పూజకు ఏం కావాలంటే

 

 

ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రుల గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ సౌభాగ్యం కోసం.పిల్లలు తమ చదువు, సంధ్యల కోసం దుర్గను పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని పరితపిస్తుంటారు. 

 

శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే, శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. 

 

శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని, పరమేశ్వరుడు పగటి రూపం గలవాడని.. అందుచేత దేవిని రాత్రిపూట అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే రోజున అందరూ ఉదయాన్నే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. ఎర్రటి పట్టు వస్త్రములు ధరించి పూజకు ఉపయోగపడే వస్తువులను సిద్ధం చేసుకోవాలి.   

 

పూజకు ఏం కావాలంటే..? 

కలశముపై అలంకరించేందుకు ఎర్రటి వస్త్రము, దుర్గాదేవి ఫోటో (సింహవాహిని) లేదా దుర్గాదేవి ప్రతిమను పూజమందిరములో ఉంచాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులు, పోగడ పువ్వులతో దుర్గమ్మను అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యానికి పొంగలి, పులిహోర, దానిమ్మపండ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే దూదితో ఎర్రటి వత్తులుగా చేసి ఆవునెతితో దీపారాధనకు దీపం తయారు చేసుకోవాలి. 9 వత్తులతో ఆవునేతితో హారతిని సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయాలి. పూజకు ముందు దుర్గాదేవి అష్టోత్తరం, దుర్గాద్వాదళిత్రిశంనన్నామాలు, అర్జునకృత దుర్గాస్తోత్రము, దుర్గా సహస్రనామాలను పఠించాలి. శరన్నవరాత్రి రోజులలో విజయవాడ, అష్టాదశ శక్తిపీఠములు వంటి దుర్గాదేవి ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా ఆలయాల్లో దుర్గాదేవి అష్టోత్తర పూజ, కుంకుమార్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పూజచేసే సమయంలో ఆగ్నేయం వైపు తిరిగి ప్రార్థించాలి. నుదుట కుంకుమ ధరించి "శ్రీ మాత్రేనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత దీపారాధన, నైవేద్యం సమర్పించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులకు పసుపు, కుంకుమలతో పాటు రాహుకాలంలో దుర్గాపూజ, దేవీ లీలామృతం, దేవి స్తోత్రమాల వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా శుభం కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

 

దశమి ప్రాభవం

అశ్వని నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వయుజమాసము. శరదృతువులో ఇది మొదటి నెల. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులనీ ,దశమినీ విజయదశమి అని పండుగ చేసుకోవడం అనాదిగా ఉంది. తొమ్మిది రోజులు చేసుకునే పండుగ నవరాత్రి, దేవిని పూజిస్తారు కనుక శరన్నవరాత్రులని అంటారు.దీన్నే విజయదశమి అనీ పిలుస్తారు.    

 

శ్రీ రాముడు రావణునితో యుద్ధం చేయడానికి వెళ్ళిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు ,జగన్మాత మహిశాసురుడ్న్నివధించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు,అజ్ఞాత వాసం పూర్తి అయిన తరువాత విజయుడు జమ్మిచెట్టులో దాచిన ఆయుధాలను తీసుకుని శత్రువుల్ని ఓడించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని పెద్దలు చెప్తారు.

 

ఈ దసరా తొమ్మిది రోజులు సుమంగళి పూజ ,కుమారిపుజ చేస్తారు .పదేళ్లలోపు ఆడపిల్లలకు తలంటు పోసి ,పిండి వంటలతో భోజనంపెట్టి ,కొత్త బట్టలుపెట్టి సత్కరిస్తారు.ఇళ్ళలోను ,దేవాలయల్లోను ,కలశపూజలు ,చండిహోమాలు శాస్త్రబద్ధంగా చేస్తారు. మూల నక్షత్రం సప్తమినాడు సరస్వతి పూజ ,అష్టమి నాడు దుర్గాపూజ ,సప్తమి నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. విజయ దశమి నాడు కొత్తగా ఏదైనా పని ప్రారంబిస్తే ఆ పని విజయవంతం మవుతుందని విశ్వాసం.విజయదశమి సాయంత్రం శమి శమియతే పాపం అని జమ్మి చెట్టును పూజిస్తారు.

 


More Dasara - Navaratrulu