శివాలయానికి వెళ్లి చేయకూడని పని ఇదే!

మాఘమాసం అంతా శివుడి నామమే ఎక్కడ చూసినా… అయితే శివలయానికి వెళ్లడం అందరికీ అలవాటు. ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడం అందరికీ గొప్ప కార్యమే.. శివలయానికి వెళ్ళినపుడు చేయకూడని పని ఒకటుంది. ఈ పని తెలిసీ తెలియక చేశారంటే మనిషి తనలో ఉన్న శక్తిని పూర్తిగా కోల్పోతాడు. అసలు శివాలయానికి వెళితే చేయాల్సిన, చేయకూడని పని ఏమిటో తెలుసుకోండి.


శివమందిరంలో ప్రప్రథమంగా నందికి ప్రణమిల్లాలి. నిజానికి ఎద్దుకు బుద్ధి తక్కువని మన అభిప్రాయం. కానీ నంది జ్ఞానస్వరూపుడైన శివుణ్ణి మోయడంవల్ల అందరి పూజలందుకొనే అర్హత పొందింది. అలాగే మనం కూడా భగవత్ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో నిలుపుకోగలిగితే సర్వత్రా సన్మానింపబడతామన్నది దీని అంతరార్థం.


శివ నిర్మాల్యాన్ని దాటిన మానవుడు శక్తిహీనుడు అవుతాడు. దీనికి ఓ కథనం ఉంది.  పుష్పదంతుడనే గంధర్వుడు పుష్పాలను దొంగిలించే సమయంలో అజ్ఞానవశుడై, శివనిర్మాల్యాన్ని దాటాడు. ఫలితంగా అదృశ్యమయ్యే వాని శక్తి నాశనం అవుతుంది. శక్తి హీనుడు కాగానే అతడు భగవంతుడి మహిమను  గానం చేశాడు. అదే 'శివమహిమ్నః స్తోత్రమ్'. దానితో పుష్పదంతునికి తిరిగి శక్తి లభిస్తుంది.


మనం కూడా నిర్మాల్యాన్ని దాటకూడదు. అందుకే శివాలయానికి సంపూర్ణ ప్రదక్షిణ చేయరు. ఈ రహస్యాన్ని గ్రహించాలి. భగవంతుడికి అంకితమైన కార్యం, లేదా జీవనం ఈ శివ నిర్మాల్యంలోకి పరిగణనకు వస్తుంది. అలాంటి జీవన యాత్రలో ఉన్న మహాత్ముల, కార్యాల విషయంలో ఇష్టానుసారం మాట్లాడటం అంటే శివనిర్మాల్యాన్ని దాటడంతో సమానమే అవుతుంది. అలాంటి పాపకార్యాలను ఆచరించే వాడు ఎంతటివాడైనా సరే కొద్దికాలంలోనే శక్తిహీనుడు అయిపోతాడు. కాబట్టి భగవంతుడికి సంబంధించి, భగవంతుడికి సమర్పించాల్సిన వాటి విషయంలో , ఆ భగవంతుడికి సంబంధించిన ఇతర విషయాలలో.. మనిషి ఎల్లప్పుడూ సానుకూల భావనతో ఉండాలి. కేవలం తాను ఉండటం మాత్రమే కాదు. భగవంతుడికి సంబంధించి ఇతరులు పాటించే వేటినైనా సరే హేళన చేయడం, నిర్లక్యం చేయడం, చిన్నచూపు చూడటం చేయరాదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది దేవుడినే కించపరిచినట్టు అవుతుంది. దేవుడిని ఎప్పుడైతే అవమానపరుస్తామో.. అప్పుడు సమాజంలో అకాలమృత్యువు, కరువు కాటకాలు, భయాందోళనలు వ్యాపిస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రం స్పష్టం చేస్తోంది. .


శివుడు బాలచంద్రుణ్ణి శిరస్సుపై ధరించాడు. చంద్రుడు కర్మ యోగానికి ప్రతీక. యథార్థమైన కర్మయోగిని మాత్రమే ఆ పరమేశ్వరుడు తన శిరస్సు మీద ధరిస్తాడు. అంటే.. ఇక్కడ కేవలం చంద్రుడికి సంబంధించి మాత్రమే కాదు. మనిషిలో కూడా నిజమైన కర్మలు చేసేవాడిని, యధార్థంగా జీవించేవాడికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ వెన్నంటి ఉంటాడు.


                                    ◆నిశ్శబ్ద.
 


More Maha Shivaratri