• Prev
  • Next
  • సరదాగా కాసేపు సీరియళ్ళ రియాక్షన్స్

    సరదాగా కాసేపు సీరియళ్ళ రియాక్షన్స్

    0

     

    కొన్ని పేపర్లలో ఈ రోజున పలానా సీరియల్ లో ఫలానా సంఘటన జరుగుతుందా అని

    వేస్తుంటారు కదా ! అలాంటివి ఇప్పుడు మీ కోసం ప్రతి సోమవారం అందిస్తున్న సరదాగా

    కాసేపు స్పెషల్లో ఈ వారం సీరియళ్ళ రియాక్షన్స్ అంటూ చదువుకొని హాయిగా

    నవ్వుకోండి.

      * కళ్ళు - కుళ్ళు అనే సీరియల్లో కార్తీక్ తెచ్చిన మల్లెపూలు కమల పెట్టుకుంటుందా

    లేదా?

    * రాంగ్ నంబర్ రంగనాథం సీరియల్లో సుబ్రహ్మణ్యం బ్యాంకుకు వెళతాడా లేదా ?

     * నా బతుకు - నా యిష్టం అనే సీరియల్లో పంకజం చెప్పుల షాపులో ఏ రకం చెప్పులు

    కొంటుంది ?

     * ఏం చేయాలి అంతా నా ఖర్మ అనే సీరియల్లో పనిమనిషి రంగమ్మ, సుజాత యింటికి

    వెళ్తుందా లేదా ?

     * విడిపోదామా - కలిసుందామా అనే సీరియల్లో వాణి తన భర్తతో కలిసి ఆటో

    ఎక్కుతుందా లేదా ?

     * గోడమీది పిల్లి అనే సీరియల్లో గోపి యింట్లో ఉన్న పిల్లి ఆ రోజు రాత్రి ఎలుకను

    పడుతుందా లేదా ?

     * పరకాయప్రవేశం అనే సీరియల్లో పూజారి ఎందుకు భయపడ్డాడు ?

  • Prev
  • Next