రుద్రాక్షలు శక్తి కోల్పోవడానికి కారణాలు తెలుసా..

రుద్రాక్షలు హిందూ ధార్మిక సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనవి.   ముఖ్యంగా శైవమతంలో అవి శివుని అనుగ్రహానికి సూచికగా భావిస్తారు. శివుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలు అని చెబుతారు.   ఇవి ఎలియోకార్పస్ గణిత్రస్ (Elaeocarpus ganitrus) అనే చెట్టు ఫలాలు, ఇవి సాధారణంగా నేపాల్, ఇండియా, ఇండోనేసియా,  హిమాలయ ప్రాంతాల్లో లభిస్తాయి. రుద్రాక్షలకు చాలా  శక్తి ఉంటుంది. అయితే చాలా మంది వీటి శక్తి గురించి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి తెలియదు. ఈ కారణంగా రుద్రాక్షలు శక్తిని కోల్పోతూ ఉంటాయి.  రుద్రాక్షలు శక్తి కోల్పోవడానికి గల కారణాలు తెలుసుకుంటే..

రుద్రాక్షల శక్తి గురించి..

ఆధ్యాత్మిక శక్తి..

రుద్రాక్ష ధారణ వల్ల మనస్సు స్థిరత, ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇది శివుడి కృపకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

రుద్రాక్ష హృదయ రోగాలు, రక్తపోటు, మానసిక ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. ఇది శరీరంలో ప్రాణశక్తి (bio-energy) ని సమతుల్యం చేస్తుంది.

నెగటివ్ ఎనర్జీ నివారణ..

రుద్రాక్షలు ధరిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని నమ్మకం ఉంది. ఇది aura ని శుభ్రపరుస్తుంది, నెగటివ్ వైరేషన్‌లను నిరోధిస్తుంది.

చక్రాలపై ప్రభావం..

రుద్రాక్షలు మన శరీరంలోని ఏడు చక్రాలపై పని చేసి వాటిని సుస్థిరంగా ఉంచుతాయి. ఒక్కో రకం రుద్రాక్షకు ఒకో రకమైన శక్తి ఉంటుంది.

రుద్రాక్షలు శక్తి కోల్పోవడానికి కారణాలు..

శుద్ధి లేకుండా ధారణ చేయడం..

రుద్రాక్షను ధరిస్తే ముందు శుద్ధి చేసి పూజ చేయాలి. అలా కాకపోతే దాని శక్తి ప్రభావం తగ్గిపోతుంది.

శుద్ధి ఆచారాలను పాటించకపోవడం..

మాంసాహారం, మద్యపానం, అసభ్యమైన ప్రవర్తన వంటి విషయాలు రుద్రాక్ష శక్తిని హరించుతాయి.

సరైన ఉద్దేశం లేకుండా ధారణ..

ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే ధరిస్తే దాని ఫలితం ఉంటుంది. కేవలం ఫ్యాషన్‌గా ధరించితే అది పనిచేయదు.

పవిత్రత తప్పిపోవడం..

రుద్రాక్షను బాత్రూమ్, శ్మశానాలు వంటి అపవిత్ర ప్రదేశాలకు తీసుకెళ్లకూడదు. అలా చేస్తే శక్తి కోల్పోతుంది.

రుద్రాక్ష పగిలిపోవడం లేదా పాడవడం..

పగిలిన లేదా చీలిపోయిన రుద్రాక్ష శక్తిని కోల్పోతుంది. అలాంటివి ఇక ఉపయోగించరాదు.

రుద్రాక్ష శుద్ధి విధానం..

రోజూ తలనీల్చలి నీటితో శుభ్రపరచాలి

గంగాజలంతో తడపాలి..

ఓం నమః శివాయ అనే మంత్రంతో జపం చేయాలి.

శివలింగానికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ధరించాలి.

ముఖ్యమైన ద్రాక్షలు:

రుద్రాక్ష ముఖాలు,  వాటి ప్రయోజనాలు..

ఏకముఖి శివుని ప్రతీక, అత్యంత శక్తివంతమైనది

పంచముఖి సాధారణ ఉపయోగానికి, మనస్సు స్థిరతకు

షణ్ముఖి కార్థికేయుని అనుగ్రహం కలుగుతుంది.

ఏకాదశముఖి హనుమంతుడి శక్తి, భయ నివారణ, ఏకాదశ రుద్రుల అనుగ్రహం కలుగుతుంది.

14 ముఖి రుద్రాక్షను దేవమణి లేదా మహాశని రుద్రాక్ష అని కూడా అంటారు. ఇది అత్యంత శక్తివంతమైనది.   శివుడి మూడవ నేత్రం నుండి జాలువారిన కన్నీటి చుక్క అని దీన్ని చెబుతారు. ఇది ఆజ్ఞా చక్రానికి అధిపతిగా పరిగణించబడుతుంది.

                   *రూపశ్రీ.


More Enduku-Emiti