"డియర్, ప్లీజ్ రోడ్డుమీద అల్లరి చెయ్యకండి ఇప్పటికే మీరు ఇంటినించి వెళ్ళిపోయారని అందరూ అంటుంటే సగం చచ్చిపోయాను" అంది బాధగా.
"నువ్వెవరో నాకు తెలీదు" విసురుగా వెళ్ళిపోబోయాడు రాబర్ట్.
అప్పటికే కొంతమంది జనం పోగయ్యారు.
మిష్టరీ అర్ధం కాలేదు. రాబర్టుకి. క్షణంపాటు ఆలోచించాడు ఇంకా అక్కడ గొడవపడితే జనాన్ని చూసి పోలీసులు వస్తారు. అసలు కధ అడ్డం తిరుగుతుంది.
"పాపం ఆడకూతుర్నిలా ఎడిపించకండి ఇంటికి వెళ్ళండి" ఎవరో సలహా ఇచ్చారు.
రాబర్టు మాట్లాడకుండా కారేక్కాడు. కారు కదిలింది.
ఆమె ఏమీ మాట్లాడ్డం లేదు.
కారు వేగంగా పోతోంది.
రాబర్టు ఆమెని పరీక్షగా చూశాడు.
గుండ్రిని మొహం, పసిమి చాయ, ముచ్చటైన ముక్కు, పలుచని పెదాలు నోరు , చేపల్లాంటి కళ్ళు. తిర్చిద్దిన కనుబొమ్మలు, చెవులకి పెద్ద రాళ్ళ దుద్దులు , ముక్కుకి ఒంటిరాయి పుడక, నుదట ఆకు పచ్చరంగు బొట్టు స్లీవ్ లెస్ జాకెట్టు వేసుకోడం చేత ఆమె భుజాలు గుండ్రంగా ,సున్నగా కనుపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకొంది జుత్తుని ముడివేసింది ఎక్సిలెటర్ని బలంగా నొక్కుతోన్న ఆమె పాదాలకి ఎత్తు మడమల చెప్పలున్నాయి.
ఆమె ఎవరు?
ఎందుకు తనని తిసుకెళుతోంది? కనిసం ఆమె తనవేపుకి కూడా తిరిగి చూడ్డ౦లేదు.
తన చరిత్ర గానీ ఆమెకి తెలుసా?
తనని తీసుకెళ్ళి ఏం చేస్తుంది?
మిస్టరీ అంతు చిక్క లేదతనికి?
కానీ ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోడానికి అతను సంసిద్దుడయ్యాడు.
ఆమెను ఎన్నో ఆడగాలనుంది కానీ ప్రశ్నించి ప్రయెజనం వుండదనిపించింది.
ఆర్నెల్ల తర్వాత బయటపడి మేరీని చూడాలనుకున్నాడు.
కానీ ఈ తల్లి ఎవరో?
ఆమె భర్తగానీ తన పోలికలో వుంటాడా? వుంటే అతను ఎక్కడో తప్పిపోయి వుండాలి లేకపోతే పారిపోయి వుండాలి. తనని చూసి ఆమె తన భర్తగా అపోహపడి వుండాలి.
కోపందిసి పిచ్చిది కాదు కదా?
పిచ్చిది కాదు, పిచ్చి మనిషయితే కారు వింత నేర్పుగా నడపగాలదా?
కారు బంజారాహిల్స్ రోడ్డు మీద పట్టింది. కొండలమధ్య నిర్మానుష్యంగా వున్నా రోడ్డులో పోతోంది కారు.
రాబర్టు భయపడ్డంలేదు.
భయం అనే మాటని ఎప్పుడో మర్చిపోయాడు. సెంటిమెంట్స్ అనేవాటి నెప్పుడో వదిలేశాడు.
మంచీ చెడుల మధ్య వ్యత్యాసం తప్పు ఒప్పలకి మధ్య భేదం ఇవేటికి అతని డిక్షనరీలో అర్ధాలు లేవు.
రాబర్టు మస్తిష్కంలో ఎన్ని ఆలోచనలున్నా, కారు ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నది అతను గమనిస్తూనే వున్నాడు.
కారు వేగం తగ్గింది.
సమయం ఏడుగంటలు దాటి కొన్ని చిల్లర నిమిషాలని సూచిస్తోంది చేతి గడియారం.
కారు ఓ గేటు ముందు ఆగింది. కారుని చూస్తూనే గూర్ఖాగేటు తీసాడు.
కారు లోపలికి రాగానే గేటు వేసేసాడు గూర్ఖా.
కాంపౌండ్ వాల్ మెయిన్ గేటునించి లోపల బంగాళా సుమారు ఫర్లాంగు దూరం వుంది. చూట్టూ చెట్లు వున్నాయి. అ కారుని చూసి కాబోలు తోటలోంచి నాలుగు పెద్ద కుక్కలు కారు వెనకే పరుగెత్తు కోస్తున్నాయి.
కుక్కలకి చోరికితే ఇంతే సంగతులన్న సంగతి రాబర్టు గ్రహించాడు.
రాబర్టు జేబులోంచి సిగరెట్ పెట్టె తిసి సిగరెట్ వెలిగించాడు.
ఆమె కారు దిగి దిగంగానే ఆ కుక్కలు నాలుగు ఆమె దగ్గరికి చేరి తోకలు వూపుతూ కాళ్ళ చుట్టూ తిరుగుతూ విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాయి.
రాబర్టు కారు దిగలేదు.
ఆమె అతన్ని చూసి నవ్వింది.
"కమాన్, గెట్ డవున్ " అంది. ఆమె అతనితో మాట్లాడం చూసి ఆ కారులోంచి అతను దిగడం చూసి ఆ శునకాలు అతన్ని చూసి గొడవేమి చేయలేదు.
ఆమె నడుస్తుంటే వెనకగా నడిచాడు రాబర్టు.
అది చాలా పురాతనమ్తెన బంగాళా అయినా చక్కగా అలంకరించడం వాళ్ళ బాగుంది
వరండాదాటి పెద్ద హాలులో అడుగు పెట్టాడు ఆమె వెనకే రాబర్టు
గోడలకి ఆయిల్ పెయింటింగ్ చిత్ర పటాలు ఉన్నాయి.
ఎనిమిదడుగుల పొడవులో చేసిన టీపాయ్ వుందక్కడ దానికి మూడువైపు లా సోఫాలున్నాయి .
రాబర్టు గుండె ఝల్లుమంది లోపల్నుంచి ఓ రాక్షసుడు వచ్చాడు.