జుత్తు బాగా కత్తిరించేశాడు. మీసకట్టుని పూర్తిగా తీసేశాడు జీన్స్ టైపు దుస్తులు, కాళ్ళకిసాంబార్ లెదర్ ఘా, మెడలో ఆర్టిఫిషియల్ గొలుసు. దానికి శిలువ లాకెట్ వేసుకున్నాడు. కళ్ళకి నల్లద్దాలు
విజయ్ చచ్చిపోయాడు. ఇప్పడతను రాబర్ట్.
అతన్నెవరూ గుర్తుపట్టలేరు.
* * *
రాబర్ట్ చేతిలో సిగరెట్ నీ నేలకేసి కొట్టాడు!
"ఇంకా నెలరోజులు" కసిగా ఉంది. పెదవిని కొరుక్కున్నాడు రాబర్ట్ .
"తనని అన్యాయంగా జైలుకి పంపిన ఆ ఘరానా పెద్దమనిషి ఎవరు?"
పళ్ళు పట పట కొరికాడు రాబర్ట్. జీవితం ఓ రోజుది కాదు. తన జీవితంలో ఆటలాడి తనని పరిస్ధితికి తీసుకొచ్చిన ఏ వ్యక్తినీ క్షమించడు తను.
వెంటాడి తరిమి తరిమి కొట్టాలి. పగ సాధించాలి.
రాబర్ట్ మెల్లగా లేచి కటకటాల దగ్గరికి వచ్చాడు.
రెండు చేతులతో వాటిని వంచేయలన్నంత ఆవేశం అతనికి కలిగింది.
పెంట్రి రాబర్ట్ నీ చూసి అటుగా వచ్చాడు.
"ఏం చేస్తున్నావు?" అన్నాడు.
"జైల్లోంచి పారిపోవాలని చూస్తూన్నా" అన్నాడు రాబర్ట్.
అతని మాటలకి పెంట్రి వులిక్కిపడ్డాడు. "ఆ" అన్నాడు.
"లేకపోతే ఏంటయ్యా. అయిదునెల్లు గడిచిపోయినాయి. మరొక్క నెల తెలివి తక్కువ పనిచేసి శిక్ష పెంచుకోనేంత పూల్ని కాదు. నీవెళ్ళు" అన్నాడు రాబర్ట్ హేళనగా.
పెంట్రి వెళ్ళిపోయాడు.
రెండుగంటలు వినబడ్డాయి రాబర్ట్ కి.
"రేండయిందన్న౦ మాట" అనుకొన్నాడు రాబర్ట్. రాబర్ట్ మెల్లగా వెళ్ళి వెల్లకిలా పడుకున్నాడు.
-అతనికి మేరి గుర్తుకొచ్చింది.
ఆమెని చూడాలనిపిస్తోంది రాబర్ట్ కి.
అయిదు నెలలయింది.
మేరికి తెలిదు తను జైల్లో వున్నట్టు. తెలవడం కూడా అతని కిష్టం లేదు.
మేరి అమాయకురాలు తన మీద ఆశల్ని పెంచుకుంటోంది. తననించి పారిపోయాడను కొంటుంది కాబోలు.
తనది తెగిన గాలిపటం లాంటి బతుకు ఎప్పుడో ఎక్కడో ఏ తుప్పల్లోనో చిక్కుకొని చిరిగిపోయే బతుకు తనది.
తన కోసం మేరి అలమటిస్తూ వుంటుంది మేరి ఓ ఎలిమెంటరి స్కూలో టీచరుగా పనిచేస్తోంది హ్తేదరాబాదు కొచ్చి రాబర్ట్ అవతారం ఎత్తాక ఓ రోజున చర్చిలో తారసపడింది మేరీ. అప్పట్నుంచి ఆమెతో స్నేహం మేరితో పాటే ఆమె చెల్లెలు 'చిత్ర' కూడా వుంటోంది. మేరి నగరంలో ఒంటరిగా వుండటం ఇష్టంలేక తండ్రి జోసఫ్ చిత్రని అక్కడే కాలేజిలో చేర్పించాడు. ఆమె తండ్రి జోసఫ్ ఏలూరులో కలేక్టరాఫిసులో హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు.
చిత్ర కాలేజిలో చదువుకొంటూనే నాటకాల్లో వేషాలు వేస్తుంది. చిత్ర మంచి ఆర్టిస్టు.
ఇంటి వాళ్ళకి అనుమానం రాకుండా వుండటానికి మేరి రాబర్టు తన బావని అతను తనకి కాబోయే భర్తని చెప్పింది. అంచేత ఆ ఇంటికి వచ్చిపోతూ వుండటానికి రాబర్టుకి ఏ విధమ్తెన ఇబ్బందిలేదు.
ఆఖరుసారి మేరీని చూసిందేప్పడు? ఆ మర్నాడు చేయని జేబు దొంగతనానికి గాను అరెస్టు చేశారు.
-హిమాయత్ నగర్ లో పన్నెండో నెంబరు నందులో ఓ ఇంట్లో వుంటుంది మేరి.
తలుపు కొట్టాడు రాబర్టు
రెండు నిమిషాల తరువాత తలుపు తెరుచుకుంది.
గుమ్మానికి అవతల 'చిత్ర' నిలబడి వుంది. అప్పుడు రాత్రి పది దాటింది.
రాబర్టుని చూడగానే చిత్ర మోహంలో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనబడింది.
రాబర్టు ఆమెని తోసుకుంటూ లోపలి నడిచాడు.
"మేరి ఏం చేస్తోంది?" అడిగాడు రాబర్టు.
"అక్కపడుకొంది" అంది చిత్ర తలుపులు వెస్తూ.
రాబర్టు అక్కడే వున్నా ఈజీచైర్లో వాలిపోయాడు. చేతిలో ఉన్న సీసాని పక్కన పెట్టాడు.
చిత్ర మెల్లగా వచ్చి అతని కాళ్ళ దగ్గరే కూర్చుంది. అతని కాళ్ళప్తెన చేతులు వేసి మొహం ఎత్తి అతన్ని చూస్తూ అడిగింది.
"అక్కేగాని నేను పనికిరానా?" ఆమె అడిగిన మాటలకి రాబర్టు నవ్వుతూ సిగరెట్ వెలిగించాడు. తన కాళ్ళ దగ్గరే కూర్చొన్న చిత్ర వేసుకున్న మాక్సిలోంచి ఆమె గుండెలు రెండు బంగారు బంతుల్లా కనబడుతున్నాయి.
చిత్ర నవ్వింది.
అతను ఏం చూస్తున్నాడో గ్రహించింది.
అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ "కావాలా!" అని అడిగింది.
"ఏమిటి?" సిగరెట్ పోగని ఆమె మొహంపైకి వదిలాడు రాబర్టు.
"ఏం తెలీని పాపాయి" అంటూ కొంచెం దగ్గరగా జరిగి బంగారు బంతులతో అతని కాళ్ళని అదిమింది.
ఆడదాని గుండెలగాలి తగిలితే చాలు మగాడికి పిచ్చెక్కి పోతుంది.