Read more!
 Previous Page Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 4

 

పద రాము. ఇక్కడనుంచి ఎంత టైం పడుతుంది అని అడిగాడు.
ఒక గంట పడుతుంది సర్.
అక్కడ కూడా ఎక్కువ టైం పడుతుంది సర్. పెద్ద యూనిట్ కదా. వారితో మాట్లాడి అన్ని చూడాలంటే సాయంత్రం వరకు అవుతుంది అంది విద్యావతి.
ఓహ్ ఒకే. ఫస్ట్ టైం కదా ఇవాళ ఎక్కువ టైం ఈ యూనిట్ మీద స్పెండ్ చేద్దాం అన్నాడు కృష్ణ కుమార్. 
ముగ్గురు కారులో ఎక్కారు. 
కారు బయలుదేరింది. 
అయ్యో కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను అంది విద్యావతి.
ఇదిగోండి అంటూ పూజారి గారు ఇచ్చిన కుంకుమ ప్యాకెట్ తీసి ఇచ్చాడు కృష్ణ కుమార్.
ఓహ్ థాంక్యూ సర్ మెచ్చుకోలుగా అంది.
ఓకే అంటూ మళ్ళీ ఆ కుంకుమ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు. అబ్బా ఒక గంట కాలక్షేపం చెయ్యాలి అనుకున్నాడు కృష్ణ కుమార్. అప్పటికే తనతో తెచ్చుకున్న న్యూస్పేపర్స్ చదవడం పూర్తయ్యింది. 
ఎక్కడ సర్ మీరు ఉండేది అడిగింది విద్యావతి.
హిమాయత్  నగర్ మేడం.
ఓహ్ మా అశోక్ నగర్  కు దగ్గరే. బాగా బిజీ ఏరియా కదా మీది.
మా ఏరియా అంత బిజీ గా ఉండదు. మా ఫ్లాట్ కొంచెం లోపలికి ఉంటుంది. ఐదేళ్ల క్రితం కొన్నాను. కంఫర్ట్ గానే ఉంటుంది. మీది ఇండిపెండెంట్ హౌస్ లా ఉంది.
అవును సర్. మేము ముగ్గురు సిస్టర్స్. మా పేరెంట్స్ ప్రాపర్టీ. క్రింద నేనుంటాను. పైన రెండు పోర్షన్స్ లో మా సిస్టర్స్ ఇద్దరూ ఉంటారు.
ఓహ్ చాలా ప్రైమ్ ప్రాపర్టీ. రోడ్ మీదే ఉంది మీ ఇల్లు. గుడ్ అన్నాడు. మీ వారికి ప్రమోషన్ మీద కరీంనగర్ వెళ్లారని చెప్పారు శాంతారాం.
అవును సర్. సీనియర్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. లాస్ట్ మంత్ వెళ్లారు. వీక్ ఎండ్స్ వస్తుంటారు తను. 
సో, మీరు ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వెళ్తారేమో త్వరలో.
నో సర్. నాకు ఇంటరెస్ట్ లేదు. మా పెద్ద సిస్టర్ విడో. ఒక్కతే ఉంటుంది. ఆమెకు హెల్ప్ గా ఉండాలి నేను. ఇంకొక సిస్టర్ కి ట్రాన్స్ఫర్ డ్యూ వుంది హైదరాబాద్ నుంచి. అందుకే నేను కరీంనగర్ వెళ్లే ప్లాన్ లేదు.
మీ పిల్లలు ఏం చేస్తుంటారు అని అడిగాడు.
పెద్దబ్బాయి శ్రీకాంత్ ఇంజనీరింగ్ పాసై ముంబై లో వర్క్ చేస్తున్నాడు. పాప శ్రీష ఎం ఎస్ చదివేందుకు వెళ్ళింది. తను రెండు నెలల క్రితమే వెళ్ళింది.
ఓహ్ నైస్. మా వాడు కూడా ఎం ఎస్ చదివే ప్లాన్ లో ఉన్నాడు. నిన్ననే జి ఆర్ ఈ, టోఫెల్ మార్క్స్ వచ్చాయి. శ్రీనిధి కాలేజీలో కంప్యూటర్స్ చదువుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ లో ఉన్నాడు.
మా పాప కూడా కంప్యూటర్స్ లో బి టెక్ పూర్తి చేసింది సర్ . 
తనకి మంచి స్కోర్స్ వచ్చాయి జి ఆర్ ఈ, టోఫెల్ లో. 
అందుకే మంచి యూనివర్సిటీ లో ఎం ఎస్ సీట్ వచ్చింది.
విద్యావతి మాటలేమోగాని ఆ పూల పరిమళం మాత్రం కృష్ణ కుమార్ ని తెగ చుట్టేస్తోంది. 
మీ కధలు, కవితలు మన బ్యాంకు హౌస్ మేగజీన్ లో చదువుతుంటాను సర్. చాలా బాగుంటాయి. కంప్లిమెంట్ చేసింది.
థాంక్యూ మేడం.
మీరు మాటి మాటికీ మేడం అనక్కర్లేదు. విద్య అంటే చాలు నొచ్చుకుంటూ అంది విద్యావతి.
నాకు అలా అలవాటు లేదు. న్యూ రిక్రూట్మెంట్ అయిన ఆడపిల్లల్ని కూడా మేడం అనే అంటాను.
సరే మీ ఇష్టం. నేను చెప్పేది చెప్పాను అంది.
సరేనండి. అందరి ముందు మేడం అంటాను. ఎవ్వరూ లేకుంటే విద్య అంటాను. ఓకే నా నవ్వుతూ అన్నాడు కృష్ణ కుమార్. 
థాంక్యూ అంది నవ్వుతూ విద్యావతి. 
ఆ నవ్వెంటిరా బాబు అలా కవ్విస్తోంది. అమ్మ బాబోయ్ అస్సలు టెంప్ట్ కాకూడదు. ఇవి ఎప్పుడూ ఇలానే ఉంటాయి తమాషాగా. ఏ మాత్రం మనసు తూలినా ఎన్నో ఇబ్బందులు తప్పవు, అస్సలు తూలకూడదు, మనసులో గట్టిగా అనుకున్నాడు కృష్ణ కుమార్. 
డ్రైవర్ రాము  ఒక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి పాటలు వింటున్నాడు ఏకాగ్రతతో రోడ్ ని చూస్తూ. 
****
ఇంకా అరగంట ప్రయాణం ఉంది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. 
ఆ మౌనాన్ని చీలుస్తూ ఎలా ఉంది సర్ మీ ముంబై అసైన్మెంట్ అని అడిగింది విద్యావతి. 
చాలా బాగుంది. ట్రెజరీ డిపార్ట్మెంట్ కదా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. షేర్స్ , సెక్యూరిటీస్ తో ఎలా డీల్ చెయ్యాలి, బ్యాంకు కు ఎలా లాభాలు తేవాలి ఇలా ఎన్నో తెలీని కొత్త కొత్త విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండేది. ప్రమోషన్ మీద ఇక్కడకు వచ్చాను కానీ వర్క్ విషయంలో అక్కడే బాగుంది మేడం అనబోయి విద్యా అన్నాడు రియాక్షన్ చూద్దామని.
విద్యా అన్న పిలుపుకి చాలా హ్యాపీగా కృష్ణకుమార్ వైపు చూసింది విద్యావతి. ఇలా వన్ టు వన్ ఉన్నపుడు అలానే పిలవండి. ఐ ఫీల్ హ్యాపీ అంది.
ఓకే అన్నాడు కృష్ణ కుమార్. అసలే తను ఓల్డ్ ఫ్యాషన్డ్. మధ్యలో ఈ పేరు పెట్టి పిలవడం ఏంటో అతనికి అర్ధం కాలేదు. అదీ పరాయివాళ్ళని అలా పేరుతో పిలవడం అతని సిద్ధాంతాలకు విరుద్ధం. 
తన హ్యాండ్ బాగ్ ఓపెన్ చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇచ్చింది. తీసుకోండి ఇంకా అరగంట ప్రయాణం ఉంది. 
తీసుకున్నాడు నవ్వుతూ.
పాటలు వింటారా అంటూ తన మొబైల్ కి ఇయర్ ఫోన్స్ తగిలించి ఒకటి తన చెవిలో పెట్టుకుని రెండోది కృష్ణ కుమార్ కి ఇచ్చింది చెవిలో పెట్టుకోమని. వైర్ దూరం సరిపోకుంటే విద్యావతి అతనికి దగ్గరగా జరిగింది. అలా జరగడంలో కారు కుదుపుకు ఆమె ముందుకు పడబోతే  ఆమె చేతిని కృష్ణ కుమార్ పట్టుకున్నాడు . 
థాంక్యూ అంది నవ్వుతూ.
జాగ్రత్త అన్నాడు తానూ నవ్వుతూ.
పాట సెలెక్ట్ చేసి ఆన్ చేసింది. 
మధురాపురి సధన, మృదువదన మధుసూదన…
ఇహ స్వాగతం కృష్ణా… శరణాగతం కృష్ణా
అంటూ హృద్యంగా వస్తోంది పాట 
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం అన్నాడు కృష్ణ కుమార్.
ఓహ్ నాకు చాలా చాలా ఇష్టం. రోజుకు ఒక్కసారైనా ఈ పాట వింటాను. పడుకునేప్పుడు కంపల్సరీ గా విని పడుకుంటాను అంది విద్యావతి తానూ హమ్ చేస్తూ.
మీ వాయిస్ చక్కగా ఉంది. మీరు పాడుతారా అన్నాడు.
జస్ట్ ఇంట్లోనే. నాకు నచ్చిన పాటలు పాడుకుంటుంటాను.
ఓహ్ అయితే మీ పాటలు వినాల్సిందే అన్నాడు.
అయితే సాయంత్రం నన్ను డ్రాప్ చేసినప్పుడు మా ఇంటికి రండి. కాఫీ ఇచ్చి ఒక పాట పాడి వినిపిస్తాను అంది కొంటెగా .
ఓహ్ సరే అన్నాడు అప్రయత్నంగా. 
థాంక్స్ అంది.
హడావిడిలో వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయాను. గుడి దగ్గర తీసుకోనుండాల్సింది అంటూ రాముకి చెప్పి కారు ఆపే ప్రయత్నం చేయబోయాడు కృష్ణ కుమార్. 
ఎందుకు. నా దగ్గర బాటిల్ ఉంది. తీసుకోండి అంటూ ఇచ్చింది.
మీ హ్యాండ్ బాగ్ అక్షయ పాత్ర లా ఉంది. అన్నీ ఉన్నాయి అందులో అన్నాడు వాటర్ బాటిల్ తీసుకుంటూ.
మరి అవసరం కొద్దీ అన్నీ పెట్టుకోవాలిగా. మీ మగవాళ్ల లా చేతులూపుకుంటూ రాలేము గా మా ఆడవాళ్ళం బయటికొచ్చేప్పుడు అంటూ నవ్వింది.
బాగా దాహంగా ఉంది. మెనీ మెనీ థాంక్స్ అన్నాడు నిజాయితీగా. 
****
ఆ దూరంగా కనిపించేదే 'విరాజ్ స్పిన్ టెక్స్' అని చూపించింది విద్యావతి. 
ఓహ్ చాలా పెద్ద యూనిట్. అన్ని ఆక్టివిటీస్ ఇక్కడే జరుగుతాయన్నమాట  అన్నాడు.
ఎస్ సర్. మనం లోన్ ఇచ్చింది ఆరు వందల కోట్లు. కన్సార్టియం అడ్వాన్స్ లో మిగతా బ్యాంక్స్ ఇంకో నాలుగు వందల కోట్లు ఇచ్చాయి. మనం ఎక్కువ ఇచ్చాం కాబట్టి మనమే లీడ్ తీసుకుని మానిటర్ చేస్తున్నాము. రిపోర్ట్స్ మిగతా బ్యాంక్స్ కు పంపుతాము. 
బట్ టెక్నికల్ ఆడిట్ కూడా చేయాలేమో.
అవును సర్. మూడు నెలలకొకసారి టెక్నికల్ ఆడిట్ చేయిస్తాము. 
ఈ యూనిట్ పై మీ ఒపీనియన్ ఏంటి ?
బ్యాంకు వాయిదాలు కట్టడం, ప్రొడక్షన్, సేల్స్, ప్రాఫిట్ వరకు ఓకే సర్. హెల్త్ అఫ్ యూనిట్ కూడా బాగానే ఉంది. అంతవరకే నాకు తెలుసు అంది విద్యావతి. 
ఓకే అన్నాడు.
కారు పోర్టికోలో ఆగగానే జనరల్ మేనేజర్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. 
చైర్మన్ రూంకి వెళ్ళాము. ఆయన ఎదురు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. చాలా మర్యాదలు చేశారు.
కంపెనీ గురించి అంతా వివరించారు. అన్నీ విన్నాడు కృష్ణ కుమార్. కొన్ని కీలక పాయింట్స్ అడిగి వివరాలు తెలుసుకున్నాడు. కంపెనీ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్రశ్నలు ఊహించలేదు. విద్యావతి కి కూడా ఆశ్చర్యం కలిగింది. చాలా డీప్ గా పరిశీలిస్తున్నారు అనుకుంది. తెలివిగల్లవాడే అని మనసులో మెచ్చుకుంది కూడా.   
అంత పెద్ద లోన్ కాబట్టి బ్యాంకు మేనేజర్ కి చాలా భాద్యత ఉంటుంది. ఏమాత్రం తేడా లొచ్చినా కృష్ణ కుమార్ కు చాలా ఇబ్బందులొస్తాయి. అందుకే అన్ని అకౌంట్స్ నిశితంగా పరిశీలించాడు. కొన్ని అడిషనల్ రిపోర్ట్స్ అడిగాడు. వాళ్ళు మెయిల్ చేస్తామన్నారు. చాలా పెద్ద ఫ్యాక్టరీ. అందులోనే అన్నీ ప్రాసెస్ లు జరుగుతాయి. బాటరీ కార్లో తీసుకెళ్లి అన్నీ చూపించి వివరించారు. తను తెచ్చుకున్న స్పైరల్ బుక్ లో అన్నీ నోట్ చేసుకున్నాడు కృష్ణ కుమార్. ఇంకొన్ని చూడాల్సినవి మిగిలాయి. 
ఇంతలో లంచ్ టైం అయ్యింది. సెపరేట్ రూమ్ లో లంచ్ ఏర్పాటు చేశారు. 
విద్యావతి లంచ్ బాక్స్ తీసింది తన బాగ్ లోనుంచి. 
అదేంటి అన్నట్లు చూసాడు కృష్ణ కుమార్.
మేడం ఇక్కడ తినరు సర్. ఇప్పటికి చాలా సార్లు వచ్చారు కానీ లంచ్ మాత్రం తీసుకోలేదు. కేవలం కాఫీ, టీ మాత్రమే తీసుకుంటారు అన్నాడు ఫ్లోర్ మేనేజర్.
ఓహ్ గుడ్ నాకు తెలీదు లేకుంటే నేనూ తెచ్చుకునేవాడిని అన్నాడు.   
మీరు తీసుకోండి. ఎవ్వరూ తీసుకోకుంటే బాగోదు అంది.
సర్ నాన్ వెజ్ తెమ్మంటారా అని అడిగాడు చెఫ్. ఇవాళ స్పెషల్ ఐటమ్స్ చేసాం అన్నాడు.
నో నో . వెజ్ మాత్రమే అన్నాడు కృష్ణ కుమార్.
హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి మీకు అభ్యంతరంలేకపోతే అన్నాడు ఫ్లోర్ మేనేజర్.
నేను అస్సలు ముట్టుకోను. సారీ అన్నాడు కృష్ణ కుమార్. 
మంచి వెజ్ లంచ్ సర్వ్ చేశారు. 
 

 

 Previous Page Next Page