Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 12

 

    అర్జున చనిపోయిందన్న  సత్యాన్ని అతను అమగికరించలేక  పోతున్నాడు.

    అదంతా ఓ కలలా వుందతనికి.

    అర్జున లేని జీవితమే కాదు.

    కానీ ఆ హత్య  తను చేసినట్టు  ఆరోపణ ఇది  అతని  గుండెని చీల్చుతోంది. అర్జునని తను  చంపడమా?

    అర్జున ఎవరికీ అపకారం  చేసిందని ఇంత దారుణాని  కోడికట్టారు.

    అతనికి దుఃఖం కట్టలు తెంచుకుంది. మంచం  పైనపడి ఆడ దానిలా విలపించాడు  విజయ్.

    పిడికిలి బిగించాడు కళ్ళెర్రబడినాయి.

    "అర్జునా! నువ్వు లేకుండా నేనెలా వుండగలనను కొన్నావ్? నేనూ  వచ్చేస్తాను. ఈ పాడు ప్రపంచం నన్ను బతకనివ్వద్దు. నిన్ను నేనూ చంపానట విన్నావా అర్జునా!"

    అతన సమయంలో మగాడినన్న  సంగతే విస్మరించాడు.

    చచ్చిపోవాలి.

    రాత్రి  ఎనిమిదయింది.

    చిత్రమ్తెన పరిస్ధితులు.... అతన్ని పిచ్చివాడ్ని చేస్తున్నాయి. పిరికి వాడిని చేస్తున్నాయి. వెర్రెక్కిస్తున్నాయి.

    హొటలు గది  ఖాళి చేసి రోడ్డుమీదికి వచ్చాడు  విజయ్. 

    రిక్షా ఎక్కి ప్రకాశం  బారేజి దగ్గర  దిగాడు. విజయ్ సిగరెట్ కాలుస్తూ చూశాడు.

    కృష్ణానది  బారేజి కింద పరవళ్ళు తొక్కుతోంది.

    బారేజి పైన ట్రాపిక్ ఎక్కువగా వుంది. పక్కన పుట్ పాత్ ల  పైన మిరపకాయ బజ్జీలు, ముంత మసాలా. ఐస్ క్రీం  అమ్మేవాళ్ళతో సందడిగా వుంది.

    కొన్ని క్షణాల్లో కృష్ణానది తన ఉనికిని ఈ ప్రపంచానికి లేకుండా చేస్తుంది.

     విజయ్ తలెత్తి ఇంద్రకీలాద్రి  పర్వతం  కేసి చూశాడు.

    కనకదుర్గమ్మ ఆలయంలో అందమైన దీపాలు వెలుగుతున్నాయి.

    రెండుచేతులూ జోడించాడు  విజయ్.

    "తల్లి, నేను ఏ పాపం ఎరుగను-కానీ పాపిగా ముద్రవేసింది  లోకం నాకు చచ్చిపోయేందుకుదైర్యాన్ని ప్రసాదించు"

    క్షణకాలం పాటు కళ్ళు మూసుకున్నాడు. అడుగు ముందుకేశాడు.

    కానీ ఎవరో చెయ్యి పట్టుకుని ఆపినట్టుగా ఆగిపోయాడు విజయ్.

    ఇప్పుడు చావంటే అతనికి భయంలేదు. కానీ  చచ్చి ఏం  సాదించాలి?

    అర్జునని హత్య చేసిన వాళ్ళని పట్టుకుని  అంతకు పదింతలు చిత్రహింసకి గురిచేసి చంపాలి.

    అర్జున హత్య తను చెయ్యలేదని  నిరూపించుకోడానికి ఒకే ఆధారం కాశ్మీర క్రితంరోజు  రోజంతా గదిలోనే వున్నాడనడానికి  ఇంటి వాళ్ళకి తెలుసు. కానీ కాశ్మీర పైన  తను  అత్యాచారం చేసినట్టు ఋజువవుఅతుంది కాశ్మీర  సాక్ష్యం చెప్పకపోతే  తనే అర్జునని హత్య చేసినట్టు కోర్టు నమ్మి తీరుతుంది. ఉరిశిక్ష తప్పదు.

    తన  జీవితం పెద్ద మలుపు  తిరిగిందని విజయ్ గ్రహించాడు.

     ఇప్పుడు తన కర్తవ్యం ఒక్కటే హంతకుడ్ని పట్టుకుని అంతకింతగా చిత్రహింసలు పెట్టాలి.

    "అర్జునా నీ అనసుని కించపరచి నిన్ను అతిదారుణంగా చంపినా ఆ కిరతకులని  వేటాడి పిచ్చికుక్కల్ని చంపినట్టు చంపుతాను. నీ ఆత్మకి శాంతి చేకూర్చిగాని నేను నీదగ్గరకి రాను" అని ప్రమాణం చేశాడు విజయ్.

    మెల్లగా అడుగులు వేస్తూ బ్రిడ్జిదిగి రోడ్డుమీదికి వచ్చాడు.

    ఇప్పడెక్కడికి?

    లారి ఒకటి ఆగివుంది.

    క్లీనర్ ఆరుస్తున్నాడు.

    "హైదరాబాదు, హైదరాబాదు."

    విజయ్ మరో ఆలోచన చేయకుండా లారి ఎక్కేశాడు.

    లారి తెల్లారేసరికి హ్తెదరాబాదు చేరింది. డ్తెవర్  కి పన్నెండు రూపాయలిచ్చాడు. జేబులో  ఇంకా ఒకే ఒక పదిరూపాయల  కాగితం  మిగిలింది.

    విజయ్  బాధగా నవ్వుకున్నాడు. అప్ట్రాల్  పదిరూపాయలతో  ఈ మహానగరంలో ఎలా బతకాలి!

    చేతికివున్నా పచ్చ వుంగారాన్ని అమ్మేశాడు. వెయ్యి రూపాయ తోచ్చాయి. రెండు జతల బట్టలు ఓ  బ్రీఫ్ కేసు కొన్నాడు.

    ఊరికి చివరగా చిన్న గది  అద్దెకి  తీసుకున్నాడు విజయ్.

    విజయ్ బాగా ఆలోచించాడు తనిలాగే వుంటే పోలీసులు పట్టుకుంటారు. అందుకే తన రూపంలో మార్పు అవసరం అని భావించాడు.

    ఈ ఆలోచనతోనే  చర్చి ముందునించి నడుస్తున్నాడు.

    చర్చి ముందు ఓ ముసలాడు  పచ్చబొట్టులు  పోడుస్తున్నాడు.

    విజయ్ కి  చటుక్కున ఓ ఐడియ మెరిసింది. అంతే ఆముసలాడి  దగ్గర కెళ్ళాడు. చెయ్యి చాచాడు.

    "చెప్పు బాబూ " అన్నాడు ముసలాడు  సూదిని కాలుస్తూ.

    చర్చిలో గంటలు మోగుతున్నాయి. తలెత్తి చూశాడు విజయ్.

    కళ్ళెదురుగా 'శిలువ' కనబడింది.

    "రాబర్ట్ " అన్నాడు విజయ్.

    చేతిమీద శిలువబొమ్మ, రాబర్ట్ అన్న మూడు అక్షరాలని  భాశాడు ముసలాడు (పచ్చ పోడిపించుకున్నాడు) చాలా బాధ కలిగినా ఓర్చుకున్నాడు విజయ్

 Previous Page Next Page