రాబర్టు చిత్ర మొహంలోకి చూశాడు. గ్రీన్ సిగ్నల్ ఆమె మొహంలో కనబడుతోంది.
కానీ రాబర్టు చలనం లేకుండా కూర్చున్నాడు.
"ఎంత సేపయింది వచ్చి?"
ఆ మాటలకి చిత్ర ఉలిక్కిపడి లేచి నించుంది.
మేరీ బాబ్ చేసిన జుత్తు చేత్తో వెనక్కి తోసుకుంటూ వచ్చి అంతకు ముందు చిత్ర కూర్చున్న స్ధానంలో కూర్చుంది.
రాబర్టు చిత్రని చూసి నవ్వేడు. పక్కనే వున్నా విస్కీ బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు రాబర్టు.
మేరీ చిత్రకి స్తెగ చేసింది. చిత్ర లోపలికి వెళ్ళింది.
"నీ కోసం చికెన్ చేశాను. నీ కోసం చూసి చూసి ఇప్పడే పడుకున్నా" అంది మేరీ.
"ఇంకా భోజనం చెయ్యలేదా?"
"లేదు"
చిత్ర స్టీలు జగ్గుతో నీళ్ళు, రెండు గాజుగ్లాసులు పట్టుకొచ్చింది.
రాబర్టు సీసా ఓపెన్ చేసి గ్లాసులు పోస్తుంటే గోడకానుకొని నించుంది చిత్ర.
స్టీలు జగ్గుని అందుకుంటూ ఓరగా చిత్రని చూశాడు రాబర్టు.
చిత్ర కుడికాలుని కదుపుతూ మెడలోని బంగారు గొలుసుని పెదిమల మధ్య బింగించి అతన్నె చూస్తోంది.
"చిత్రా"
"ఇంకో గ్లాసు పట్రా" అన్నాడు రాబర్టు మేరి "ఉ" అన్నట్టు చూడ్డంతో చిత్ర లోపలి వెళ్ళి మరో గ్లాసు పట్టుకొచ్చింది.
ఆ గ్లాసుని కూడా విస్కిపోసి నింపాడు రాబర్టు.
"చీర్స్" అన్నాడు రాబర్టు గ్లాసు పైకెత్తి ముగ్గురూ గ్లాసుల్ని పెదవుల దగ్గరకి తీసుకున్నారు.
రాబర్టు మాటని తోసి పుచ్చటం ఇష్టంలేక అతనికి కంపెని కోసం అక్కచెల్లెళ్ళిద్దరూ కూడా తాగుతారు. అయితే అతను తాగినంత మాత్రం కాదు.
మేరీ, చిత్ర మరో రెండు తీసుకున్నారు.
సీసాలో మిగిలిన మందుని రాబర్టు నిట్ గా తాగేశాడు.
గొంతులోంచి ఊపితిత్తులలోకి, గుండెల్లోకి, వెచ్చగా ఘాటుగా దిగుతోంది. విస్కీ.
రాబర్టు కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు.
ఆ రోజు ఉదయంనించీ ఏమీ తినక పోవడంతో విస్కీ అతన్ని తేలిగ్గా లోబరుచుకుంటొంది.
మేరీ మెల్లగా అతన్ని లేవదీసి డ్తెనింగ్ టేబిల్ దగ్గరికి తీసు కెళ్ళింది.
చిత్ర సర్వ్ చేసింది.
అతను ఏమీ తినే స్ధితిలో లేడు. తలపోటుగా ఉంది.
మేరీ ముద్దలు కలిపి అతని నోటికి అందిస్తోంది.
పసిపిల్లవాడ్ని బుజ్జగించి తినిపించే తల్లిలా అతన్ని బుజ్జగిస్తోంది. చిత్ర లోపలికి వెళ్ళిపోయింది.
"మజ్జిగ తాగు" అంది
రాబర్టు సంమధానం చెప్పకుండా గటగటమని తాగేశాడు.
రాబర్టునీ మెల్లగా నడిపించుకోచ్చి మంచంపైన పడుకోబెట్టింది మేరీ.
"మేరీ" అని పిలిచాడు రాబర్టు.
"ఏం కావాలి?"
రాబర్టు అదోలా నవ్వేడు.
"నువ్వు నాకేమవుతావని నన్నింతగా ఆదరిస్తున్నావు?" అడిగింది.
"మనసుండాలే కానీ ఏం కాకూడదు? అంది అతని పక్కనే కూర్చుని షర్టు గుండీలు తీస్తూ.
"నీకు బుణపడి పోతున్నాను" అన్నాడు
"బుణం తీర్చుకొనే మార్గం నేను చెపుతాను. భయపడకు" అంది మేరీ"
అతనికి కాస్త గిల్టీ నెస్ తగ్గింది మజ్జిగ తాగడం చేత.
మేరీ మెల్లగా వంగి అతని నుదుట ముద్దు పెట్టుకుంది.
మేరీ విపుచుట్టూ చేతులు వేసి తన మీదికి లాక్కున్నాడు రాబర్టు.
మేరీ అతనికిష్టమ్తెన పద్దతిలో లోంగిపోతోంది.
కిటికీ జాలులోంచి ఆ గదిలోని మనోహరం దృశ్యాన్ని కళ్ళార సిగ్గుపడకుండా చూస్తున్న చిత్రని రాబర్టు చూపులు పసిగట్టినయి.
అతని పెదవులమీద ఓ నవ్వు తేలిపోయింది.
-రాబర్టు లేచి కూర్చున్నాడు. జ్ఞాపకాలనించి అతను తప్పించు కోలేక పోతున్నాడు.
"ముద్దాయి రాబర్టు తను నిరపరాదినని రుజువు చేసుకోలేక పోయిన కారణంగా, అతను నగరంలో జేబులుకొట్టి బతికే దొంగగా భావించి అతనికి ఆరు నెలలుజ్తేలుశిక్ష విధించడమ్తెనది."
ఆనాడు న్యాయమూర్తి కోర్టులో ఇచ్చిన తిర్పది.
ఎంత చక్కని తీర్పు?
తను జేబు దొంగాట.
చటానికి చేవులుంటాయి.
కళ్ళు లేవు.
అది అక్షరాల నిజమని రాబర్టు కిప్పుడు తెలుసు.
కానీ ఒక్కటి మాత్రం నిజం.
అతనే కనక నిజంగా నిర్దోషివని నిరూపించుకోడానికి ప్రయత్నం చేస్తే తన నిజరూపం బయట పడుతుంది.
రాబర్టు _విజయ్ గా దొరికి పోతే హంతకుడిగా తిరిగి న్యాయ స్ధానం ముందు నించోవాలి.