Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 73


                 జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
       
                             ముప్పది మూడవ అధ్యాయము


1.    అస్యాజరాసో దమామరిత్రా అర్చద్ధూమాసో అగ్నయః పావకాః|
    శ్వితీచయః శ్వాత్రాసో భురణ్యవో వనర్షదో న సోమాః |

    అగ్నులు అక్షయములు. యజ్ఞగృహరక్షకులు. ధూమపరిలక్షితలు. శోధకులు. శ్వేతభస్మ రాశులవారు. రాక్షసాదులనుండి రక్షించువారు. ఇంధనస్థితులు. వాయు, సోమసములు.

    అగ్నులు యజమానికి ఇష్టప్రదులు అగుదురు గాత.

    2. అగ్నులు రసహరణశీలురు. ధూమపరిలక్షితులు. వారు వాయు ప్రేరితుల అయినారు. వేరు వేరుగా స్వర్గమునకు చేరు ప్రయత్నమున ఉన్నారు.

    3. అగ్నీ! మాకొరకు నీవు మిత్రావరుణులను యజింపుము. దేవతలను యజింపుము. నీవు బృహత్ ఋతమవు. నీవు నీయొక్క యజ్ఞగృహమున సహితము యజింపుము.

    4. అగ్నీ! నీవు దేవతలను ఆహ్వానించుటలో అత్యంత నిపుణుడవు. కుశలుడగు రథివలె ఆశ్వములను నీరథమునకు పూన్చుము. హోతవగుము. తూర్పున ఆసీనుడవు అగుము.

    5. ఉషా - రాత్రులు విరుద్ధరూపములవారు శుభమనోరథలు. ఒకే బిడ్డకు పాలిచ్చువారు. రసహారి అగ్ని ఉషయందు అన్నవంతుడు. రాత్రియందు దీప్తివంతుడు అగును.
   
    6. అగ్ని ఋత్విజులచే హవించబడువాడు. అత్యంతయాజకుడు. యజ్ఞములందు స్తుత్యుడు.  అందరి కన్న  ముందు అగ్ని యజ్ఞగృహమున   స్థాపించబడినాడు. భృగువు, అతని శిష్యులు కర్రలందును, జనులందును అగ్నిని కనుగొన్నారు. దానిని ప్రజ్వలింపచేసినారు.

    7. 33 కోట్ల 33 లక్షల 33 వేల మూడువందల ముప్పది మూడు మంది దేవతలు అగ్నిని అర్చింతురు. ఘృతాహుతులచే అగ్నిని తడిపెదరు. అగ్నికొరకు దర్భాసనము పరిచెదరు. దేవతల ఆహ్వానకర్త అగ్నిని వేదిమీద ఆసీనుని చేయుదురు.

    8. వైశ్వానరాగ్ని ద్యులోకపు శిరము వంటివాడు. భూమి యందంతటను వ్యాపించి ఉన్నవాడు. అతడు కవి. సామ్రాట్టు. యజమానుల అతిథి. జ్వాలాముఖమున స్రువమును గ్రహించువాడు. అట్టి అగ్ని ఋత్విజులు ముట్టింతురు.

    9. అగ్ని సమిద్ధుడు. శుభ్రుడు. ఆహుతులు అందుకొనువాడు. ధనదాత. అతడు స్తుతులకు ప్రసన్నుడగును. శత్రును వధించును.

    10. అగ్నీ! విశ్వేదేవతలు, ఇంద్రుడు, వాయువు, మిత్రుని తేజోసహితుడవై సోమమయ మధువును ఆస్వాదించుము.

    11.  అగ్ని మానవ పాలకుడు. వర్షము కలిగించుమని అగ్నికి తేజోవర్ధక హవి సమర్పించబడును. హవి అందుకున్న అగ్ని ద్యులోకమున మేఘములను కల్పించును. అగ్ని అనింద్య, మిశ్రమకారి, ధ్యాతవ్య బలమున మేఘజలమును కల్పించును, కురిపించును.

    12. అగ్నీ! జలవిక్రమమును ప్రదర్శించుము. ఉత్తమ ధనములు నీకు చెందవలెను. ఈ భార్యాభర్తలను అన్యోన్యులను చేయుము. శత్రువులు తేజోవంతులయినను వారిని ఓడించుము.

    13. అగ్నీ! అర్చనీయ స్తుతులచే మేము, నీవు అత్యంత గంభీరుని కోరుదుము గాత.

    మహా అగ్నీ! నీవు మా పిలుపు వినువాడవు. నీవు బలమునందు ఇంద్ర వాయుసముడవు. ఋత్విజులు నీకు
హవిరన్నములు సమర్పించుచున్నారు. సంప్రీతుని చేయుచున్నారు.

    14. సమ్యగాహుత అగ్నీ! ధనవంతుడు, బుద్ధిమంతుడు, ఆలమందలు గల యజమాని నీకు ప్రీతిపాత్రుడు అగును గాత.

    15. అగ్నీ! నీవు యాచకుల పిలుపు వినగల చెవులున్నవాడవు. నీవు హవ్యవాహనుడవు. నీవెంట ఉన్న దేవతల సహితుడవై మా ప్రార్థన ఆలకింపుము. మిత్రుడు - ఆర్యమ - ప్రాతః సవనమున హవిర్భాగములు అందుకొను ఇతర దేవతలు ధర్భాసనముల మీద ఆసీనులు కావలెను.

    16. యజనీయ దేవతలందరిలో అఖండ్యుడు, సమస్త మానవులకు అర్చనీయుడు, హవిస్వీకర్త, జాతవేది యగు అగ్ని దేవతలకు సుఖకరుడు కావలెను.

    17. మేము సవిత ఆజ్ఞయందు ప్రవర్తిల్లు వారలము. మిత్రావరుణుల విషయమున నిరపరాధులము. మహానుడు, సమిద్ధమానుడగు అగ్ని యొక్క అక్షయశరణమున ఉందుము గాత. నేడు మేము దేవతల అక్షయ రక్షణ కోరుచున్నాము.

    18. సుఖించు గోవులవలె సోమము వర్ధిల్లుచున్నది. ఇంద్రా! నిన్ను స్తుతించు వారలు యజ్ఞమునకు వెడలినారు. నియుత అశ్వముల సహితులైన అశ్వినుల వంటి నీవు మా యజ్ఞము వైపు సాగుము. నీవు సంస్తుతుడవై అన్నధనాదులు ప్రసాదించువాడవు కదా!

    19. గోవులారా! మీరు మమ్ము రక్షించండి. మహాయజ్ఞమునకు రూపకల్పన చేయు ద్యావాపృథ్వులారా! మీ చెవులు రెండు బంగారు మయములు. మీరు మమ్ము రక్షించండి.

    (బంగారు చెవులయినందున చక్కగా వినగలరు-భూరిగా ఇవ్వగలరని)

    20. నేడు సూర్యుడు ఉదయించినంత మిత్రుడు, ఆర్యను, సవిత భగుల ప్రేరణయే మాకు కర్తవ్యమగును.

    21. ఋత్విజులారా! శ్రీయు, ద్యావాపృథ్వుల అభిశ్రీయు, అభీష్ట సోమరసము అభిషుత మైనంత చషకములందు నింపండి. సోమమే నదుల మూలమగును.

    (నద్యుప కణ్ఠే హి సోమ్కోజాయత ఇతి ఉవటః)

    22. ఇంద్రుడు ఎంతో శోభిల్లుచున్నాడు. దర్భాసనమున ఆసీనుడై ఉన్నాడు. అతడు సకల స్తుతులచే అలంకరించ బడినాడు. అతడు సేచకుడు. ప్రాణదాత. మహామహుడు. సర్వస్వరూపుడగు ఇంద్రుడు అమృతము వంటి జల వర్షము కలిగించువాడు అగును.

    23. ఋత్విజులారా! ఇంద్రుని ఎరుగుదురా? అతడు గొప్పవాడు. సోమనోన్మత్తుడు, ఎల్లరిని మించినవాడు. సమస్తము ఇవ్వగలవాడు. సుయజ్ఞుడు. సుబలుడు. మహాద్యశుడు. ద్యావాపృథ్వులు సహితము అతనిని అర్చించును. మీరు ఆ ఇంద్రుని యజించండి.

    24. ఏయజమానులకు యువక ఇంద్రుడు మిత్రుడగునో వారి యజ్ఞసాధన ఇంధనాదులు మహత్తరములగును. వారిస్తుతులు అనేకములగును. వారి యూపము మహోన్నతమగును.

    25. ఇంద్రా! ఇటు రమ్ము. మాంస సహిత సోమమును సేవించుము. ఇంద్రుడు ఎంతో గొప్పవాడు. స్వబలము వలననే పూజించబడువాడు.

    26. బలనీతిగల ఇంద్రుడు వృత్రుని చుట్టుముట్టినాడు. వివిధరూపధారి, రణనీతిగల, మాయవి వృత్రుని ఇంద్రుడు సంహరించినాడు. వృత్రుని స్కంధహీనుని చేసి వధించిన ఇంద్రుడు వానిని జలమునందు వేసినాడు.

    ఇంద్రుడు యజమానుల స్తుతులను వెల్లడించినాడు.

    27. ఇంద్రా! నీవు ఉత్తమ పాలకుడవు. నీవు ఎంతో గొప్పవాడవు. అట్లయ్యు వంటరిగా ఎచటికి ఏగుచున్నావు? ఆవిధముగా ఏకాకివై సాగుటకు కారణమేమి? వంటరిగ సంచరించియు మంచి మాట్లాడుదువు!

    హర్యశ్వఇంద్రా! మమ్ము గురించి నీ అభిప్రాయమును వ్యక్తపరచుము.

    28. ఇంద్రా! మానవులు నిన్ను పూజించుచున్నారు. గోవులు కోరువారు, వర్షము కోరువారు నిన్ను పూజించుచున్నారు. తన సర్వస్వము ఇచ్చునదియు, అనేక పుత్రయు, సహస్రధారయునగు పృథ్విని పాలించగోరువారు నిన్ను పూజించుచున్నారు.

    29. ఇంద్రా! మాయజమాని ఇంద్రుని స్తుతించమన్నాడు. అందువలన మహామహుడవగు నిన్ను మహిమాన్విత స్తుతులచే స్తుతించుచున్నాను. శత్రుంజయుడగు ఇంద్రుని దేవతలు పానగోష్ఠులందు ప్రసన్నుని చేయుదురు.

    30. సూర్యుడు మహానుభావుడు. జ్వాలామయుడు. అతడు యజమానికి నిశ్చల ఆయువు ప్రసాదించును గాత. సోమమయ మధువు సేవించును గాత.

    సూర్యుడు వాయు ప్రేరితుడు. స్వయముగనే జనులను రక్షించువాడు. వారిని అనేక రీతుల పోషించువాడు. ద్యులోకమున ప్రకాశించువాడు.

    31. సూర్యుడు జాతప్రజ్ఞుడు. అతడు విశ్వమును చూడదలచినపుడు కిరణములు నేలకు దిగును.

    32. పానకవరుణరాజా! హవిరాదులు అందించు యజమానులను ఎంత దయతో చూతువో స్తోతలమైన మమ్ము కూడా అట్లే చూడుము.

    33. దైవీ అధ్వర్యులగు అశ్వినులారా! మీ సూర్యప్రభారథమున యజ్ఞమునకు విచ్చేయండి. మధుయజ్ఞమును కృతార్థము చేయండి.

    34. సూర్యుడు కీర్తనీయుడు. సకల ప్రాణులకు నేత.  సూర్యదేవా! మాస్తుతులు వినుము. యజ్ఞమునాకు విచ్చేయుము.

    అమరదేవతలారా! యజ్ఞము నందలి పానగోష్ఠిలో మీరు మహదానందమున ఉన్నట్లే మామీద దయ దాల్చి మా అశ్వపుత్రాదులను సంతృప్తులను చేయండి.

    35. పాపనాశక సూర్యా! నీవు సంపన్నుడవు. నేడు నీవు ఉదయించినంత మా హవిరాదులు నీకు అర్పితములు అగును గాత.

    36. సూర్యదేవా! నీవు దర్శనీయుడవు. తరింపచేయువాడవు. నీజ్యోతి కర్మపద కావలెను. నీవే ఈ సమస్తలోకములను వెలుగులచే నింపుచున్నావు - 'విశ్వమాభాసిరోచనమ్'

    37. ఇదియే సూర్యుని దేవత్వము. ఇదియే సూర్యుని మహిమ! అతడు ఎంతటి వానినైనను పనిని మధ్యలోనే నిలుపు చేయించును.

    సూర్యుడు తన రసహారిణీ కిరణములను, వానిసహవాస స్థానమగు - పృథ్వినుండి ఉపసంహరించినపుడు రాత్రి నల్లని వస్త్రము పరచును.

    38. మిత్రుని, వరుణుని చూచుటకని సూర్యుడు ద్యులోకమందు తనరూపమును వెల్లడించుచున్నాడు. ఈ సూర్యుని కిరణములు రెండు విధములు. ఒకవిధము తేజః స్వరూపములు, భిన్నములు, అనంతములు. రెండవ విధము కృష్ణస్వరూపములు.

    (నల్లనివి జరామరణాది వియుక్తములు)

    39. సూర్యదేవా! వాస్తవముగా నీవు మహామహుడవు. నీవు నిశ్చయముగా గొప్పవాడవు. నీతేజో మహిమ ఎంతో కీర్తనీయము. దేవమహాఁఅసి.

    40. సూర్యదేవా! నీవు కీర్తియందు గొప్పవాడవు. సత్యముగా గొప్పవాడవు. గొప్పవాడవు. ప్రాణవానుడగు సూర్యదేవర స్వమహిమ వలన దేవతలకు పురోహితుడు అయినాడు. అతడు వ్యాపక, అదమనీయ తేజో స్వరూపుడు.

    41. సూర్యుని ఆశ్రయించిన కిరణములే ఇంద్రుని ధనవర్షమును అందరకు పంచుచున్నవి. అట్లే బలములందు పుట్టిన ధనమును మా పుత్రాదులకని మేము ధరించుచున్నాము.

    42. దేవతలారా! నేటి సూర్యోదయమున మమ్ము పాపము- అపకీర్తినుంచి విముక్తులను చేయండి.

    మిత్ర, వరుణ, అదితి, సింధు, పృథ్వి, ద్యులోకములారా! మమ్ము నిష్పాపులుగను, అపకీర్తి రహితులుగను స్వీకరించండి.

    43. సూర్యుడు తన కృష్ణ ప్రకాశమున మానవులను - శుక్ల ప్రకాశమున దేవతలను, వారివారి స్థానములందు ప్రవర్తింపచేయుచు లోక, లోకాంతరములను దర్శించుచు - తన బంగారు రథమున సంచరించుచుండును.

    44. ఈ యజమానుల వేదిమీద దర్భాసములు పరచబడినవి. హవిరన్నము సిద్ధముగా ఉంచబడినది. ఉషా- రాత్రులు, నియుతాశ్వముల వాయువు, పూష-ప్రజాశ్రేయస్సు కోరు ప్రభువులవలె - యజ్ఞమునకు విచ్చేయుచున్నారు.

    45. ఇన్ద్ర వాయూ బృహస్పతిం మిత్రాగ్నిం పుషాణం భగమ్|
    ఆదిత్యాన్మారుతం గణమ్|

    వీరందరిని యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము.

    46. తనకున్న సమస్త రక్షణలతో వరుణుడు మమ్ము రక్షించును గాత. మిత్రుడు రక్షించును గాత. వారు ఉభయులు మమ్ము అన్నసంపన్నులను చేయుదురు గాత.

    47. ఇంద్ర, విష్ణు, మరుత్తు, అశ్వినులారా! మావారి మధ్యకు మీరందరు విచ్చేయండి.

    48.అగ్ని, ఇంద్ర, వరుణ, మిత్ర, మరుత, విష్ణువులారా! మాకు బలము ప్రసాదించండి. అశ్వినులు, రుద్రులు, దేవపత్నులు, పూష, భగుడు, సరస్వతి హవిస్సులు స్వీకరింతురు గాత.

    49. ఇన్ద్రాగ్నే మిత్రావరుణాదితిం స్వః పృథివీం మరుతః పర్వతాఁఆపః|  

 Previous Page Next Page