కార్తీక పూర్ణిమ...రావిచెట్టుకు పూజ చేస్తే పుణ్యం!

 

కార్తీకమాసంలో  కార్తీకపౌర్ణమి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నిండు చందమామ..అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. పండితుల ప్రకారం ఇవాళ చాలా మంచి రోజు. ఈ రోజు చేసే పూజా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలతో దివ్యమైన ఫలాలు మనకు అందుతాయి. ఈ ఏడాది నవంబర్ 26,27 తేదీల్లో కార్తీక పౌర్ణమి ఉంది. ఇది నవంబర్ 26, 2023 ఆదివారం మధ్యాహ్నం 3.53కు ప్రారంభం అవుతోంది. తిరిగి నవంబర్ 27,2023 సోమవారం మధ్యాహ్నం 02.45కి ముగుస్తుంది. అందువల్ల కొందరు ఆదివారం  చేసుకుంటే మరికొందరు సోమవారం చేసుకుంటున్నారు. సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కాబట్టి సోమవారం ఉదయం పవిత్ర స్నానం చేసి...ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలాలు దక్కుతాయని పండితులు అంటున్నారు. 

కార్తీక పౌర్ణమి సందర్బంగా సాయంత్రంవేళ దీపాలు వెలిగించడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని   అదృష్టం  కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు. తులసికోట వద్ద దీపం వెలిగించడం వల్ల ప్రతిపనిలో విజయం లభిస్తుంది. ఈరోజు వెలిగించే దీపాలకు తోడుగా చంద్రకాంతి ప్రసరిస్తూ..విశ్వశక్తులన్నీ కలిసి ఆధ్యాత్మిక శక్తిని మీలో ప్రవహింపజేస్తాయని సూచిస్తున్నారు. 

కార్తీక పౌర్ణమిని సోమవారం చేసుకునేవారు ఉదయం 4గంటల సమయంలో బ్రహ్మకాలంలో నిద్రలేచి..నదిలో పవిత్రస్నానం చేయాలి. ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. తర్వాత శివుడు, లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు ముందు నెయ్యితో దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. పువ్వులు చల్లుతూ, పూజ చేసి హారతి ఇవ్వాలి. తర్వాత ఉపవాసం ఉండాలి.

నేడు రావిచెట్టుకు పూజ చేస్తే పుణ్యం:

 
కార్తీక పౌర్ణమి సందర్బంగా రావిచెట్టుకు పూజ చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. రావిచెట్టుపై శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి ఉంటారని నమ్మకం. అందువల్ల భక్తులు రావిచెట్టు దగ్గర పూజ, అర్చన చేస్తుంటారు. 

ముందుగా రావిచెట్టు చుట్టూ శుభ్రం చేసి..బియ్యంపిండితో చిన్నగా ముగ్గు వేయాలి. తర్వాత పసుపు, గంధం వంటి వాటిని చెట్టు మొదట్లో వేయాలి. తర్వాత నువ్వుల నూనెతో 8 వత్తుల దీపం వెలిగించాలి. ఇప్పుడు రావిచెట్టు కొమ్మకు ఎరుపు రంగా దారాన్ని 12సార్లు  చుట్టాలి. నేడు రావిచెట్టును తాకినా...నాటినా..నీళ్లు పోసినా సమస్త పాపాలు తొలగిపోతాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. అంతేకాదు రావిచెట్టుకు పూజ చేయడం వల్ల ధనకనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుందని పండితులు అంటున్నారు. వివాహం కాని వేరు నేడు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లను దానం చేయాలి. పండ్లను పండితులు, పూజారులకు దానం చేయాలి.


 


More Karthikamasa Vaibhavam