• Prev
  • Next
  • ఆహనగర్ కాలనీ - 24

    ఆహా నగర్ కాలనీ


         
    సూరేపల్లి విజయ


    24 వ భాగం

    రోడ్డు మీదికి వచ్చిన సాకేత్ కు వేడి వేడి ఇరానీ ఛాయ్ తాగాలని అనిపించింది.

    నాలుగడుగులు వేసి కుడివైపుకు తిరిగాడు.

    "కుష్క్ ఇనీ హోటల్" అన్న బోర్డు కనిపించింది. గబగబా లోపలికి వెళ్ళాడు.

    ఓ మూలనున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి సెటిలయ్యాడు.

    "ఎక్ ఛాయ్ " చెప్పాడు.

    "తెలుగులో చెప్పండి సార్" అన్నాడు టీ తెచ్చే కుర్రాడు.

    "ఆశ్చర్యంగా అతనివైపు చూసాడు.

    "అదేంటి...నీకు హిందీ రాదా?"

    "నాకే భాష వచ్చు" అనేది కాదు సార్...మనం తెలుగువాళ్ళం ఈ హోటల్ లో తెలుగులోనే

    చెప్పాలి."

    "అంటే ఒక్క తేనీరు" అని చెప్పాలా?

    'కాదు ఒక్క టీ అంటే చాలు....రోజు కొన్ని పదాలు ఇంగ్లీషులో వాడక తప్పదు. కానీ,

    మొత్తం ఇంగ్లీషులోనో, హిందిలోనో, మాట్లాడాల్సిన పని లేదు.

    చెన్నయ్ లో, తమిళ్ తప్ప మరో భాష మాట్లాడరు. తమిళ్ రాకపోతే మరో భాష.

    బెంగుళూరులో కన్నడంలో మాట్లాడుతారు. ఆ భాష రానివాళ్ళు వేరే భాష మాట్లాడుతారు.

    కాని, మన తెలుగువాళ్లు....తెలుగు వచ్చిన ఇద్దరు తెలుగువాళ్లు హిందీలోనో, ఇంగ్లీష్ లోనో

    మాట్లాడుతారు.'

    'ఒక్క చిన్న ప్రశ్నకు, విపులంగా సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.

    'నువ్వేం చదువుకున్నావు? సారీ...మీరేం చదువుకున్నారు?" అడిగాడు సాకేత్. అతడి

     విశ్లేషణ చూశాక, అతడ్ని ఏకవచనంతో సంభోధించాలనిపించలేదు.

    'అంతా ఇలా హోటళ్లలో పనిచేసి, మీ లాంటి వాళ్లని నలుగురిని చూసి నేర్చుకున్నాలే....'

    అనేసి వెళ్ళిపోయాడు.

    ఈలోగా టీ సాసర్ లో తెచ్చాడు. టీ సాసర్ నిండా ఉంది.

    "అదేంటి టీలో సాసర్ తెస్తే ఎలా తాగాలి....' అని అడిగాడు.

    ఎలా తాగాలో చూడమన్నట్టు చుట్టూ చూపించాడు. ఆ కుర్రాడు....

    అప్పుడు గమనించాడు సాకేత్.

    చాలామంది సాసర్ లో టీ పోసుకుని టేబుల్ మీదికి వంగి, నాలుకతో చప్పరించి

    తాగుతున్నారు.

    'ఛీ...' అనుకున్నాడు సాకేత్.

    'ఈ హోటలో ఇది స్పెషల్...ఇక్కడ ఇలానే తాగుతారు మీకు కావాలంటే కప్పు

    తీసుకువస్తాను. అన్నాడు ఆ కుర్రాడు.

    "వద్దులే..ఇలా తాగితే ఎలా వుంటుందో చూస్తాను...' అని తాను కూడా వాళ్ళలా తాగడానికి

     ట్రై చేసాడు.

    'కుడితి' తాగిన ఎఫెక్ట్ కలిగింది సాకేత్ కు. అందరి వైపు చూసాడు.

    చాలా కామ్ గా ఈజీగా తాగుతున్నారు.

    "ఎక్కడో మేగజైన్లో చదివిన విషయం గుర్తొచ్చింది సాకేత్ కు. ఆఫ్రీకాలోని ఓ మారుమూల

     వూళ్ళో ఓ వ్యక్తి పాతిక సంవత్సరాలుగా కేవలం కాళ్ళతో కాళ్ల మధ్య స్పూన్ పెట్టుకొని

     ఆహార పదార్థాలు తింటున్నాడట.

    ఒక్కొక్కరిది ఒక్కో అలవాటు. విచిత్రమైన అలవాటు అనుకున్నాడు.


    *         *            *

    సూరిబాబు మేడపైకి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. టీ పాయ్ మీద ఓ చీటీ వుంది.

    'స్టార్ నైట్. చూడ్డానికి సీటి వెళ్ళాను. చంటోడిని (బాబ్లూని) సేఠ్ చంపుతాలాల్ వద్ద తాకట్టు

    పెట్టాను. మీకు జీతం వస్తే, అయిదొందలు ప్లస్ వడ్డీ ఇచ్చి తాకట్టు నుంచి బాబ్లూని

    విడిపించండి."

    "మీ విధేయురాలు....

    పతివ్రత శిరోమణి అయిన మీ భార్య.

    అని ఉందా చీటిలో.

    నెత్తి నోరు మొత్తుకుంటూ ఒక్కటేతక్కువ.

    సేఠ్ దగ్గరకు వేల్లాలనుకొని "వద్దులే రెపోద్దున్నే తీసుకురావచ్చు. అంతవరకు ఆ సేఠ్ కర్మ

    అనుకున్నాడు సూరిబాబు.


     

  • Prev
  • Next