Previous Page Next Page 
హనీమూన్ పేజి 28

     నేనోపో సారధి  పడుకుని నిద్రపోవడానికి  ప్రయత్నంచం గాని పక్క కాబిన్ లో నుంచి ఆడ గొంతుకలు కొన్ని బిగ్గరగా మాట్లాడడం వినిపించసాగింది.

    వాళ్ళు బిగ్గరగా మాట్లడుతూండడంవల్ల.... వాళ్ళు మాట్లాడుకుంటూన్న విషయాలన్నీ మాకు క్షుణంగా తెలిసిపోతున్నాయ్. వాటిల్లో కొన్ని ఇవి.

    1.వీర్రాజు అనే దౌర్భాగ్యుడి రెండో పెళ్ళాంకి మూడోసారి నెలతప్పింది.

    2.రౌడి వేషాలేస్ ప్లీడర్ కూతురు, ఆ దగుల్భాజి కళ్ళజోడు వెధవతో సినిమాకు వెళ్ళింది.

    3. కామేశ్వరి వాళ్ళ పెద్దకొడుకు తల్లిదండ్రులిద్దరిని ఇంట్లోనుంచి బయటకు గేంటాడు.

    4. విధి చివరింట్లో ఉండే  అనసూయ వాళ్ళాయన బుద్ది  మంచిది కాదు.

    "వాడికేమయినా బుద్ది ఉందా? వాళ్ళఫిసులో పనిచేసే జానకి అనే అమ్మాయిని స్కూటర్ మీద తిప్పతున్నాడట.....!"

    "అలాగా! నాకు తెలిదు."

    "అయ్యో మీకు తేలికపోవడమేమిటి? లోకం అంతా  కొడ్తేకూస్తోంటే."

    "వాడికి బుద్దిలేకపోతే మానె! ఆడదయుండి దానికేం పోయేకాలం వచ్చింది?"

    "పాపం అనసూయ ఒకటే ఏడుస్తోందట! వాళ్ళ పని మనిషి చెప్పింది...."

    "ఇంక చాల్లే నోర్మూసుకోండి" అంటూ గట్టిగా అరచాడు సారధి.

    వాళ్ళ సంభాషణ కొద్ది క్షణాలపాటు ఠక్కున్ ఆగిపోయింది. నా గుండె ఆగిపోయినంత పనయింది. వాళ్ళంతామా మీద తప్పక దండెత్తుతారన్నా అనుమానం కలిగింది.

    "ఎవరది?" ఒక గొంతు.

    "ఏమో- మన పక్కనే ఉన్న వాళ్లులా ఉంది."

    "ఎవరినంటున్నాడు?"

    "ఏమో?"

    "మననా?"

    "మననేందుకంటాడు? అంటే ఊరుకుంటామా?"

    "ముందు నోర్మూసుకుంటావా లేదా? మళ్ళి అరచాడు సారధి.

    వాళ్ళిద్దరూ భయపడిపోయారు. కాని కుతూహలం పట్టలేక లేచి మా కాబిన్ వేపు తొంగి చూశారు.

    "నిద్రపోతూంటే  వెధవమోత పెడతావేమిట్రా....! రేప్పొద్దున కొనిస్తాన్లె బిస్కెట్లు "అన్నాడు సారధి. చిన్ని గాడిని దబాయిస్తున్నట్లునటిస్తూ.

    దాంతో వాళ్ళిద్దరూ సంతృప్తిపడి తమ సీట్ల దగ్గర కెళ్ళారుగాని  ఆ తరువాత కోచ్ అంతా నిశ్శబ్దం అయిపోయింది కొద్ది క్షణాలపాటు కాని అప్పడే నిద్రపడుతున్న చిన్నిగాడు మాత్రం ఆ కేకకు అదిరిపడి లేచి కూర్చున్నాడు.

    "ఏవి బిస్కెట్లు?" అనడిగాడు వాడు.

    "బిస్కెట్లుమిటి?"

    "నువ్వేకదా ఇప్పుడు బిస్కేట్లిస్తానన్నది?"

    "ఇప్పుడు కాదురా! రేపొద్దున్న."

    "నాకేం! నా కిప్పడే కావాలి.

    "పడుకుంటావా? ఒకటి  తగిలియ్యమన్నావా?"

    వాడు ఆ మాట  వినడంతోనే ర్తే లేగిరిపోయేట్లు ఏడుపు మొదలు పెట్టేశాడు. దాంతో ఆ కోచ్ లో  వాళ్ళందరూ లేచి కూర్చున్నారు.

    సారధి భార్య తన బాగ్ లో నుంచి  రెండు  బిస్కెట్లు తిసి ఇచ్చక గాని వాడి గోదావాగాలేదు. అందరూ  మళ్ళి నిద్రలోకి జారుతూండగా గట్టిగా కేకలు వినిపించి లేచి కూర్చున్నాం.

    "నువ్వెవడివోయ్ పద్దంటానికి? నా యిష్టం. దేవుడిని ప్రార్ధంచుకోటాన్నీ అడ్డుచేప్పే హక్కు ఎవడికి లేదు" అంది తాతయ్య గొంతు.

    "ఎస్లిపర్  కోచ్ హ్తె...." అంటున్నాడు  ఇంకొకతను.

    "తాతయ్యకు ఎవరితోనో అభిప్రాయ బేధం వచ్చినట్లుంది" అన్నాడు సారధి.

    ఇద్దరం పక్క కాబిన్ వేపు తొంగి చూశాం .

    ప్తే బెర్తుమీద ఓ సర్దార్  జి, ఇటుపక్కవున్న తాతయ్య వేపు  కోపంగా చూస్తున్నాడు.

    "ఏమయింది తాతయ్య?" అడిగాను.

    "నేను రామదాసు కీర్తనలు పాడుతుంటే ఈ ముండాకొడుకు పాడగూడదంటాడేం?"

    సర్దార్ జి వచ్చిరాని తెలుగులో మాట్లాడాడు మళ్ళి. అతని భాష తాత్పర్యం ఏమిటంటే తాతయ్య అయిదున్నరకే పాడడం మొదలెట్టడం వాళ్ళ తన నిదుర  పాడయిందట.

    "అది తప్పే తాతయ్య ! స్లివార్ కోచ్ లో అలా డిస్టర్బ్ చేయకూడదు" సర్ది చెప్పాను.

    "మరి ఇందాకట్నుంచి వాడెవడో 'కాఫి' అని అరుస్తూ కోచ్ అంతా తిరుగుతున్నాడు కాదురా? వాడినేవారు ఏమీ అసరేం?"

    "వాడి సంగతి  మనకెందుకులే....మన సంగతి మనం చూచు కుందాం!" అంటూ సర్దిచేప్పేసరికి తలప్రాణం  తోకకోచ్చిది.

    ఆ తర్వాత సర్దార్ జి మాకు  మంచి  ప్రెండయిపోయాడు. విజయ వాడలో అతనికి  వ్యాపారం ఉందిట! మా తాఫిక్ ఆటోమేటిగ్గా  పంజాబ్ మీద కెళ్ళింది.

    "అసలి పంజాబ్ కల్లోలానికి ముఖ్య కారణం ఇందిరా గాందే  కదా" అన్నాడు సర్దార్ జి.

    "ఎందుకని?" ఎవరో ఇందిరాగాంది భక్తుడు  కోపంగా అడిగాడు.

 Previous Page Next Page