అమ్మవారికి సుగంద పరిమళాలు అంటే మహా ప్రీతి... ఇలా చేస్తే వైవాహిక జీవితం బలంగా ఉంటుంది!

విజయవంతమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. కానీ.. చాలామంది జీవితంలో వైవాహిక పరంగా దెబ్బతింటుంటారు. నేటి కాలంలో వైవాహిక బంధాలు నిలబడటం సమస్యగా మారింది. అయితే వైవాహిక బంధాన్ని బలపరిచి, జీవితాంతం అది బలంగా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలని జోతిష్య నిపుణులు, పురాణ పండితులు చెబుతున్నారు. ఇంతకీ వైవాహిక బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..
సుగంధ పరిమళాలు..
సుగంధ పరిమళాలు వైవాహిక జీవితాన్ని బలంగా మార్చడానికి చాలా సహాయపడతాయని అంటారు. అమ్మవారికి సుగంద పరిమళాలు అంటే మహా ప్రీతి. గులాబీ, మొగలి పరిమళం, మల్లె, జవ్వాది వంటి పరిమళాలు అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మ ఎంతో ప్రీతి చెందుతుంది.
వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే..
సువాసన వైవాహిక ఆనందానికి కారణమైన మొదటి గ్రహం అయిన శుక్రుడిని సమతుల్యం చేస్తుందట. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ మంచి సువాసనా భరితమైన సుగంధాలు పూసుకోవడం కూడా చాలా మంచిది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా బంధాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. అలాగే వైవాహిక బంధం సామరస్యంగా మారుతుంది.
పూజ సమయంలో సుగంధ పరిమళాలు..
పూజ సమయంలో దేవతలకు సుగంధ పరిమళాలు సమర్పించడం చాలా పవిత్రమైనదని పురాణ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడు, విష్ణువు, లలితా దేవి, పార్వతి అమ్మవారు.. ఇతర దేవతలకు సుగంధ పరిమళాలు సమర్పించడం వల్ల భక్తుల ప్రార్థనలు వారు వింటారని చెబుతారు. ఇది కోల్పోయిన సంపదను తిరిగి పొందడంలో సహాయపడుతుందని, జీవితంలో అదృష్టం కలసి వచ్చే అవకాశాలను పెంచుతుందని నమ్ముతారు.
కెరీర్, వ్యాపార పురోగతి..
ఏదైనా ముఖ్యమైన పని, వ్యాపార ఒప్పందం లేదా ఇంటర్వ్యూకి ముందు తేలికైన, స్వచ్ఛమైన, సహజమైన సుగంధాలను శరీరానికి పూసుకోవాలి. ఇది మానసికంగా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. సువాసన ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పెంచుతుందని, విజయం, గౌరవం, పురోగతికి తలుపులు తెరుస్తుందని చెబుతారు.
ఇంట్లో ఉద్రిక్తత, సమస్యలకు..
సాయంత్రం కర్పూరం, గంధపు చెక్క లేదా మొగలి వంటి సుగంధాల సువాసనను తేలికగా ఇంట్లో వేయాలి. దీన్ని ధూపంలా అయినా వేయవచ్చు. అయితే రసాయనాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది ఇంట్లో సానుకూలతను పెంపొందిస్తుంది.
శివుడికి సుగంధాలు సమర్పిస్తే..
శివుడికి ముఖ్యంగా సోమవారాల్లో, తెల్లటి పువ్వులతో పాటు, సుగంధాలు సమర్పించడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. పౌరాణిక నమ్మకాల ప్రకారం శివుడికి సుగంధాలు సమర్పించడం వల్ల కెరీర్‌లో స్థిరత్వం, జీవితంలో పురోగతి మాత్రమే కాకుండా శారీరక, మానసిక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం, ఒత్తిడి లేదా మానసిక వేదనతో బాధపడుతున్న వారికి ఈ పరిహారం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
*రూపశ్రీ.


