• Prev
  • Next
  • Aahanagar Colony 19

    ఆహా నగర్ కాలనీ

    సూరేపల్లి విజయ

    19 వ భాగం

    "నువ్వేనా రివాల్వర్ రాంబోవి" అడిగాడు జడ్జి బోనులో నిలబడి వున్న రివాల్వర్ రాంబోని.

    "కాదు...వాడి బాబును"

    "వాట్...?"

    "లేకపోతే...ఏంటా ప్రశ్న....పుచ్చె లేచిపోగలదు" కోపంగా అన్నాడు రివాల్వర్ రాంబో.

    "నేను జడ్జిని" మరింత కోపంగా అన్నాడు జడ్జి.

    వెంటనే కోపంగా రివాల్వర్ జడ్జి వైపు గురిపెట్టాడు. జడ్జి కెవ్వుమని కేకవేసాడు. ఉలిక్కిపడి, కోపంగా జడ్జివైపు చూసి అన్నాడు రివాల్వర్ రాంబో.... "అంత చేటున కేకేందుకు వేసావు? ఝుడుసుకున్నావా? మరోసారి అలా గట్టిగా అరవొద్దు....ర్....సంఝే...."

    "ఝే..." అన్నాడు మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ జడ్జి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచాడు.

    "మిలార్డ్...."

    "ఎవరి లార్డు..." కోపంగా అడిగాడు రివాల్వర్ రాంబో.

    "మీలార్డ్...." అన్నాను మరింత కోపంగా చెప్పి. కొనసాగించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

    " "రివాల్వర్ రాంబో అనే వ్యక్తి, నాలుగేళ్ళగా నాలుగు రాష్ట్రాల పోలిసులను ముప్పుతిప్పలు పెట్టి, నలభై మందిని బెదిరించి, అనేక నేరాలకు పాల్పడ్డాడు. దయచేసి ఇతడ్ని ఏదో....ఒక సెక్షన్ కింద, కఠినంగా శిక్షించాలని మనవి చేస్తున్నాను."

    "ఏ సెక్షన్ కిందో చెప్పచ్చుగా....." జడ్జి అడిగాడు.

    " సిగ్గుగా తల వంచుకొని సెక్షన్ మరిచిపోయాను మిలార్డ్. ఈ మధ్య టీవి చూడ్డం ఎక్కువైంది."

    గ్యాలరిలో వున్న జనం నవ్వారు. రివాల్వర్ రాంబో సీరియస్ గ చూడ్డంతో కామ్ అయ్యారు.

    "నేరాలను అంగీకరిస్తున్నావా మిస్టర్ రాంబో...." అడిగాడు జడ్జి.

    "రివాల్వర్ రాంబో....అనండి."

    "యస్...."

    "మీకోసం ఎవరికైనా లాయర్ ని అపాయింట్ చేయించమంటారా."

    "నో..."

    "ఈ నేరాలు ఎందుకు చేసారు?"

    "నేరాలా....హ్హహ్హహ్హ.....నా మొదటి నేరం ఏమిటో తెలుసా మిలార్డ్....నా క్లాస్ మెట్, నా బెంచిమేట్ ఓ ముద్దు ఇవ్వమని అడిగాను. ససేమిరా ఇవ్వనంది. అప్పుడు మండింది....వెంటనే రివాల్వర్ చూపించి "ముద్దు" అడిగాను. పెదవులు పగుళ్లు పెట్టేలా కొరికింది. నాలుగు కుట్లు పడ్డాయి. ఆ కుట్లు వేసినందుకు ఫీజు అడిగాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇస్తానన్నాను. కుదర్దు...అన్నాడు. వాడికి నా రివాల్వర్ టేస్ట్ చూపించాను. ఆ తర్వాత...మసాలా దోశకు, ఎక్సట్రా చట్నీ కావాలని అడిగాను. దానికి ఎక్సట్రా ఛార్జీ చేస్తానన్నాడు. హోటల్ వాడు. అప్పుడు రివాల్వర్ చూపించి బెదిరించాను. ఒకసారి టైలర్ దగ్గరికి వెళ్ళి, చొక్కా గుండీ కుట్టిపెట్టమంటే, నా వైపు మిర్రి మిర్రి చూసి, నేనేమైనా ఫ్రీ గా చొక్కా గుండీ కుట్టిపెట్టడానికి నీ పెళ్ళాన్నా అన్నాడు. నాకు మండి రివాల్వర్ రాంబో చెప్పుకుపోతున్నాడు.

    "మీకి రివాల్వర్ ఎక్కడిది? "మెరీనా బోచ్ లో ముంత కింద పప్పు తింటుంటే, ఆవూద్ గిబ్రహీం మనిషోకడొట్టి, అర్జంటుగా దుబాయ్ వెళ్ళాలి. డబ్బుల్లేవ్....ఈ రివాల్వర్ కొంటావా?" అని అడిగాడు.

    అది ఆవూద్ గిబ్రహిం వాడిన రివాల్వర్ ఆట....అలా వాడి దగ్గర కొన్నాను. రివాల్వర్ కొంటే బుల్లెట్లు "ఫ్రీ" గాయిచ్చాడు. "మరి ఆరు బుల్లెట్లు తోనే ఇంతకాలం ఎలా మేనేజ్ అయ్యావు?" బుంగమూతి పెట్టి, చిలిపిగా అడిగాడు జడ్జి.

    "నేనెప్పుడు ట్రిగ్గర్ నొక్కలేదు. ఆ అవకాశం రాలేదు. పోనీ యిప్పుడు మీవైపు రివాల్వర్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కమంటారా?"

    "అమ్మా...ఆశ...రివాల్వర్...బుల్లెట్...వేనందుకు ఒప్పుకును."

    "సరే...సరే...త్వరగా తీర్పు చెప్పండి....ఆకలి దంచేస్తుంది."

    "జడ్జి పోలీసు అధికారివైపు తిరిగి "కర్ణుడికి కవచకుండలాలవలె, తనకూ రివాల్వర్ వుండాలన్నాడు. దీన్ని లాక్కునే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని చంపి, తాను చచ్చిపోతానన్నాడు."

    "ఓహ్...ఐసీ..." అని మళ్ళీ రివాల్వర్ రాంబో వైపు తిరిగి.... "నువ్వింకా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?"

    తల అడ్డంగా వూపి..." ఏమీ లేదు....కాకపోతే...నాకేశిక్ష వేసినా నా నుంచి రివాల్వర్ దూరం చెయ్యద్దు. అలా చేస్తే, తీర్పు ఇచ్చిన మిమ్మల్ని చంపి నేను పేల్చుకుంటా."

    జడ్జి భయంగా చూసి...ఓ కాగితం మీద బరా బరా జడ్జిమెంట్ రాసి....చదవసాగాడు.

  • Prev
  • Next