• Prev
  • Next
  • రామచిలక తిట్టింది

    రామచిలక తిట్టింది

    రామచిలకలు ఉన్న షాపుకి ఒక వ్యక్తీ వచ్చి చిలకల్ని చూపించమన్నాడు.

    ఆ షాపు యజమాని, ఒక చిలకని చూపిస్తూ " ఇది చూడండి. ఈ రామచిలక చూడ్డానికి

    ఎంత బాగుందో అంత బాగా మాట్లాడుతుంది. దీని కుడికాలు పైకి ఎత్తితే నమస్కారమండీ

    అని ఎడమకాలు ఎత్తితే రండి..మీకు స్వాగతం అని అంటుంది " అంటూ ఆ చిలక గురించి

    వివరించాడు.

    " మరి రెండు కాళ్ళు ఒకేసారి ఎత్తితే ఏమంటుంది ? " అని సందేహంగా అడిగాడు

    ఆ వ్యక్తీ.

    " నోర్ముయ్యరా...! బుద్ధిలేని వెధవా ! రెండుకాళ్ళు పైకి ఎత్తితే కింద పడతాను " అని

    గబుక్కున చెప్పింది అ చిలక.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ వ్యక్తీ.

  • Prev
  • Next