Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 20


                                                                                   7

    పరుశురాం మచంమీద బోర్లా పడుకున్నాడు.

     అతని కళ్ళు తెరిచే ఉన్నాయి.

     నందిని గుమ్మంలో నుంచుని అతన్ని చూసి చిన్నగా నవ్వుకొంది.

     అతనికి బాగా కోపం వచ్చి  వుంటుంది. ' అలిగాడు' అనుకొంది.

     ఒయ్యారంగా  నడుస్తూ మంచం దగ్గిరికి వచ్చి కూర్చుని అతని వీపు పైన చేత్తో నిమిరింది.

     అతను కదల్లే దు.

     అతన్ని ఏదో విధంగా తన దారిలోకి  మళ్ళించుకోవాలని ఆమె ప్రయత్నం.

     "అబ్బ!ఏమిటయ్యా ఇది! నీ వీపు నాంపల్లి స్టేషనను ప్లాటుఫారమ్ అంత వుంది" కాస్త అతని పైకి వంగి అంది.

     పరుశురాం విసురుగా తల తిప్పి చూశాడు.

     ఆమె అతని మీదకి వంగి  వుండటంతో ముందుకు పొడుచుకొచ్చిన ఆమె వక్షోజాలు అతని మొహానికి  గుచ్చుకొన్నాయి.

     నందిని నిరుత్సాహాన్ని నడిస్తూ అంది.

     నీ  వీపుని నేను పొగిడినట్టే నా అందాన్ని కూడా అలాగే పొగుడుతా వనుకున్నాను.

     నీమీద నాలో రోజు రోజుకీ అనుమానం పెరిపోతుందయ్యా! నువ్వసలు మగాడివేనా?" అంది నందిని.

     చివ్వున తలెత్తి చూశాడు పరుశురాం.

     మాటలకే అంత రోషం పొడుచుకొస్తే చేతల్లో పోటుగాడివనిపించుకోవచ్చుగా!"

    పరుశురాం ఆమే చేతిని విదిలించుకొని బాల్కనీ పేరఫెట్ వాల్ దగ్గరికి నడిచి సిరగెట్ వెలిగించాడు.

     నందిని హంసలా నడిచిందతని దగ్గిరికి.

    "వందమైళ్ళ చివరనించి అడగాలి వీస్తుంటే వచ్చే మగాడు కూడా  లేచి కూర్చుని ఒక్కాసారి ఆ ఆడదాన్ని ముట్టుకొని చచ్చిపోవాలనుకుంటాడు.

     నీకు తెలీదేమో రామ్.

    మగాడికి విలువైన వస్తువు. ప్రాణప్రదమైనదీ ఆడదేనయ్యా!"

     అతను కోపంగా చూశాడు.

     అతని గెడ్డాన్ని పట్టుకొని "కోపమా?" అడిగింది.

     " ................"

    " ఉహ్హూ....." నవ్వింది నందిని.

     "మగాడు అలిగితే మొట్టబుద్దేస్తుంది రామ్? అదే అడపిల్ల అలిగితే బతిమాలినా, ముద్దు చేసినా అందం....

     నువ్వే చెప్పు మరి!

     నిన్ను చూస్తుంటే మొట్టబుద్ది కావడంలేదు.

     "బ్రతిమాలాలనా? ముద్దు చేయాలనా?"

    ఆమె మాటలతో ఎక్కడలేని ఆవేశం వచ్చిందతనికి.

     చేతిలో సిగరెట్ ని బయటికి విసిరేసి ఆమెఊహించని రీతిలో  అమాంతం దగ్గరికి తీసుకెళ్ళి పరుపుమీద పిసిరేశాడు పరుశురాం.

     ఆమె మొహంలో చిరునవ్వు..... కళ్ళల్లో మెరుపుని కూడా గ్రహించలేని స్థితిలో ఆమె మీద పడ్డాడు అతను.

     ఆమె పెదవులపైన , చెంపలపైన,  పొట్టపైన, గుండెల పైన ముద్దులు  కురిపించాడు.  మెల్లగా లేచి చేతులు దులుపుుకున్నాడు.

     "నేను ఖచ్చితంగా మగాడినే మేడం! అది నీకు తెలయాలనే ఈ శాంపిల్  ఇచ్చాను"అన్నాడు.

     అతని మాటలకి నందిని పడీ పడీ నవ్వటం మొదలుపెట్టింది.

     "ఎందుకు నవ్వుతావు!"కోపంగా చూశాడు.

    " ఈ మాత్రాని కే ఏదో ఘనకార్యం చేసినా వాడిలా చేతులు దులుపుకొంటుంటే నవ్వురాదా రామ్.

     నాకు శాంపిల్స్ ఇష్టం వుండదు.  ఏదైనా పూర్తిచేయాలి. ఫుల్ గా తరించాలి."

    పరుశురాం చేతిని పట్టుకొని మంచం మీదికి లాగి కూర్చోబెట్టింది నందిని.

     డబుల్ కాట్ కి తలవేపు బ్యాక్ కి ఆనించిందన దిండుకి వీపుని ఆనించి రిలాక్స్ ఆవుతూ చేతిని  నిమురుతూ  అంది నందిని.

     "నువ్వు భోజనానికెందుకు రాలేదు?"

    అతను మాట్లాడలేదు.

     "నా మీద కోపం వచ్చిందని నాకు తెలుసు రామ్!"అందమె.

     "యూ ఆర్ ఏ ఛీట్!" అన్నాడు ఆ మాటలవల్ల ఆమె చేతికున్న బంగారం బ్యాంగిల్  అతని పొట్టకి గుచ్చుకుంటోంది.

     "చిన్న విషయానికి అంతంత పెద్దమాటలు వుపయోగించనవసరం లేదురామ్!

     నీ షరతుకి నేను భంగం కలిగించేలేదు. నిన్ను బలవంతం పెట్టలేదు. నా ఓటుమి చూసి పోగొట్టుకున్న నా సొ్మ్ముని తిరిగి నాకు గెల్చి పెట్టడానికి నువ్వే ముందుకొచ్చావు?నువ్వే ఆడావు."

     "నువ్వు అలా ఓడిపోవడం డ్రామా అని  నాకు తెలీదు" రోషంగా అన్నాడు.

     ఆమె అతని తొడపైం గిల్లి మనోహరంగా నవ్వుతూ అంది.

      "నికజమే! కాని  ఎందుకో తెలీదు.....! నీలో  వున్న ప్రతిభని నీకు తెలియపర్చాలన్నది నా అభిలాష.

     రామ్!

    దేవుడు ఒక్కో మనిషి ఒక్కో  విద్యలో ప్రావీణ్యాన్నిస్తాడు.

 Previous Page Next Page