Read more!
 Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 3

 

ఓహ్ చాలా గ్రేట్ రా. చాలా మంచి మార్క్స్. నీ అకడమిక్ రికార్డు తో పాటు ఇవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. మంచి యూనివర్సిటీ లో ఎం ఎస్ సీట్ వస్తుంది. పొద్దున్నే చాలా మంచి న్యూస్ చెప్పావు. హార్టీ కంగ్రాట్స్ రా. కీప్ ఇట్ అప్ అన్నాడు.
థాంక్యూ డాడ్ అని తండ్రి పాదాలకు నమస్కారం చేసాడు.
బ్లెస్స్ యు రా. సో,  త్వరలోనే అమెరికా వెళుతున్నావు. గుడ్. నీ ఆశయాలు నెరవేర్చుకో చక్కగా అని భుజం తట్టాడు.  
స్నానానికి లేవండి అంటూ వచ్చింది రేణుక మరో కప్పు కాఫీ తో.
విజయవాడ లో సొంత ఇల్లు ఉంది కృష్ణ కుమార్ కి. విజయవాడ లో పని చేసేప్పుడు స్థలం కొని రెండు అంతస్తులు వేసాడు బాంకు లోన్ తో. 
ఇప్పుడు అందులో తన తమ్ముడు, వాడి ఫామిలీ, తల్లితండ్రులు కూడా వాడితోనే ఉన్నారు. తమ్ముడు  విజయవాడలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో  వర్క్ చేస్తున్నాడు.   
బాంక్ వాళ్ళ రెండో హోసింగ్ లోన్ స్కీం లో హైదరాబాద్ లో ఒక త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొన్నాడు కృష్ణ కుమార్ . తను ముంబై లో ఉన్నా రేణుక, మోహిత్ అందులోనే ఉండేవాళ్ళు ఇబ్బంది లేకుండా. 
కాఫీ తాగేసి స్నానికి లేచాడు.
****
 స్నానం చేసి, ఓ అరగంట పూజ చేసి లేచాడు.
ఇంతలో డ్రైవర్ నుంచి ఫోన్. 
సర్ ! కారు తీసుకున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అపార్ట్మెంట్ అడ్రస్ ఇచ్చారు. ఇంకో ఇరవై నిముషాలలో అక్కడుంటాను అన్నాడు.
సరే రమ్మన్నాడు కృష్ణ కుమార్ తనకు రెడీ అయ్యేందుకు ఇంకో అరగంట టైం పడుతుంది. 
ఇంతలో వేడి వేడి ఇడ్లి టేబుల్ పై ప్లేట్ లో ఉంచింది రేణుక. 
పక్కనే పల్లీ చట్నీ గిన్నెలో ఉంచింది.
చక చక ఇడ్లి తినేసి రెడీ అయ్యాడు. ఇడ్లి తనకు ఇష్టమైన టిఫిన్. 
ఏంటోయ్ కొత్త నవల మొదలెట్టావా అని అడిగాడు రేణుకని.
ఈ సారి వెరైటీ సబ్జెక్టు మీద రాస్తున్నానండి.  మీరు ఆదివారం తీరికగా ఉంటారు కాబట్టి ఆరోజూ డిస్కస్ చేస్తాను అంది.
ఓహ్ నైస్ అన్నాడు.
రేణుక స్ఫురద్రూపి. 
అన్ని పనులు చక చక చేసుకుంటూ పోతుంది. 
కొద్దీ రోజులు కాలేజీ లో లెక్చరర్ గా చేసి మానేసింది. 
ఎప్పుడూ ఖాళీగా ఉండదు. 
అందుకే తన మైండ్ ను ఇలా సాహిత్యం వైపు మళ్లించింది. 
అందులోనూ మంచి పేరు సంపాదించింది. 
ఇంట్లో కంప్యూటర్లో ఎప్పుడూ ఎదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది. 
తాను ముంబై లో ఉన్నా ఒక్కతే ఇంటిని మేనేజ్ చేసింది. 
మోహిత్ చదువు పై తానే ఎక్కువ శ్రద్ధ చూపేది.   
కృష్ణ కుమార్ కి రేణుక అంటే ప్రాణం. 
అతనికి భార్య, కొడుకు ఇద్దరు రెండు కళ్ళు. 
డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది కింద వెయిట్ చేస్తున్నట్లు. 
రేణుకకు చెప్పేసి లిఫ్ట్ లో కిందకు చేరుకున్నాడు.
డ్రైవర్ రాము ను పరిచయం చేసుకున్నాడు.  
కొత్త కారు కదా దారిలో ఎక్కడైనా గుడి దగ్గర పూజ చేయించి తీసుకు వెళదాం అని చెప్పాడు.
సరే సర్ అన్నాడు రాము.
విద్యావతి మేడం ఇల్లు నీకు తెలుసు అని శాంతారాం చెప్పాడు . ముందు మేడం ఇంటికి వెళ్ళు .  అక్కడ ఆమెని పిక్ అప్ చేసుకుని గుడి దగ్గర పూజ చేయించి అటునుంచి యూనిట్ ఇన్స్పెక్షన్ కు వెళదామని చెప్పాడు.
ఓకే సర్ అన్నాడు రాము.
దారిలో కృష్ణ కుమార్ ని విద్యావతి గురించిన ఆలోచనలు వెంటాడాయి. కాకుంటే నిన్ననే డిసైడ్ అయ్యాడు. 
తను పరాయి స్త్రీ. ఆమె గురించి ఆలోచించడం అంత మంచిది కాదు అని. అందాన్ని ఆరాధించవచ్చే కానీ ఇంకెటువంటి ఆలోచన రాకుడదు అని మనసులో నిర్ణయించుకున్నాడు. 
అటువంటి ఆలోచనల వలన చెడుపే కానీ మంచిది కాదు. 
తను ఇప్పటివరకు స్వచ్చంగానే ఉన్నాడు. 
దేవుడు తనకు అందమైన, ఒద్దికైన  చక్కని భార్యను ఇచ్చాడు రేణుక రూపంలో. 
తనకు ఇంకేం కావాలీ. తానూ, తన కుటుంబం, తమ సంతోష జీవితం,  ఈ జన్మకు ఇది చాలు అని అనుకున్నాడు. తను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. 
ఇటువంటి సమయంలో వేరే స్త్రీ గురించి ఈ లేనిపోని ఆలోచనలు ఎందుకు తనకు అనుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న న్యూస్పేపర్స్ చదువుకుంటున్నాడు సీరియస్ గా మనసును మళ్లించే ప్రయత్నంలో.
విద్యావతి ఇంటిముందు కారు ఆపాడు రాము. 
కారు చప్పుడు విని విద్యావతి బయటికొచ్చింది. 
న్యూస్పేపర్ నుంచి తలతిప్పి చూసాడు. 
గుండె మళ్ళీ లయ తప్పింది. 
అదే విద్యావతి. అదే నాజూకు. తనలో ఏమీ మార్పు లేదు. 
కారు డోర్ తీసుకుని వెనుక సీట్లో తన పక్కనే కూర్చుని డోర్ వేసింది. 
అదే బాడీ స్ప్రే. ఓహ్ మళ్ళీ మనసు ఆమె చుట్టే తిరుగుతానంటోంది.
గుడ్ మార్నింగ్ సర్ అంది విద్యావతి.
గుడ్ మార్నింగ్ మేడం. హౌ ఆర్ యూ ? గుర్తు పట్టారా నన్ను. మీరు అశోక్ నగర్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు పది రోజులు ఇన్స్పెక్షన్ కి వచ్చాను. మీరే హెల్ప్ చేశారు అప్పుడు అన్నాడు కృష్ణ కుమార్.
ఎస్ సర్. తెలుసు. మీరు మా బ్రాంచ్ కి పోస్ట్ అవ్వగానే మీరే అనుకున్నాను. నేను మిమ్మల్ని మర్చిపోలేదు అంది నవ్వుతూ. 
కృష్ణ కుమార్ మాట్లాడుతూనే ఆమె జడ వైపు చూసాడు. 
అవును మళ్ళీ అదే స్మాల్ టెయిల్. పెద్ద జడలో చక్కగా పొందికగా ఉంది. అదే తనని ఇంత పరవశానికి గురి చేస్తోంది. లేకుంటే ఇంత వివశుడయ్యెవాడు కాదు. 
నల్లని వాలు జడలో తురిమిన మల్లెపూలు మత్తు గా కవ్విస్తున్నాయి. 
కారు లోపల మల్లెపూల గుబాళింపుతో నిండిపోయింది. 
కృష్ణ కుమార్ ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి.  
ఏంటి ఈ పరీక్ష నాకు అని మనసులో వాపోతున్నాడు.
అబ్బా ఏంటి ఈమె ఆకర్షణ. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతోంది అనుకున్నాడు.  మనసు వశం తప్పుతోంది తెలీకుండానే. 
నిన్న జాయిన్ అయ్యారు కదా సర్. నిన్న ఇంట్లో పని ఉంటె నేను లీవ్ పెట్టాను అని చెప్తోంది విద్యావతి. 
అదే మాట తీరు, అదే ఆకట్టుకునే ఆ గులాబీ రంగు పలుచని పెదాలు. ఏ లిప్స్టిక్ లేకుండా సహజ రంగులో మెరుస్తుంటాయి అవి. 
అబ్బా కృష్ణ కుమార్ వల్ల  కావడం లేదు. ఇక ఈ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకుని మేడం మనం వెళ్లే యూనిట్ గురించి చెప్తారా అన్నాడు. కొంత ఆలోచనలు అటువైపు మళ్లిద్దామని.
విద్యావతి చక చక చెప్తోంది ఆ యూనిట్ గురించి. అన్ని వివరంగా చెప్తుంటే మైండ్ లో వివరాలన్నీ నోట్ చేసుకుంటున్నాడు.
మన బ్రాంచ్ లో ఇదే పెద్ద యూనిట్ సర్. మన లోన్స్ లో అరవై శాతం ఈ యూనిట్ కె ఇచ్చాము. అందుకే దీనిపై ఎక్కువ ఏకాగ్రత చూపించాలి. కస్టమర్స్ మంచి వాళ్ళే. మనం ఇచ్చిన లోన్ అమౌంట్ అంతా యూనిట్ ప్రొడక్షన్ లోనే పెట్టారు. లాభాలు కూడా బాగానే వస్తున్నాయి. లోన్ కి తగ్గ సెక్యూరిటీ ఇచ్చారు. వాయిదాలు తప్పకుండా టైం కు కడతారు. బాగా నమ్మదగిన పార్టీ అని చక్కగా అన్నీ వివరించి చెప్తోంది. విద్యావతి ప్రత్యేకత అదే. తాను చేసే పని మీద టోటల్ కమాండ్ తెచ్చుకుంటుంది. ఇన్స్పెక్షన్ చేసేప్పుడు కూడా అన్నీ సమయానికి అందించినట్లు రికార్డ్స్ ఇచ్చేది. పనిలో ఆవిడ కున్న డెడికేషన్ చాలా ప్రశంసించతగ్గది. బహుశా అదికూడా ఆమె వైపు అట్ట్రాక్ట్ అవడానికి ఒక కారణమేమో. 
సర్ . ఆంజనేయస్వామి గుడి దగ్గరకొచ్చాము. కొత్త వాహనాలన్నీ ఇక్కడే పూజ చేయిస్తారు అని చెప్పాడు రాము. 
మేడం ! బాంకు వాళ్ళు కొత్త కారు ఇచ్చారు ఇవాళనే. దారిలో గుడి దగ్గర పూజ చేయిద్దామని అంటూ చెప్పాడు కృష్ణ కుమార్ విద్యావతి కి.
ఓహ్ ! గుడ్ సర్. నేనూ వస్తాను అంటూ కారు డోర్ తీసుకుని కిందకు దిగింది విద్యావతి. 
షూస్, సాక్స్ కారులోనే విప్పి కారులోనుంచి దిగాడు కృష్ణ కుమార్. 
****
గుడి బయట ఉన్న మంచి నీళ్ల టాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని గుడిలోకెళ్ళారు కృష్ణ కుమార్, విద్యావతి. 
అప్పటికే పది కావడంతో భక్తులు లేక పల్చగానే ఉంది ఆలయం. పేరుకు ఆంజనేయస్వామి గుడి అయినా, మహాగణపతి, ఒక వైపు పంచ ముఖ గాయత్రి, మరొక వైపు వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, నవగ్రహాలు కొలువై ఉన్నారు. గుడి పెద్దదిగానే ఉంది. వాహన పూజ కు ఈ గుడి ప్రసిద్దమని డ్రైవర్ రాము చెప్పాడు. 
పూజారి దగ్గరకెళ్ళి నమస్కరించారు ఇద్దరూ.
మామూలు పూజేమో అనుకుని గోత్ర నామాలు అడిగారు పూజారి గారు తన చేతిలో ఉన్న పూల పళ్లెం తాకమంటూ.
రెండు చేతులతో ఆ పళ్లెం తాకుతూ చెప్పాడు కృష్ణ కుమార్. 
పూజారి భార్యా భర్తలనుకుని ప్రవర పాడడం మొదలు పెట్టాడు.
అయ్యో పూజారి గారు. కొంచెం ఆగండి. మేమిద్దరం బాంకు లో పనిచేస్తున్న సహోద్యోగులం కంగారు పడుతూ చెప్పాడు కృష్ణ కుమార్. 
పూజారి గారు అపచారం అపచారం అంటూ సరిదిద్దుకుని విద్యావతి పేరు గోత్రం అడిగి పూజ మొదలు పెట్టాడు. 
కృష్ణ కుమార్ మాటల కంగారు చూసి విద్యావతి నవ్వుకుంది భలేవారే మేనేజర్ గారు అనుకుంటూ.  
తీర్థ ప్రసాదాలు తీసుకుని కళ్ళకద్దుకుంటూ పూజారి కి చెప్పాడు కృష్ణ కుమార్. కొత్త కారు బాంకు వారు ఇచ్చింది బయట ఉంది. మీరు వాహన పూజ చెయ్యాలి అన్నాడు.
తప్పకుండా అంటూ పూజారి వస్తువులు తీసుకుని బయటకు వచ్చాడు.
చక్కగా పూజ చేసి కారుకు పూల మాల వెయ్యమన్నాడు కృష్ణ కుమార్ ని. 
దానితో కొత్త అందమొచ్చింది కారుకి. టైర్ల క్రింద నిమ్మకాయలుంచాడు రాము. 
పూజారి ఇచ్చిన పూలను జడలో తురిమింది విద్యావతి. అసలే మల్లెపూలు పెట్టుకుంది. దానిపై మరలా చేమంతులు, గులాబీలు తురిమింది. 
కృష్ణ కుమార్ చూడొద్దనుకుంటూనే చూస్తున్నాడు ఆమె వైపు. 
సర్ వెల్దామా అన్నాడు రాము.
 

 

 Previous Page Next Page