• Prev
  • Next
  • కూలిపోయిన ఇంటికోసం

    కూలిపోయిన ఇంటికోసం

     

    ఇంటికోసం గాలిస్తున్నాడు కొత్తగా ఒక ఊరికి ట్రాన్స్ ఫరై వచ్చిన సుబ్బారావు.

    “మీరు గత నెలలో వచ్చుంటే మీకో మంచి ఇల్లు అద్దెకు ఇప్పించే వాడిని "అని సుబ్బారావు

    కొలీగ్ పరమేశం అన్నాడు.

    “ఇప్పుడు ఎవరైనా అందులోకి వచ్చేశారా ?” అడిగాడు సుబ్బారావు.

    “అబ్బే...పదిరోజుల క్రితం తుఫానులో కూలిపోయింది "అని చెప్పి గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు పరమేశం.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.

  • Prev
  • Next