Read more!
 Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 2

రుణాలను మంజూరు చేయించి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 
జోనల్ మేనేజర్ ల లో ఎక్కువమంది లంచగొండి అధికారులు తయారయ్యారు. 
కృష్ణకుమార్ లాంటి నీతీ నిజాయితీ అధికారులు అటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఉద్యోగాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. 
ఆ రోజు బ్రాంచ్ కి వచ్చిన కొంత మంది పెద్ద కస్టమర్స్ ని కేబిన్ లో కి పిలిచి మాట్లాడాడు. అందరూ ఎంతో మంచి ఒపీనియన్ ఇచ్చారు బ్రాంచ్ గురించి. అందరికి హామీ ఇచ్చాడు. ఇంకా మంచి కస్టమర్ సర్వీస్ అందచేస్తానని. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. 
పొద్దున్న జాయిన్ అవుతూనే రెఫ్రెషమెంట్స్ తెప్పించాడు. బ్రాంచ్ స్టాఫ్ కి, కస్టమర్స్ కి ఇచ్చేందుకు. అది ఎంతో మంచిదయింది. అందరికీ నచ్చింది కూడా.
జోనల్ మేనేజర్ కి, జోనల్ ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్స్ కి ఫోన్స్ చేసి మాట్లాడాడు రిపోర్ట్ చేసినట్లు. అందరిని పర్సనల్ గా వచ్చి కలుస్తానని చెప్పాడు. అందులో చాలా మంది కృష్ణ కుమార్ కి తెలిసిన వాళ్ళే.
కృష్ణ కుమార్  బాంకు లో చేరి మూడు దశాబ్దాలయ్యింది. 
చాలా వరకు స్టాఫ్ పరిచయమే అతనికి . అందులోను కృష్ణ కుమార్ చాలా బ్రాంచెస్ లొను, హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్స్ లోను వర్క్ చేసాడు. 
అంతే గాక బాంకు స్టాఫ్ కాలేజీ లో రెండు సార్లు ఫాకల్టీ గా కూడా చేసాడు. 
ఆ సమయంలో ఎంతో మంది ట్రైనింగ్ కి వచ్చే వాళ్ళు. 
అలా ఎంతో మంది పరిచయం తనకి.
ఫేస్ బుక్ లో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటాడు కృష్ణ కుమార్. చాలా వరకు పబ్లిక్ రిలేషన్స్  మెయింటేన్ చేస్తాడు. అది తనకి ఎంతో ఇష్టం కూడా.
కృష్ణ కుమార్ భార్య రేణుక గృహిణి. తను కూడా బాగా చదువుకుంది. 
తెలుగు సాహిత్యం లో అందెవేసిన చెయ్యి. 
ఆమె చక్కటి నవలలు, కధలు రాస్తూ ఉంటుంది. 
ఆమె నవలలు కొన్ని సినిమాలు గా కూడా తీశారు. 
ఆమె అతని ప్రాణం, జీవన సర్వస్వము కూడా. 
ఆమె కృష్ణకుమార్ జీవితంలో ప్రవేశించినది మొదలు అతనికి అన్నీ తానే అయి పరవశింపచేసింది. అందుకే ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమంటే తనకంటే కూడా ఆమెనే ఎక్కువగా ప్రేమిస్తాడు. 
ఇంటిని ఓ బృందావనం గా మార్చేసింది రేణుక. 
తానొక్కతే వేలమంది గోపికలకు సాటి. 
అందుకే కృష్ణకుమార్ మనసులో ఇంకెవరూ ప్రవేశించలేరు. 
అంతగా అతని మనసు నిండా నిండిపోయింది రేణూ. 
ఆమె ఏది చేసినా అది కృష్ణకుమార్ మంచికోసమే అని అతని నమ్మకం. 
అందుకే ఆమె మాట జవదాటడు. అలా అని ఆమె ఏరోజూ అతనిని ఇబ్బంది పెట్టలేదు. భర్తని అన్ని విధాలుగా సుఖపెట్టి కంటికి రెప్పలా చూసుకుంటుంది. 
ఇక  కృష్ణ కుమార్ కి  ఒక్కడే మగ సంతానం. 
అబ్బాయి పేరు మోహిత్.  మోహిత్ శ్రీనిధి కాలేజీలో బి టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
మొదటి రోజు బ్యాంకు లో బిజీ బిజీ గా గడవడంతో బాగా లేట్ అయ్యింది. ఇంటికెళ్ళేసరికి తొమ్మిది గంటలు.  భోజనం చేసి టి వి చూస్తూ కూర్చున్నాడు.
సతీమణి రేణుక తాను రాస్తున్న లేటెస్ట్ నవల ఆఖరి భాగం లాప్టాప్ లో తీసుకొచ్చి చూపించింది. 
కృష్ణ కుమార్ కి కూడా తెలుగు సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం. కవితలు, చిన్న కధలు రాస్తుంటాడు తమ బ్యాంకు మ్యాగజిన్ లో. 
బ్యాంకు లో చేరినప్పటినుండి ఎదో ఒకటి రాసి పంపిస్తుంటాడు. అవి అందరి ఆదరణ చూరగొన్నాయి. అతనికి ఏంతో రాయాలని కోరిక ఉన్నా టైం సరిపోకపోవడంతో రేణుక ను ప్రోత్సహిస్తుంటాడు. 
ఆమె రాసే రచనలకు అతను మొదటి పాఠకుడు. 
ఏమన్నా మార్పులు, చేర్పులు చెపుతుంటాడు. 
అందుకే రేణుక ఓపికగా కృష్ణకుమార్ టైం చూసుకుని అతనికి తన రచనలని వివరిస్తూ ఉంటుంది. 
అతనూ శ్రద్ధగా విని తన అభిప్రాయం చెప్తుంటాడు. 
భార్యకు కొన్ని మంచి సామాజిక స్పృహతో కూడిన కథ అంశాలు కూడా చెప్తుంటాడు. 
వాటిపై రచనలు చేయమని సూచిస్తాడు. 
రేణూ కూడా చురుగ్గా వాటిని అందిపుచ్చుకుని చక చక రాసేస్తుంది.
రేణుక రాసిన 'ఇంటింటి రామాయణం' చివరి భాగం చదివి కొన్ని సలహాలు ఇచ్చాడు. 
రేణుక తన అభిప్రాయాలు కూడా చెప్పింది. చివరకు కథను కొంత మార్చి కధ సుఖాంతం చేసింది. చాలా బాగా వచ్చింది అని మెచ్చుకున్నాడు.
కొడుకు మోహిత్ రాత్రి ఎక్కువసేపు చదివి పొద్దున్న లేట్ గా లేస్తాడు. 
వాడి అలవాటు అది. చదువుకోమని వాడికి చెప్పే పని లేదు. ఎంతో శ్రద్ధతో చదువుతాడు. 
తన తోటి స్నేహితులకు కూడా గైడ్ చేస్తుంటాడు. అందుకే వాడికి తన కాలేజీ లో ఒక ప్రత్యేక గుర్తింపు. ఏదైనా చదువు వరకే. అమ్మాయిలు కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు వాడికి. 
ఏ స్నేహమైనా చదువు అనే గిరిలోనే ఉంటాడు. స్నేహితులు వాడితో పిచ్చి మాటలు మాట్లాడాలంటే భయపడతారు. 
ఇప్పటివరకూ కాలేజీ ఫస్టే కాకుండా యూనివెర్సిటీ లెవెల్ లో కూడా ఫస్ట్ రాంక్ లో ఉన్నాడు. 
కాలేజీ స్కాలర్షిప్ తోనే చదువుతున్నాడు మోహిత్. 
అప్పటికే రాత్రి పన్నెండయ్యింది. 
మోహిత్ కి గుడ్ నైట్ చెప్పి కృష్ణ కుమార్,   రేణుక పడుకునేందుకు  ఉపక్రమించారు. 
రేణుక పడుకున్నాక కూడా మధ్య మధ్య లో లేచి కొడుక్కి ఏమన్నా కావాలేమో చూస్తూ ఉంటుంది. 
కృష్ణకుమార్ పడుకుంటూ అనుకున్నాడు. 
ఆమ్మో ! పొద్దున్నే యూనిట్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళాలి. అందులో అది పెద్ద యూనిట్. నాలుగు గంటలు ఈజీ గా పడుతుంది వెరిఫికేషన్ కి. 
అది చూసుకుని మధ్యాన్నం బ్రాంచ్ కి వెళ్ళాలి అనుకుంటూ పడుకున్నాడు. 
****
వేకువ ఝామున ఐదు గంటలకే లేవడం అలవాటు కృష్ణ కుమార్ కి. 
ఎంత లేట్ గా పడుకున్నాతెల్లవారి ఐదు గంటలకు లేవడం మానడు. అరగంట యోగ, ప్రాణాయామం, అరగంట ఓంకారం చేస్తాడు. 
ఫిట్నెస్ అంటే ప్రాణం కృష్ణ కుమార్ కి. బ్యాంకులో కూడా బ్రిస్క్ గా వర్క్ చెయ్యడం అలవాటు తనకి.
తమ బ్యాంకు లో ఎన్నో కొత్త పద్ధతులు కనిపెట్టిన అనుభవం,  ఘనత అతనికి ఉంది. 
బ్యాంకు లోని అన్ని విభాగాల లోనూ పని చేసాడు. సాంకేతిక విభాగం లో ఎక్కువ కాలం పని చేసాడు.  విజిలెన్సు విభాగం, క్రెడిట్ కార్డు, ఆడిట్ విభాగం, ఇన్స్పెక్షన్ విభాగం ఇలా అన్ని విభాగాల లోనూ అనుభవం సంపాదించాడు. అందుకే ప్రమోషన్స్ చక్కగా సమయానికి వచ్చాయి. మేనేజిమెంట్ ప్రశంసలు కూడా పొందాడు. 
ఇన్ఫర్మేషన్ ఆడిట్ విభాగం లో ఉన్నప్పుడు ఒక కొత్త పద్ధతి అమలు చేసి రెవిన్యూ లీకేజీ కనిపెట్టే ప్రోగ్రాం చేసాడు. దానివలన సంవత్సరానికి కొన్ని కోట్లు రెవిన్యూ లీకేజీ ఎక్కడ ఉందొ తెలిసి యాజమాన్యం సరిదిద్దే వాళ్ళు. ఇలా ఎన్నో నూతన ప్రయోగాలు చెయ్యడం, అవి విజయవంతం కావడం, యాజమాన్యం ప్రశంసలు పొందడం జరిగాయి.
ప్రొద్దున ఏడుగంటలయ్యింది. 
రేణుక ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు కృష్ణ కుమార్.
తమ బ్యాంకు విజయవాడ జోనల్ మేనేజర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు అన్న వార్త పెద్దదిగా కనిపించింది పేపర్ లో. 
ఆ జోనల్ మేనేజర్ బాగా లంచగొండి, స్త్రీలోలుడు అని పేరు. డబ్బులు లంచంగా తీసుకుని కోట్లు కోట్లు లోన్లు ఇస్తాడు. అతని బలహీనతను ఆసరాగా చేసుకుని పెద్ద కస్టమర్లు అతనికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఏదో ఒకరోజు అతను పట్టుబడతాడని బ్యాంకు లో అందరకి తెలుసు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. అతని వల్ల తమ బ్యాంకు కు చాలా నష్టం వచ్చింది.  అతని సొంత ప్రయోజనాలకోసం బ్యాంకు ను పణంగా పెట్టాడు చాలా విషయాల్లో. మూడు వందల కోట్ల లోన్ దర్యాప్తు లో భాగంగా అతని ఇంట్లో తనిఖీలు చేశారు. అతని బెడ్ రూమ్ సీక్రెట్ లాకర్ లో రెండు కోట్ల కరెన్సీ, కోటి రూపాయల విలువగల జూవెలరీ, ఇంకా ఇల్లు, ప్లాటులకు సంబంధించిన కోట్ల విలువైన డాకుమెంట్లు దొరికాయి. అతనిమీద కేసు బుక్ చేసి రిమాండ్ కు తరలించారు. అయ్యో ఇలాంటి వాళ్ళ వల్ల తమ బ్యాంకు కు ఎంత చెడ్డపేరు అనుకున్నాడు కృష్ణకుమార్. 
బ్యాంకు ఇచ్చే జీతం చాలక ఇలాంటివాళ్ళు రుణాలు మంజూరు చెయ్యడంలో విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారు. 
ఇంట్లో పెళ్ళాం సరిపోదన్నట్లు బ్యాంకు లో లేడీ స్టాఫ్ ని ఏడిపించడం, వాళ్ళని సెక్సువల్ హెరాస్ చెయ్యడం వంటివి చేస్తున్నారు. 
ఎంత అప్రదిష్ట తన బ్యాంకు కి అని బాధపడ్డాడు.  
ఇంతలో సబ్ మేనేజర్ శాంతారాం దగ్గర నుంచి ఫోన్. 
చెప్పండి శాంతారాం గారు అన్నాడు.
సర్ మీరు ఎన్ని గంటలకు ఇన్స్పెక్షన్ కు బయలుదేరుతారు అని అడిగాడు .
కొత్త కారు అలాట్ చేసినట్లు నిన్న రాత్రి సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఏ జి ఎం చెప్పారు. అది హెడ్ ఆఫీస్ లో ఉందట. 
డ్రైవర్ దాన్ని తీసుకుని తొమ్మిదింటికి వస్తానన్నాడు. 
రాగానే బయలు దేరుతాను అని చెప్పాడు కృష్ణ కుమార్.
సర్ ఆ యూనిట్ చాలా పెద్ద యూనిట్. అది ఎక్సక్లూసివ్ గా విద్యావతి మేడం మానిటర్ చేస్తోంది. ఆ యూనిట్ ఇన్స్పెక్షన్ కు ఇంతకు ముందు ఏ జి ఎం గారితో పాటు మేడం కూడా వెళ్ళేది ఇన్స్పెక్షన్ కి. ఇప్పుడే మేడం కి ఫోన్ చేసాను. తను కూడా మీతో వస్తానంది. కారు డ్రైవర్ కి తన హౌస్ తెలుసు. మీరు ఆవిడని పిక్ అప్ చేసుకుని వెళ్లొచ్చు. మీకు ఇన్స్పెక్షన్ ఈజీ అవుతుంది. తన దగ్గర ఆ యూనిట్ తాలూకు వివరాలన్నీ సాఫ్ట్ కాపీ ఉన్నాయి అని  వివరించాడు శాంతారాం.
ఓ గుడ్ శాంతారాం గారు. మేడం ని పిక్ అప్ చేసుకుని వెళతాను. నాకు చాలా సహాయంగా ఉంటారు ఆవిడ. మీరు మేడం కి చెప్పండి వస్తున్నట్లు అని చెప్పాడు.
ఓకే సర్. ఉంటాను అని ఫోన్ పెట్టేసాడు శాంతారాం.
డాడ్ అంటూ మోహిత్ వచ్చాడు. వాడు ఎక్కువ మాట్లాడడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ సబ్జెక్టు బుక్స్ ఎదో ఒకటి చదువుతూ ఉంటాడు. ఎవరూ చెప్పే పనిలేదు. తన లక్ష్యం తనకు తెలుసు. 
చెప్పు మోహిత్ ఏంటి విశేషాలు. ఎలా ఉంది నీ స్టడీస్ ? ఫైనల్  సెమిస్టర్ కదా ఇప్పుడు అన్నాడు.
యస్ డాడ్. ఆన్లైన్ లో జి ఆర్ ఈ, టోఫెల్ మార్క్స్వచ్చాయి అంటూ వివరించి చెప్పాడు.
 

 Previous Page Next Page