా?"
    "కాదు, తెగిపోయింది. ఒక వేలు తెగిపోయి ఉంది."
    "ఏ వేలు"
    `"ఆరో వేలు"
    "మాధవీ " అంటూ సాగర్ లేచి , వణికిపోతున్న మాధవిని పట్టుకున్నాడు. "మాధవీ! మాధవీ!' అని బిగ్గరగా అరుస్తూ స్తంభించిపోయిన మాధవిని కుదిపాడు.
    మళ్ళీ ఏమయింది నాయనా' గాభరాగా పరుగెత్తుకొచ్చింది మాధవి తల్లి నాగరత్నమ్మ.
    ఆమె కేక విని కారేక్కబోతున్న రామనాధంగారు కంగారుగా లోపల కొచ్చారు.
    మాధవి కొద్ది క్షణాలలో మాములు మనిషి అయింది.
    "ఎందుకర్రా నా చుట్టూ మూగారు ఏమయింది?" అన్నది అందర్నీ కలయ చూసి.
    "ఏమయింది సాగర్?" టై వదులు చేసుకుంటూ అడిగాడు రామనాధం గారు.
    "ఏమి లేదు సార్, వాళ్ళమ్మ గారూ కంగారుగా పరుగెత్తు కొచ్చేసరికి మీ అమ్మాయిగారూ గాభరా పడ్డారు."
    "నేను కంగారు పడటమేమిటి నాయనా? నువ్వు మాధవీ ! మాధవీ! అని బిగ్గరగా కేకలు పెట్టావు కదా?" అడిగింది మాధవి తల్లి.
    'అబ్బే , అదా! అదీ మీ అమ్మాయి కాఫీ తెస్తానని లోపలికి వెళుతుంటే ఇప్పుడోద్దని కేక వేశానండీ."
    "మీ విడ్డురం బంగారం గానూ, అందుకు కేకలు వేయాలటయ్యా?"
    "మీ అమ్మాయి, మీకా శ్రమ ఇవ్వటం ఇష్టం లేక కొంచెం గట్టిగా కేక వేశాననుకుంటాను."
    "నీ చోద్యం బంగారం కానూ! కాఫీ కలపటం కూడా నాకో శ్రమంటావా! ముప్పయ్యేళ్ళుగా గొడ్డు చాకిరీ చేయించుకున్న ఆ జడ్జి గారూ ఒక్క సారి అయినా నీ కెందుకు యీ శ్రమ అన్న పాపాన పోయారా! చిన్నవాడివి వైతే మాత్రమే నాయనా! పెద్ద వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినవాడివి. నీ బుద్ది బంగారం నాయనా"
    "ఇదిగో బంగారం! మీ నాయన నీకు బంగారం అని పేరు పెట్టాల్సింది. నాగరత్నం అని పేరు పెట్టాడు. ఇనపెట్టేలో బంగారం, వంటిమీద బంగారం , ఆది చాలదన్నట్లు మాట మాటకూ బంగారం తగిలించి మాట్లాడతా వెందుకు నాగరత్నం."
    "ఏ బంగారమయినా మా పుట్టింటి దగ్గర్నుంచి తెచ్చుకున్నదేగా! పదిహేనేళ్ళు ప్లీడరు పని, పదేళ్ళ నుంచి జడ్జి పదవి-"
    "చిన్న మెత్తు సంపాదించ లేదంటారు అంతేగా?" సాగర్ మధ్యలో అందుకొని అన్నాడు.
    ఏమయినా అసలు విషయం పక్కదారి పట్టినందుకు లోలోన ఆనందపడ్డాడు సాగర్. మాధవి, తల్లిదండ్రుల సంభాషణ సరదాగా వింటున్నది.
    "బంగారం లాంటి మాటన్నావు నాయనా!" ఆప్యాయంగా సాగర్ ను చూసి అంది నాగరత్నమ్మ.
    "ప్లీడర్ గా బంగారం సంపాయించ గలిగితే జడ్జి నే అయేవాడ్ని కాదు కాదోయ్ సాగర్." అన్నారు రామనాధం గారు.
    "డాడీ, ప్రస్తుతానికి యీ కేసు విచారణ వాయిదా వేసి కోర్టుకు బయల్దేరండి , ప్లీజ్!"
    "వెల్ సేడ్ మైకిడ్!" అని రామనాధం గారు టై బిగించుకుంటూ కారెక్కి కోర్టుకు వెళ్ళిపోయారు.
    "ఇదీ వరస! చూశావుగా నాయనా?" నాగరత్నమ్మ మురిపెంగా నవ్వుకోన్నది.
    'అచ్చంగా సినిమా డైలాగ్ ఇది, మమ్మీ! మమ్మీ నువ్వు సినిమాకు డైలాగ్స్ రాయకూడదూ!" తల్లి భుజం పట్టుకొని అల్లరి చేసింది మాధవి.
    "ఉన్నారుగా! ఆయన్ను రాయమను"
    "అబ్బ, ఇదీ అసలు సినిమా డైలాగు."
    "ఈ మహత్తర సన్నివేశంలో మీ అభిమాన రచయిత్రయితే ఏ డైలాగు రాస్తుందో చెప్పగలరా మాధవి గారూ!"
    "ఏమిటా జానపద హిరోలా ముఖమూ, నువ్వునూ!"

 Previous Page Next Page