Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 11


    అవంతి అతన్ని గమనించింది.


    ఇక అతన్ని అంతగా రెచ్చగొట్టడం అంత మంచిదికాదని గ్రహించింది. అవసరం వచ్చినప్పుడల్లా అతనికెలా పాఠం చెప్పాలో అవంతికి తెలుసు. అందుకే అతన్ని తన వేపుకు తిప్పుకోడానికి ప్రయత్నం చేస్తూ తమాషాగా వచ్చింది.


    "నన్ను తీసుకొచ్చింది పోట్లాడ్డానికా డియర్!" అంది.


    "నా మూడ్ పాడు చేశావు"


    చేతకాక మద్దెల ఓడన్నట్టుంది. నే వెళ్తానయితే. అనవసరంగా పర్మిషన్ వేస్టయింది" అంది బ్యాగ్ ని చేతిలోకి తీసుకుంటూ అవంతి.


    "అదేం, వెళ్ళిపోతావా?" అడిగాడు.


    అతని సంగతి అవంతికి తెలుసు. ఆడది అందుబాటులో వుంటే అనవసరంగా వదులుకోడు మనోహర్. తనని వెళ్ళనివ్వడని అవంతికి బాగా తెలుసు.


    "ఎందుకుమరి! ఈ వేళ పూర్తి కాల్ షీట్ నీకిచ్చాను. కల్చరల్ ప్రోగ్రాంకి మూడ్ పాడైపోయిందంటున్నావు. ఇంకా నేనిందుకిక్కడ?" అంది అలవోకగా అవంతి.


    అవంతి భుజాన్ని పట్టుకుని గుంజాడు మనోహర్.  ఆ వూపుకి ఎవరో విసిరేసిన మల్లెపువ్వులా అతని ఒడిలో పడింది అవంతి.


    అతని మొహంలోకి చూసింది.


    అతని జుత్తు చెదిరి మొహంపైకి పడుతోంది.

    
    అతని కళ్ళు రక్తంలో ముంచి తీసిన గడ్లలా ఉన్నాయి.


    సగం మూసిన కళ్ళతో చూస్తూ చెప్పాడు మనోహర్.


    "ఐ లైక్ యు బట్ ఐ డోంట్ లవ్ యు!"


    "థాంక్యూ" అంది అవంతి అతని చెంపలను సవరదీస్తూ.


    "అవంతి, ఏ హీరోయిన్ తో అయినా సరే ఒకే టేకులో షూటింగ్ పూర్తి చేస్తాను కానీ నీ విషయంలోనే ఇన్ని టేకులు. కారణం నాకు రెచ్చగొట్టే ఆడవాళ్ళంటే ఇష్టం!" అంటూ రెండుచేతులతోనూ ఆమెను బంధించాడు. ఆమె పెదవుల్ని అందుకోబోయాడు విస్కీవాసన గుప్పున కొట్టి కడుపులో తిప్పినట్టయింది అవంతికి.


    మనస్ఫూర్తిగా అతనికి సహకరించలేకపోయింది.


    "భగవాన్ నా కెందుకిచ్చావీ జన్మ" అంటూ ఆమె గుండెలోతుల్లోంచి నిట్టూర్పు.


    పవిటని తప్పించి, లోనెక్ జాకెట్ హుక్స్ తప్పించాడు. ఇండియా రబ్బర్ లా వున్న ఆమె గుండెలపైన మత్తుగా ముద్దు పెట్టుకున్నాడు.


    అవంతి క్షణంపాటు కళ్ళు మూసుకున్నది. రెండు చేతుల్నీ అతని మెడ చుట్టూ వేసి దగ్గరగా లాక్కుంది.


    "నువ్వీ అలవాట్లు మానేసి బాగుపడ్డం నా కిష్టం. భారతిని మోసం చేయకు. పెళ్ళి చేసుకో. సుఖపడతావు!" అంది.


    అతను విన్నాడు.


    నవ్వాడు.


    అదోలా నవ్వాడు.


    అతనిప్పుడు అసలేమీ విని స్థితిలో లేడు. రాయల్ ఛాలెంజి మెదడుకెక్కింది.


    అవంతిని బలంగా వెనక్కి తోస్తున్నాడు. అతను పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నాడు. అయినా భరిస్తోంది.


    మనోహర్ ఒంటిపైన షర్టుని తీసి గదిలో మూలకి విసిరేశాడు. గాలివానికి విరిగిపడుతోన్న వృక్షంవో ఆమెపైన అతడు పడుతోంటే, అతని మెడలోని బంగారు గొలుసు ఆమె చెంపకి గీసుకొంది.    


                                          8


    రెండు రోజులుగా అవంతి చాలా అశాంతిగా వుంటోంది. దానికి కారణం మనోహర్ తో జరిగిన వాదనకూడా ఒకటి. డబ్బు మదం వల్ల అతనికి వళ్ళు తెలీడంలేదని చాలాసార్లు అనుకుంది ఈ రెండురోజుల్లోను.


    మనోహర్ కి తనంటె అభిమానం లేదు. కేవలం చులకనభావం వుంది.


    ఆడది అందుబాటులోకి వచ్చేవరకు మగాడు దాని పాదాల దగ్గర దాస్యం చేయమన్నా చేస్తాడు. ఒక్కసారి అది వాడి అనుభవంలోకి వెళితే దారుణంగా చులకన అయిపోతుంది.


    మూడు వందల అరవై రోజులూ అవతల వ్యక్తివి కావచ్చు. మిగిలిన అయిదు రోజులైన ఇవతలి వ్యక్తికి మిగులుతాయి. ఆ అయిదు రోజులు చాలు ఈ మగాళ్ళకి బుద్ధి చెప్పడానికి.


    అసలు మగాడి అవసరం ఆడదానికి లేనే లేదని చెప్పగల రోజు ఆడదానికి రావాలి.

    
    కోరిక చాలా పెద్దది.


    ఆలోచన దొడ్డదే.


    కానీ ఆ రోజు వస్తుందా?


    మారని వ్యవస్థ, కుళ్ళుగొట్టే సమాజం ఆడదాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా పాతాళానికి నెట్టేస్తున్న ఈ రోజులు ఎప్పటికి అధిగమించేను?


    ఇదంతా జరుగుతుందా?


    భ్రమ.


    వట్టి భ్రమ.


    అవంతి కిటికీలోంచి బయటికి చూసింది. చల్లనిగాలి రివ్వు రివ్వన లోపలికి దూసుకొస్తున్నది.


    దూరంగా లోకల్ ట్రైన్ వెళుతోంది. ఇంకా చీకటిపడలేదు.


    అవంతి క్షణంపాటు కళ్ళు మూసుకుంది.


    రెండే రెండు కన్నీటిబొట్లు చెంపలపైగా జారిపడినాయి.


    ఆ రోజు తండ్రి దగ్గరనించి ఉత్తరం వచ్చింది.


    ఆయనకీ మధ్య వంట్లో బాగోడంలేదు. తను పరీక్ష పాసయి పట్టా తీసుకొని, నల్లకోటు గౌనువేసుకోవడం ఆ ఎముకలగూడు, గోవిందరాజులు చూస్తాడా?


    ముప్పై అయిదేళ్ళుగా కోర్డు వరండాల్లో పెద్ద పెద్ద వకీళ్ళ ఫైల్ పట్టుకొని తిరిగిన ఆ అస్థిపంజరం కనీసం తనని ఒక్కసారైనా కోర్టులో మరో లాయర్ అవంతిగా చూడగలడా?

 Previous Page Next Page