Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 15

 

    అప్పుడు జైలు  శిక్షకాదు మరణ శిక్ష పడుతుంది.

    అప్ట్రాల్ చేయని జేబు దోంగాతనాన్నే నిరూపించుకోలేని అసమర్ధుడు__హత్య కేసునించి బయటెలా పడగలడు?

    రాబర్టు బాధగా నవ్వుకున్నాడు.
   
    "ఓ మనిషి కోర్టుకొచ్చి నేను హత్యచేశానూ శిక్ష విధించండి." అని అడిగితే వెంటనే శిక్ష వేయదు న్యాయస్ధానం హత్య ఎందుకు  చేసింది చెప్పి. అతను నిరూపించుకుంటే గాని శిక్ష వేయదు.

    కానీ చట్టంగా నిరపరాధిని నేరస్దుడిగా భావిస్తే __అతను నిర్దోషె అయినా నిరూపించుకోమంటుంది. ఆ  మనిషి నోరు లేనివాడు అసమర్దుడూ  అయి కళ్ళు తేలేసి నోరెళ్ళబెడితే-శిక్షకి పాత్రుడ్తె పోతాడు.

    ఎంత విచిత్రం!

    సాక్ష్యాలూ ఆధారాలు తప్పితే అక్కడ మనిషి వ్యక్తిత్వానికి గాని మచితనానికి గాని తావేలేదు.

    తను అయిదు నెలలు గా జ్తేలు శిక్ష ననుభవిస్తున్నాడు.

    రాబర్టు__ఓ జేబు దొంగగా జ్తెల్లో మగ్గిపోతున్నాడు.

    అదే రాబర్టు సాక్షాత్తు అర్జున హత్యకేసులో నిందుతుడ్తెన విజయ్ అని పోలిసులకి చట్టానికి తెలిదు.

    చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వేదికాడట ఎవరో  అలా వుండి పొలిసు డిపార్టుమెంటు.
   
    జ్తెల్లో పెట్టిన  మొదటిరోజున  ఆ శిక్షని అనుభావించేకంటే చచ్చిపోడం మంచిదనిపించింది.

    రకరకాల  నేరస్దుల మధ్య తనూ ఓ నేరస్దుడిలా చేయని నేరానికి నేరస్దుడ్తె  మసలడం ఎంత దౌర్భాగ్యం.

    మొదటిరోజు పారిపోవాలనీపించింది. రెండోరోజు చావాలనిపించింది. మూడోరోజు అక్కడున్న వాళ్ళందర్నీ  చంపెయాలనిపించింది.
 

    క్షణం ఓ గంటగా గంట ఓ రోజుగా, రోజు ఓ నెలగా, నెల ఓ యుగంగా జ్తెల్లో అయిదు నెలలు గడిచింది.

    ఇంకా నెల రోజులు....

    నరకం అంటే బతికుండగా తెలుసుకున్నాడు రాబర్టు.

    గడిచిన అయిదు నెలల్లో రాబర్టు ఒకటి మాత్రం అనుకున్నాడు.

    జ్తేలు శిక్షకంటే ఒకసారిగా వేసే ఉరిశిక్ష నయం అనిపించిందతనికి

    ఇంక నెల !

    ముప్ప్సే రోజులు

    720గంటలు....

    ఇంకా ఓర్పుతో భరించాల్సిన కాలం కొద్ది రోజుల్లో వుంది.

    అయిదు నేలల్లోనూ ఏ ఒక్క నేరస్దుడితోనూ తను మాట్లాడలేదు.

    మాట్లాడించినా పలకలేదు. సమాధానం చెప్పలేదు.

    ఇరుకు గదిలో చీకటి గదిలో చిక్కిపోతూ మగ్గిపోతూ పగలు గాడిదలా బండ పనులు చేస్తూ గడుపున చీకటి జీవితం అతని గుండెని రాయిలా చేసింది. మానవత్వాన్ని రూపుమాపింది మొరటు తనం తనని వంచించిన సమాజంపైన పగ సాధించాలన్న ఓ పట్టుదలా అతనిలో ఉత్పన్నమ్తెనాయి. అందుకే మిగినిన ఆ ఒక్క నెలరోజులు  అతను ఓసిక పట్టాడు.

             *    *    *

    రాబర్ట్ విడుదలయ్యాడు. అతను రోడ్డుమీద గమ్మంలేని మనిషిలా నడుస్తున్నాడు.

    మంచి __ చెడూ

    పుణ్యం, పాపం, ధర్మం,సత్యం, న్యాయం, నీతి అన్న మాట లన్నిటిని ఖూని చేసి సమాజంప్తెన వ్యవస్ధప్తె తిరగబడాలని వుంద తనికి

    తెలిసి కావాలనీ,  ఏ మనిషికి అపకారం చెయ్యలేదు తను కానీ అందరూ తనని వేలెత్తి  చూపిస్తున్నారు.

    తన నిండు జీవితంలో నిప్పులు పోసిన ఏ ఒక్క మనిషిని వదిలిపెట్టాడు.

    కాశ్మీర?

    అరునని చంపిన కిరాతకులు!

    తనని అక్రమంగా జ్తేలుకి పంపిన ఆ దొరబాబునీ.... ఆరాస్కేల్ని

    ప్రతికార వాంచతో అతనిలోని రక్తం సల సలమని మరిగిపోతోంది

    సాయంత్రం ఆరవుతోంది.

    ఆర్నెల్ల తర్వాత తిరిగి ఈ లోకం కేసి చూస్తున్నాడు.

    మేరీ ఇంటికి వెళ్ళాలి ముందు.

    ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావనీ అడిగితే ఏం చెప్పాలి!

    అబిడ్స్ రోడ్డులో నడుస్తున్నాడు రాబర్ట్.

    అర్జున హత్యకేసు ఎంతవరకు  వచ్చిందో? కాశ్మీర పెట్టిన కేసు.

    పోలిసులు తల బద్దలు కొట్టుకొంటూ వుంటాడు.

    రాబర్ట్ పక్కనే ఓ కారు ఆగింది మెరుపులా కారులోంచి దిగి ఎవరో యువతీ రాబర్ట్ చేతిని పట్టుకుంది.

    "ఎవరు నువ్వు" అన్నాడు రాబర్ట్ కోపంగా.

    "పదండి ఇంటికి పోదాం" అంది.

    అతను ఆమె చేతిని విడిపించుకోడానికి ప్రయత్నం చేస్తూ.

    "మీరెవరు? ఇంటికి రావడం ఏమిటి?" అన్నాడు.

    "ఇది మరి బాగుంది కట్టుకున్న ఇల్లాల్ని పట్టుకుని ఎవరని అడుగుతున్నారా? ఎవరన్నా వింటే నవ్వి పోతారు. ముందు కారేక్కండి" అంది.

    "ఇల్లాలా? ఎవరికి?"

 Previous Page Next Page