"ఏంటి మేడం.... ఈ బచ్చాని మళ్ళీ తీసుకొచ్చావు" అని ఖాన్ సాబ్ అంటే-
"అదే రామ్. బయటికి పోయిస స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టుకోరాదూ!" కుందన్ లాల్ అన్నాడు.
పరుశురాం చురుగ్గా వాళ్ళకేసి చూశాడు. అప్పటికే మేడం తమ మనుషులు గదిలో ప్రవేశించి తలోచోట నించున్నారు.
"మేడం.... నువ్వు పక్కకి జరుగు. నేను ఆడతాను" అన్నాడు పరుశురాం.
ఆ మాటలు వింటూనే నందిని కళ్ళు పెద్దవయ్యాయి.
అతని వంక ఆరాధనతో చూస్తూ-
"నువ్వు ఆడతావా?" అంది.
"అవును!" ఆమె చేయి పట్టుకుని కుర్చీలోంచి లేచి ఆ కుర్చీలో కూర్చున్నాడు పరుశురాం.
"హేమ్దీ మేడం! ఈ బచ్చాతో మేం ఆడాలా?" అన్నాడు ఖాన్ సాబ్.
నందిని సమాధానంగా పరుశురాం చేతిని తన రెండు చేతుల్లో తీసుకుని ముద్దు పెట్టుకుంది.
"మా రామ్ కుర్రాడే కాదనను. ఆట ఆడ్డానికి కుర్రాడా పెద్దాడా అన్నది సమస్య కాదుగా. కావాల్సింది డబ్బు ఇదిగో" అంది నందిని.
"అది కాదు మేడం! మీతో ఆడితే వుండే రంజు, పసందు, ఈ బచ్చాతో ఆడితే ఏముంటుంది?"
పరుశురాం చివాలున అతనికేసి చూశాడు. "మిస్టర్ ఖాన్" అతని గొంతు గదిలో ప్రతిధ్వనించింది. అతనలా ఏకవచన సంబోధన చేసేసరికి ఉలిక్కిపడ్డారు ఖాన్ తో సహా అతని దోస్తులు.
మొహంలోకి చిరునవ్వు తెచ్చుకున్నాడు.
"బచ్చా" అని నన్ను తీసిపారేస్తున్న నీకు నాతో ఆట సులువేగా!
గెలుపు సాధ్యమేగా!
నీకు కావాల్సింది డబ్బేగా!
మేడంకి, మీకు అనుభవం వున్న నాకు లేని మాట వాస్తవం.
"ఇదే మొదటిసారి ఓ క్లబ్బులో టేబుల్ పైన జూదం ఆడ్డానికి రంగంలోకి దిగడం. కారీ ఆన్.... కమాన్" అన్నాడు వెటకారంగా.
ఖాన్ సాబ్, కుందన్ లాల్, శ్యామ్ లాల్ మొహమొహాలు చూసుకున్నారు.
"ఓ.కె. కానియ్!"
"కుందన్ లాల్ కలిపి పంచాడు నలుగురికి."
"బెట్టింగ్ నీ ఇష్టం రామ్. ఎంతైనా అభ్యంతరం లేదు" స్టివర్డ్ తెచ్చిన విస్కీ సిప్ చేస్తూ అంది నందిని.
"విస్కీ అంటిన ఆమె గులాబీరంగు పెదిమలు దీపాల కాంతిలో తళుక్కుమని మెరుస్తున్నాయి. అందరూ సొమ్ము బల్లపైన పెట్టారు. బ్లయిండ్ మరో అయిదు" అన్నాడు పరుశురాం. ఖాన్ సాబ్ పదివేలు పెట్టాడు.
పరుశురాం ముక్కల్ని చూసి ఇరవైవేలు బల్లమీద పెట్టాడు. 'షో చేయి!' అన్నాడు ఖాన్.
పరుశురాం చిరునవ్వుతో మూడు ఆసులు చూపించాడు.
ఖాన్ సాబ్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో "సెభాష్!" అన్నాడు.
పరుశురాం గెలుపుచూసి నందిని మరో లార్జ్ పెగ్ ఆర్డర్ చేసింది.
"గోయ్ హెడ్ రామ్!" ఆమె చిన్నపిల్లలా అరిచింది.
పరుశురాం ఆట విధానాన్ని చూసి ఖాన్ సాబ్, అతని సహచరులు నిర్ఘాంతపోతున్నారు.
ఆట ప్రత్యర్ధి చేతిలో వున్నప్పుడు తెలివిగా డ్రాప్ అవుతూ ఆట వున్నప్పుడు ప్రత్యర్ధి చేత ఎక్కువ బెట్ చేయించి గెలుస్తున్నాడు.
పరుశురాం ఆడుతుంటే నందిని మొహంలో భావాలని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఖాన్ ముఠా. అలాంటి సున్నితమైన విషయాల్లో నందినికి అపారమైన అనుభవం ఉంది.
మూడు గంటల్లో రెండున్నర లక్షలు గెలిచాడు పరుశురాం.
"కమాన్ రామ్.... లెటజ్ గో" అంది నందిని.
"కాస్సేపు ఆడదాం!" అన్నాడు ఖాన్ సాబ్.
"నిద్రొస్తోంది, మళ్ళీ రేపు కలుస్తాంగా!" అని అతన్ని వెంటబెట్టుకుని బయటికి నడిచింది నందిని.
కారులో అన్నాడు పరుశురాం.
"నిన్ను నువ్వు పోగొట్టుకున్న డబ్బుని వడ్డీతో సహా గెలిచిపెట్టాను. ఇప్పుడయినా కోపం పోయిందా?" అడిగాడు.
నందిని చిలిపిగా చూసిందతని కేసి, తొడమీద గిల్లుతూ.
"నిన్ను గెలుచుకోడానికే నిన్న నేను డబ్బు పోగొట్టాను. నాకా డబ్బు గెలిచి ఇవ్వడానికి ఈ రోజు నువ్వు గాంబ్లింగ్ కి దిగుతావని నాకు తెలుసు. ఐ వన్ యూ రామ్" నాకు కావాల్సింది నిన్ను గెలుచుకోవడమే! అంది ఆమె.
పరుశురాం షాక్ తిన్నట్టు చూశాడు ఆమెని.
"ఏమిటా లుక్! రేప్ చేస్తావా?" అని ఆమె పగలబడి నవ్వేస్తుంటే ఉక్రోషంతో ఆమెకేసి చూశాడు పరుశురాం.