Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 12

 

    చర్చలు మరో యిరవై నిముషాలు వాయిదా!
    అందరూ వెళ్ళిపోయారు! ఐస్ కుర్రాడు సర్వింగ్ అవుసరమావుతుందేమో అని భావించి అలాగే నిలబడ్డాడు.
    "నీకు వేరే చెప్పాలా!" కనుబొమలు విరిచాడు రావూ సాహెబ్!
    అతడు వోణికిపోయాడు. తడబడుతున్న అడుగులతో అరక్షణంలో బయటికి వెళ్ళిపోయాడు.
    గదిలో మిగిలిపోయింది ఆ యిద్దరే!
    "బతాదో సాబ్! కామ్ తో క్యా?"
    "సౌభాగ్యవల్లి లాటరీ ఫలితాలు వచ్చాయి చూచారు కదా!"
    "దేఖా! దేఖా! హోతోక్యా?"
    "ఫస్ట్ ప్రైజ్ పది లక్షలు"
    "దస్ లాక్ ! బడా ప్రయిజ్! కహామిలా?"
    "ఆ టికెట్ మన దగ్గరే వుంది"
    "బహుత్ అచ్చా! ఖుషి ఖర్!"
    "దాన్ని ఎక్సేంజ్ చేద్దామని మీకు కబురు పెట్టాను."
    "బడా ముష్కిల్ హాతా? మర్యాదల స్థాయి నించి నిర్మొహమాటమయిన వ్యాపారిగా మారిపోయాడు నట్వర్ లాల్.
    "మీకు తప్పదు ఈ వ్యాపారం మరొకరి వల్ల సాధ్యపడదు.
    "అతనా బడా అమౌంట్! ఏక్ చార్ కై సామిల్తో సాబ్! ముష్కిల్ కామ్ హై! బడా ముష్కిల్!"
    "టరమ్స్ బతా దీ జియ్!"
    "సగం బ్లాక్ టైగర్ కావాలి"
    "మిగ్తా సగం?"
    "సోనాయా చాందినా!"
    "సగం బ్లాక్ టైగర్ ఒకే! సోనాయా చాందినీ! నా వల్ల కాదు  మహారాజ్! క్షమాకర్ దో ముఝే!"
    "వెండి బంగారంలకి కమీషన్ యిస్తాను"
    "పర్సెంటేజ్ చెప్పండి రావూ సాహబ్"
    "టెన్ పర్సెంట్! మీకు యాభై వేలు మిగుల్తాయి"
    "నై సాబ్! మరొకరు అయితే పచ్చీస్ మిలేగా!"
    "పాతిక పర్సెంట్! చాల ఎక్కువ అడుగుతున్నారు."
    "నై తో బీస్ పర్సెంట్ దో!"
    "లేదు నట్వర్ సాబ్! పదిహేను పర్సెంట్ యిస్తాను!" అన్నాడు ధర్మాజీరావు సేట్ కళ్ళు మూసి ఆలోచించాడు.
    లక్షకి పదిహేను వేలు! అయిదు లక్షలకి డబ్బయి అయిదు వేలు కొద్ది నిమిషాల వ్యాపారం.
    "బ్లాక్ మనీకి పర్సెంట్ ఎంత!"
    "అయిదు పర్సెంట్"
    మొత్తం పది లక్షలకు లక్ష రూపాయల పర్సెంట్ కి యివ్వటానికి బేరం సెటిల్ అయిపొయింది.
    సేట్ ముందుగానే ఊహించాడు. గొప్పవారి దగ్గరకు ఊరికే రాకూడదు కదా!
    పర్సెంట్ ఓ ప్రభుత్వం వసూలు చేసే పన్నునూ మినహాయించుకుని మిగిలిన డబ్బు అప్పటికప్పుడు లెక్క కట్టి యిచ్చేశాడు.
    "లాటరీ టికెట్ మీకింకా యివ్వలేదు. దాన్ని మార్చుకుని ఆ తరువాత డబ్బు యివ్వండి. ఫరవాలేదు " ధర్మాజీరావు.
    నైనై సాబ్! భరోసా హై! ఇలాంటి కాలా బజార్ వ్యాపారం నమ్మకం మీద జరగ వాల! మీకీ మాకీ దోస్తీ చిరంజీవిగా వర్ధిల్లా లాలా! టికెట్ దీ జియ్!
    షాపుకి వెళ్ళి బంగారం పంపుతాను. చాందినీ మార్కెట్ అల్ల కల్లోలంగా వుంది. దీ జియ్ టికెట్!"
    రావు సాహబ్ టికెట్ అందించి డబ్బు తీసుకున్నాడు.
    కేవలం పది నిముషాలు సాగిన "బ్లాక్ టైగర్" అనబడే నల్ల డబ్బు వ్యాపారంలో లక్ష రూపాయలు సంపాదించి ఏమీ తెలియని అమాయాక ప్రాణిలా వెళ్ళిపోయాడు నట్వర్.
    
                                                     6
    నోబుల్ పార్కులో అడుక్కునే వాళ్ళ అలజడి ఎక్కువగా వుంది. పానకాల్సామి వారిని బయటికి పంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. పార్కు తెరిచి ఉంచే వేళల్లో అందరితో పాటు వారికి ప్రవేశముంది -------
    బిలబిలమంటూ వచ్చి క్రమ్ముకున్నారు.
    విశ్రాంతి కోసం వచ్చినవారు సతమత మవుతున్నారు.
    పార్కు అంతా రెండు మూడు సార్లు తిరిగి వచ్చాడు. జనం అప్పటికే పలుచబడి పోయారు. చెట్లు క్రింది బెంచిల చాటున సెటిల్ అవుతున్న బిచ్చగాళ్ళని బయటికి పంపే ప్రయత్నంలో వున్నాడు. పానకాల్సామి.
    మంచినీటి పైపు దగ్గరగా మార్నింగ్ మూన్ పూలమొక్క దగ్గర కూర్చున్న ముగ్గురు యువకులు లేచి వెళ్ళిపోతున్నారు.
    "పేపర్ తీసుకో!" అన్నాడు ఓ యువకుడు.
    "ఒద్దులే! బాగా నలిగిపోయింది వెళ్ళిపోదాం" వాళ్ళు వెళ్ళిపోయారు. పార్కులో పచ్చిక మీద కూర్చునే ముందుగా బట్టలకి మట్టి కాకుండా ముగ్గురూ పేపర్లు పరుచుకున్నారు.
    ముందు మరో పేపర్ పరచుకుని దాని మీద పల్లీలు పోసుకుని తిన్నారు. పేపర్స్ ని అలాగే వొదిలేసి వెళ్ళిపోయారు.
    దాన్ని ఒకసారి చూచాడు ప్రొద్దుటే! మూడవ పేజీలో విదేశీ ప్రతి నిధులతో కలసి రాష్ట్రపతి తీయించుకున్న ఫోటో గ్రాఫ్!
    ఉదయం నించి పడుతున్న శ్రమ యిప్పటికి ఫలించిందన్నమాట! దగ్గరగా వెళ్ళి వొంగి వాటిని అందుకున్నాడు. పేజీ నంబర్లు వరుసగా అమర్చుకున్నాడు.  
    తిరిగి వచ్చి తను అలవాటుగా కూర్చునే బెంచి మీద కూర్చున్నాడు.
    తొమ్మిదవ పేజీ! సౌభాగ్యలక్ష్మి లాటరీ ఫలితాలు.
    ఉదయం నించి పేపరు చూచేందుకయినా చాలని అదృష్టం లాటరీలో కలిసి వస్తుందా? చూస్తె కదా తెలిసేది!
    గుండెలు దడదడ లాడుతున్నాయి. చేతులు వొణుకుతున్నాయి. పానకాల్సామి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు.
    "ఏంటి బాబూ పేపరు విశేషాలు" అని అడిగాడు.
    జయసింహ బదులు చెప్పలేదు. అతని చూపులు అంకెల వెంట పరుగులు తీస్తున్నాయి.
    పది రూపాయల ప్రైజ్ ప్చ్! రాలేదు!!
    నూరు రూపాయల ప్రైజ్ ప్చ్! రాలేదు !!
    వెయ్యి ప్చ్ రాలేదు!
    పదివేలు! అవును వచ్చిందా! ఊహ! ఎందుకొస్తుంది . ఎవరో ఆ అదృష్టవంతులు అక్కడ వేరే నెంబర్లున్నాయి.
    లక్ష రూపాయల ప్రైజ్ ప్చ్ రాలేదు.
    పది లక్షల రూపాయల ప్చ్ రాలేదు! పోయింది. ఎందుకోచ్చిన ఆరాటం! లాటరీలు అవుసరాలు తీరుస్తాయా?
    "అవునూ ! సరిగ్గా అదే నెంబరు! అవును అదే సిరీస్! ఒకే! సిరీస్ అదే! అక్షరాల్ని ఒకటి రెండు సార్లు చూచాడు.
    అదే సిరీస్ హోర్రో! అదే సిరీస్! డబుల్ హెచ్!
    మరి నెంబర్లు ఎనిమిది నంబర్లు!
    ఒకటి .....అవును ఒకటే! డైరీలో ఉన్న నంబరు తో పోల్చి చూస్తున్నాడు జయసింహ! ఉద్వేగం కట్టలు త్రెంచుకొంటుంది.
    సున్నా అలానే రెండో సున్న!
    మూడు నాలుగు అంకెలు ఏడు ఆరు అవును అంతే!
    అయిదు ఆరు అంకెలు సున్నా తొమ్మిది!
    ఏడు ఎనిమిది అంకెలున్నాయి. ఆరు తొమ్మిది!
    అంతే ఆరు తొమ్మిది!

 Previous Page Next Page