గురువారం రోజు సాయంత్రం విష్ణువును ఇలా పూజిస్తే వైవాహిక జీవితంలో సమస్యలు మాయం అవుతాయి..!
జ్యోతిషశాస్త్రంలో గురువారం దేవగురు బృహస్పతికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. గురువారం నాడు పూజ, పారాయణం, హవనము, దానధర్మాలు, ఇతర శుభ కార్యాలు చేయడం ద్వారా జాతకంలో దేవగురు బృహస్పతి స్థానం బలపడుతుందని చెబుతారు. జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే సాధకుడి వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఎందుకంటే దేవగురు బృహస్పతి వైవాహిక ఆనందానికి కారణమైన గ్రహం. గురువారం సాయంత్రం సరైన ఆచారాలతో విష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇది కాకుండా వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇందుకోసం గురువారం సాయంత్రం విష్ణువును ఎలా పూజించాలో తెలుసుకుంటే..
గురవారం విష్ణువును పూజించే విధానం..
గురువారం పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు దుస్తులు ధరించాలి.
శుభ్రమైన దుస్తులు ధరించాక ఇంటి అంతటా గంగా జలాన్ని చల్లుకోవాలి. దీని వల్ల ఇల్లు శుద్ది అవుతుంది.
ఇంట్లో పూజా స్థలంలో శ్రీ హరి విష్ణు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. తరువాత స్వామికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.
పసుపు పూల దండ, కొన్ని పువ్వులు సమర్పించాలి.
విష్ణు భగవానుని ముందు బియ్యం, అరటిపండు సమర్పించాలి.
విష్ణు భగవానుని ముందు స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించి, విష్ణువుకు సంబంధించిన విష్ణు స్తుతి, విష్ణు గాయత్రి, విష్ణు అష్టోత్తరం వంటి మంత్రాలను జపించాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. చివరిలో హారతి ఇవ్వాలి. అలాగే బృహస్పతి మంత్ర జపం చేయడం చాలా ముఖ్యం. ఇలా విష్ణువును ఆరాధించిన రోజు పేదలకు తోచినంత దానం చేయడం మంచిది.
*రూపశ్రీ.
