• Prev
 • Next
 • Rating:             Avg Rating:       857 Ratings (Avg 2.95)

  Aahanagar Colony - 25

  ఆహా నగర్ కాలనీ


        సూరేపల్లి విజయ


  25 వ భాగం


  షాపు కట్టేశాడు సేఠ్ చంపుతాలాల్.

  ఫ్రిజ్ లో కర్డ్ ప్యాకెట్లు తీసి వరుసగా కుర్చీల్లో కూర్చుని ఉన్న వాళ్ళకు ఇవ్వసాగాడు.

  చివరగా బబ్లూ దగ్గరికి వచ్చి 'బేబీ తిను...తిని కాస్త నా కాళ్ళుపట్టు' అన్నాడు. బబ్లూ

  మాట్లాడలేదు.

  "మాట్లాడు బేటా...పొద్దుట్నుంచీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీ మాటలు వినాలని

  ఉంది బేటా" అన్నాడు మురిపెంగా అతని బుగ్గలు నొక్కి అయినా మాట్లాడలేదు. నోట్లో

  నుంచి వేలు తీయలేదు.

  నోట్లో అలా అస్తమానం వేలు పెట్టుకుంటే ఆ వేలు చీకిపోయి తెగిపోతుంది' అన్నాడు సేఠ్.

  బబ్లూ నోట్లోంచి ఎలాగైనా వేలు తీయించాలనే ప్రయత్నంలో అయినా వేలు తీయలేదు

  బబ్లూ. ఒళ్ళూ మండిపోయి బలవంతంగా వేలు లాగాడు సేఠ్ చంపుతాలాల్.

  బబ్లూ గుర్రుగా సేఠ్ వంక చూసి, 'ఒరేయ్ దొంగనా కొడకా' అన్నాడు.

  'తప్పు బేటా....అలా అంటే చెడ్డ అర్థం వస్తుంది' బాబ్లూకు తెలియదేమోనని చెప్పాడు సేఠ్.

  'నాకు తెలుసురా దొబ్బపండు మొహం నువ్వూనూ' అన్నాడు బబ్లూ.

  'చుప్...చుప్ రహో' కోపంగా అన్నాడు సేఠ్.

  బబ్లూ నాన్ స్టాప్ గా తిట్లదండకం వినిపిస్తూనే ఉన్నాడు.

  అనవసరంగా తను పడుకున్న గాడిదను లేపి తిట్టించుకుంటున్నానేమో అనే ఫీలింగ్

  కలిగింది సేఠ్ కు.

  చుట్టూ ఉన్న వారంతా వినోదంలా చూస్తున్నారు. బబ్లూ పిల్ల రాక్షసుడిలా తిడుతూనే

  ఉన్నాడు. నిండా ఎనిమిదేళ్ళు లేవు వీడికెన్ని తిట్లొచ్చని, ఆశ్చర్యంగా చూస్తున్నాడు సేఠ్.

  ఓ అరగంట తర్వాత. "నీ కోదండం....నీ అమ్మకో దండం....మీ అమ్మ దగ్గర తీసుకున్న

  డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వెళ్ళిపో బాబూ' అంటూ ఆటో ఎక్కించి

  పంపించేశాడు.

  *        *         *

  'యురేకా....' అరిచాడు సియస్సార్.

  వంటగదిలో వంట చేస్తున్న చారుమతి, హాలులో టీవి చూస్తోన్న నమ్రత ఏకకాలంలో

  ఉలిక్కిపడ్డారు.

  "ఏముంది నాన్నా...' అంటూ తండ్రి ల్యాబ్ వైపు పరుగెత్తబోయేంతలోనే తండ్రే వీళ్ళకీ

  ఎదురొచ్చాడు.

  "ఏం కొంపలు అంటుకున్నాయని అలా అంత చేటువ అరిచేసారు." చారుమతి కోపంగా

  అంది.

  'నేనో కొత్త విషయం కనిపెట్టాను' మొహమంతా ట్యూబ్ లైట్ లా వెలిగిపోతుండగా అన్నాడు.

  "ఏంటో అది?" దీర్ఘం తీసి అడిగింది చారుమతి.

  "మనిషి  నీళ్ళల్లో పడి ఎందుకు చనిపోతాడు?" అడిగాడు భార్య వైపు చూసి.

  "ఒళ్ళు కొవ్వెక్కి" అంది చారుమతి కోపంగా.

  "నేను సీరియస్ గా అడుగుతున్నాను" అన్నాడు గంభీరంగా సీయస్సార్.

  "ఈత రాకపోతే, ఊపిరాడక చచ్చిపోతాడు. చెప్పింది నమ్రత.

  "కదా...అంటే ఈత రాణి మనిషి నీళ్లలో పడిపోతే, అతనికి ఈత రాదు కనుక చనిపోతాడు.

   

  అదే ఈత వచ్చిన మనిషి అయితే....?"

  "ఈదుకుంటూ బయటకు వచ్చి బ్రతికిపోతాడు" ఓపిగ్గా చెప్పింది నమ్రత.

  'గుడ్...వెరీగుడ్...నువ్వూ నాలా ఇంటిలిజెంట్. నీకు నా లక్షణాలు వచ్చాయి.

  'అద్సరే డాడీ...ఇంతకీ మీరు కనుకున్న విషయం...'

  'అదే...అదే చెప్పబోతున్నాను. అది చెప్పేముందు ప్రెస్ వాళ్ళని, టీవీ ఛానెల్ వాళ్లని

  పిలిస్తే బావుంటుందేమో.'

  'ముందు మాకు చెప్పండి డాడీ.' అంది.

  "ఆల్ రైట్...ఆల్ రైట్...మీ డాడీ మేధస్సుకు ముందు నీ ముందే ప్రదర్శిస్తాడు.' అది

  ఒక్కక్షణం ఆగి....

  'మనిషి నీళ్లలో పడితే ఈత రాకపోతే చచ్చిపోతాడు. ఈత వస్తే బ్రతికిపోతాడు. అలాగే ఓ

  దోమ కానీ, ఓ చీమ కానీ ఓ ఈగ కాని, నీళ్ళల్లో పడితే, వాటికి ఈత రాదు గనుక, అవి

  ఈత నేర్చుకోలేదు కనుక, వాటికి ఈత నేర్పేవాళ్ళు లేరు గనక, ఊపిరాడక

  చనిపోతాయి...ఇదిగో చూడండీ...అంటూ తన చేతిలో ఉన్న బేసిన్ ని చూపించాడు.

  ఆ బేసిన్ లో నిండా నీళ్లున్నాయి. వాటిలో ఓ ఈగ, దోమ, చీమ చచ్చిపడి వున్నాయి.

  'చూసారా....నెలరోజులుగా కష్టపడి సాధించి శోధించి, పరిశోధించి కనుక్కున్నాను. నా

  ప్రయోగానికి సహకరించి చచ్చిపోయిన ఈ ఈగ, దోమ, చీమలకు నా శ్రద్ధాంజలి' అన్నాడు.

  అందుబాటులో తల బాదుకోవడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూసింది నమ్రత.

  చారుమతి అయితే పిచ్చి చూపులు చూసి, 'ఈగ, దోమ, చీమ...ఈత రాక చనిపోయాయి.

  చీమ.....దోమ....ఈగ....ఈత రాక చనిపోతాయి..." అంటూ పిచ్చిదానిలా గొణుకోసాగింది.

  "మీ డాడీ ఎంత బ్రిలియంటో తెలిసిందా బేబీ...." అన్నాడు సియస్సార్.

  ఏడుపొక్కటే తక్కువైంది నమ్రతకు.

  'ఏంటో.....తన తండ్రి తెలివితేటలను చూసి మురిసిపోయి, ఆనందాన్ని

  తట్టుకోలేకపోతుంది.' అనుకుంటూ ల్యాబ్ వైపు నడిచాడు సియ్యస్సార్.


  *        *          *

  సాకేత్ రోడ్డు మీదకి వచ్చాడు.

  రాత్రి పది దాటింది.

  చల్లగాలి...మంచి వాతావరణం...ప్లజెంట్ ఫీలింగ్...మెయిన్ రోడ్ క్రాస్ చేస్తుండగా...ఓ

  ఆకారం కనిపించింది సూటుబూటుతో, టై కట్టుకొని...బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లా వున్నాడు.

  మొహానికి మంకీ క్యాప్ వుంది.

  అతడ్ని ఎక్కడో చూసినట్టూ అనిపించింది సాకేత్ కు.

  కానీ, ఆ చూసింది ఎక్కడో గుర్తు రావడం లేదు.

  అటూ, ఇటూ చూస్తూ నడుస్తున్నాడు.

  సాకేత్ లో ఏదో అనుమానం. అతడ్ని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

  సరిగ్గా అదే సమయంలో....

  ఆ కాలనీలోని ఓ ఇంట్లో... • Prev
 • Next