నల్లగా భయంకరంగా వున్నాడు. మనిషే కాని ఏమరుపాటున చూస్తే రాక్షసిలానే కనబడతాడు. ఒంటిపైన ఏ విధమ్తెన ఆచ్చాదనా లేదు. ఓ అడ్డపంచె తప్పు.
"భయపడకు అతను మా తోటమాలి" అంది ఆమె.
రాబర్టు నవ్వి వూరుకున్నాడు.
"మాలీ నువ్వు వెళ్ళచ్చు" అంది.
"అలాగేనమ్మా" అని ఓసారి రాబర్టు కేసి చూసి వెళ్ళిపోయాడు మాలి.
రాబర్టు దృష్టి అక్కడ కార్పెట్ పైన పడింది. ఓ నలబ్తే ఏళ్ళు పై బడ్డ వ్యక్తి సోఫా పక్కనే కింద కార్పెట్ పైన స్పృహ లేని స్ధితిలో పడివున్నాడు.
అతని పక్కనే ఖాళిచేసిన విస్కీ సీసాలు కొన్ని పడివున్నాయి. ఇంకా సీలు తియ్యని సీసాలు టీపాయ్ పైన వున్నాయి.
బనీను సిల్క్ లుంగి, మెళ్ళో ఓ బంగారు గొలుసు వున్నా యతనికి.
"ఎవరతను?" రాబర్టు అడిగిన మొదటి ప్రశ్నది.
ఆమె నవ్వుతూ చూసింది. అతని దగ్గరగా వచ్చి నడుంచుట్టూ చేతులవేసి తియ్యగా నవ్వుతూ.
"నా భర్త" అంది.
రాబర్టు ఆమె సమాధానానికి బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డాడు.
ఆమె మొహంలోకి చూశాడు.
"మరి నేను?" అడిగాడు.
"నిన్ను చూడగానే అమామ్తరం ఎత్తుకొచ్చి పక్కలో వేసుకోవాలనిపించింది" అందామె అతన్ని చూస్తూ.
అరడుగుల ఎత్తులో వున్నాడతను. కోల మొహం బంగారు చాయలో అతని చెంపలు మెరుస్తున్నాయి. ఒత్తయిన జుత్తు. ఎర్రని పుల్ షర్టునీ బ్లాకు పాంటులో టక్ చేశాడు. నడుంకి వెడల్త్పెన బెల్టు వుంది. చేతికి ఆటోమాటిక్ వాచీ కాళ్ళకి నల్లటి ఘా!
చూసే వాళ్ళనిట్టే ఆకర్షించే మనోహరమ్తెన రూపాన్ని దేవుడతనికిచ్చాడు.
"నీకు మొగుడున్నాడా!" అన్నాడు రాబర్టు.
"లేడని అనలేదుగా కానీ అతనివల్ల నాకు ఏ విధమ్తెన సుఖమూ లేదు. అందుకే అతని స్ధానం భర్తీ చేయడానికి నాకు నువ్వీ రాత్రి కావాలి" అంది.
"రాబర్టు అనుకున్నాడు ఏ క్షణాన దేవుడు తననీ భూమ్మీద పడేశాడోగానీ తార సపడిన ఏ ఆడదీ తన దారిన తనని పోనివ్వడం లేదు.
వాళ్ళని నమ్మడానికి లేదు.
నమ్మకపోవడానికి వీలులేదు. కాశ్మీరనీ నమ్మి వెళితే ఏమైంది?
"నీ భర్త లేని నన్ను చూసై?" అడిగాడు.
"లేవడు ఏనుగుతో తోక్కించినా లేవడు"
"ఒకవేళ లేసై?"
"మనల్ని చూసి సంతోషిస్తాడు" అంది.
"అయితే అలాంటి అనుభవం నీకిదివరకే వుందా?" సూటిగా అడిగాడు రాబర్టు కొరడాపెట్టి కొట్టినట్టయిందామెకి.
"లేదు ఇదే మొదటిసారి" అంది.
"మరి నీ భర్త అలా చేస్తాడని ఎలా చెప్పగాలిగావు?"
"అతను ఏ ఆడదానికి పనికిరాడు"
"నీ పేరు?"
"మోహిని "
రాబర్టు సిగిరెట్ నీ కొరికాడు
"చూడు...." అంది
"నా పేరు రాబర్టు"
"ధాంక్యూ రాబర్టు దొరికిన అవకాశాన్నిప్పడు నేను జార విడుచుకోవాలనుకోవడం లేదు . నీ కోసం నేనెంత సాహసం చేసానో చూశావు ప్లీజ్ పద" అంది.
ఆమె వెనుకే మేడమెట్లు ఎక్కాడు రాబర్టు.
ఆ గదిలో అందమ్తెన మంచంపైన తెల్లని సిల్క్ దుప్పట్లు ఫోమ్ బెడ్ పైన పరచి వున్నాయి గదిలో డ్రైనింగ్ టేబిల్ దగ్గర చిన్న టీపాయ్ వుంది ఆ టేబుల్ దగ్గర రకరకాల టాయిలెట్ సామాగ్రి వుంది.
గదికి మధ్యగా రెండు సోఫాలు మధ్యగా చిన్న డేకొలం బల్ల దానిమీద ఫ్లవర్ వాజ్ సిగరెట్ ఏ ష్ ట్రే వున్నాయి.
గోడకి పెద్ద వర్ణచిత్రం వుంది. అందులో ఓ జింకపిల్లని పులి నోటకరిచి పరుగెత్తుతోంది.
రాబర్టు వర్ణచిత్రాన్ని చూస్తుంటే మోహిని అంది.
"అది చూసినప్పడల్లా నా జీవితం గుర్తుకొస్తుంది. అందుకే చూడగానే కొనేసి ఈ గదిలో పెట్టుకొన్నాను.
రాబర్టు మాట్లాడలేదు. చేతిలో వున్నా సిగరెట్ పీకని ఏ ష్ ట్రే లో కుక్కాడు.
మోహిని చెప్పకుపోతోంది.
"మాది సాధారణ కుటుంబం డబ్బుకి ఆశపడి నన్ను ఆయన కిచ్చారు. పెళ్ళికి ముందే ఆయన సంసార జీవితానికి పనికిరాడని మా వాళ్ళకి తెలుసు."
"మరెందుకు ఒప్పకున్నావు?"
మోహిని జాలిగా చూసింది.
"చెప్పానుగా మా కుటుంబం పరిస్దితులే అందుకు కారణం ఆయనకి డబ్బుంది. అది మావాళ్ళకి కావాలి ఆయన బలహీనత ఎవరికీ తెలీకూడదనీ. తనకీ ఓ అందమ్తెన భార్య వుందని అందరూ అనుకోవాలనీ ఆయన కోరిక."
రాబర్టు వింటున్నాడు.