సిల్లీ ఫెలో - 70

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 70

- మల్లిక్

 

అతని మత్తు పూర్తిగా దిగిపోయింది.

బుచ్చిబాబు కళ్ళమీది కన్నీటి పొరమీద వెన్నెల కిరణం తళుక్కున మెరవడం సీత గమనించనే గమనించింది.


*                *                 *

వారం రోజులు గడిచిపోయాయి.

బుచ్చిబాబు, సీతకి మధ్య మాటలు లేవు. ఆనాటి సంఘటనతో బుచ్చిబాబు మానసికంగా గాయపడ్డాడు. నీకు బుద్దిలేదా, మనిషివికావా అని అన్న సీత మాటలు అతని అభిమానాన్ని దెబ్బతీసాయి.

సీతకి కూడా చాలా బాధ అనిపించింది. బుచ్చిబాబుతో అలా ప్రవర్తించి నందుకు. కానీ అలా అనకపోతే అతను ఆగేలా లేడు. ఇంకా... ఇంకా... ఇంకా... ముందుకెళ్ళేలా వున్నాడు. పెళ్ళికాకుండా బుచ్చిబాబుతో శారీరక సంబంధం అనేది ఏవిధంగా ఆలోచించినా ఆమె మనసు అంగీకరించడం లేదు.

పుట్టినప్పటి నుండీ మన సాంప్రదాయం, కట్టుబాట్లూ నరనరాన జీర్ణించుకుపోయిన అమ్మాయి అలాంటి విషయాన్ని ఎలా అంగీకరించగలదు? అప్పుడు బుచ్చిబాబు బాధ చూళ్లేక అతనితోపాటు విజయవాడ వచ్చేసిందిగానీ ఆమె ఆ విషయంలోని లోటుపాట్లు గురించి క్షుణ్ణంగా ఆలోచించలేదు.

తన ప్రవర్తన వల్ల బుచ్చిబాబు ఎంత గాయపడ్డాడో సీతకి తెలుసు.

అందుకే ఆమె తనే బుచ్చిబాబుని మాట్లాడించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ బుచ్చిబాబు ఊ... ఆ...అని తప్ప అంతకు మించి మాట్లాడ్డం లేదు. బుచ్చిబాబు మాట ఎలా వున్నా సీతకి మరీ బోర్ కొట్టేస్తోంది. ఎందుకంటే బుచ్చిబాబయినా ఆఫీసుకెళ్ళి ఆఫీసు పనిలో పడి అన్ని మర్చిపోతాడు. సీత ఒక్కర్తే ఇంట్లో ఖాళీగా వుండి లేనిపోని ఆలోచనలతో సతమతమవుతూ వుంది.

ప్రస్తుతం సీత హాల్లో నేలమీద చాపేస్కుని పడుకుంటోంది. బుచ్చిబాబు బెడ్రూంలో మంచంమీద....

పరిస్థితి ఇద్దరికీ నరకప్రాయంగానే ఉంది.

వారం క్రితం ఆ సంఘటన జరిగిన వెంటనే బుచ్చిబాబు సుందర్ కి వివరంగా ఉత్తరం రాసి అందులో తన బాధనంతా తెలుపుకుని నీవల్లే ఇలా జరిగిందని తిట్టాను కూడా తిట్టాడు. తన ఇంటి అడ్రస్ ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో తను ఏం చేయాలో కూడా సలహా ఇస్తూ ఉత్తరం రాయమన్నాడు.

సీతకి తన పరిస్థితి గురించి చెప్పుకోవడానికి నా అన్నవాలు ఎవరూ లేరు. ఒక్క రాధ తప్ప. అందుకే సీత కూడా రాధకి ఉత్తరం రాసి మానసికంగా తను అనుభవిస్తున్న బాధని ఆమెకి రాసింది. ఆరోజు బుచ్చిబాబు ఆఫీసుకు ఓ అర్థగంట ఆలస్యంగా వెళ్ళాడు. సీత వంట చెయ్యడం కాస్త ఆలస్యం అయింది. అందుకు! బుచ్చిబాబు ఆఫీసుకు వెళ్లేసరికి స్టెనో లిల్లీ తన సీట్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది.

"ఏంటి? ఏమైంది?? వాళ్ళాయనకేమైనా సీరియస్సా?" మోహన్ ని అడిగాడు బుచ్చిబాబు.

"ఆమెకసలు పెళ్ళి కాలేదు" చెప్పాడు మోహన్.

"అవునా? మరి ఎందుకు ఏడుస్తోంది? మంగారావు గాడు హత్తిరి అంటూ ఏమైనా తిట్టాడా?"

వాడెందుకు తిడ్తాడు? వాడికి కస్టమర్లంటే ఎంత ప్రేమో లిల్లీ అంటే అంతకు పదిరెట్లు ప్రేమ!"

"మరింకెందుకురా ఆ ఏడుపు సిల్లీగా?"

"అందుకే ఆ ఏడుపు! మంగారావుగాడికి పెంటకుర్రు ఊరికి ట్రాన్స్ ఫర్ అయింది. అది మోస్ట్ అన్ ఇంపార్టెంట్ బ్రాంచ్. అక్కడ కస్టమర్లూ, పై రాబడులూ ఏమీ ఉండవు.

"ఆహా నటరాజన్"

"ఏంటి? నటరాజన్నా! అంటే మన సీనియర్ ఎగ్జిక్యూటివా? అతనేనా వీడిని ట్రాన్స్ ఫర్ చేసింది?" కుతూహలంగా అడిగాడు మోహన్.

బుచ్చిబాబు కంగారు పడ్డాడు.

"నటరాజన్ అని అన్నానా? అయితే పొరపాటున అని ఉంటాను. నేను ఆ దేవుడిని తలచుకున్నా!" అని కళ్ళు మూస్కుని.

"ఆహా నటరాజా... ఏమి నీ లీల?" అన్నాడు మళ్ళీ పరవశంగా.

"ఇందులో లీలేముందీ?" వీడి గురించి హెడ్డాఫీసుకు ఎవరో కంప్లయింట్ ఇచ్చి ఉంటారు... వాళ్ళు వీడిమీద యాక్షన తీసుకుని ఉంటారు!"

"నేను మాత్రం కంప్లయింట్ ఇవ్వలేదు బాబోయ్... నాకేం తెలీదు!" అన్నాడు బుచ్చిబాబు భుజాలు తడుముకుంటూ.

"నేనిప్పుడు ఎవరన్నారయ్యా బాగ్బూ." మోహన్ విసుకున్నాడు.

"ఇంతకీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఎప్పుడొచ్చింది?"

"ఇప్పుడే... ఓ పావుగంట క్రితం! హెడ్డాఫీసు నుండి నటరాజన్ ఫోన్ కూడా చేసి ఈవేళ రిలీవ్ అయిపోయి రేపు పెంటకుర్రులో జాయిన్ అయిపోమని చెప్పాడట!"

బుచ్చిబాబు మనసులో చాలా సంతోషించాడు. వెధవకి మంచి శాస్తి అయ్యిందని. లిల్లీ అంతిదిగా ఏడుస్తుంటే పలకరించకపోతే బాగుండదని ఆమె దగ్గరకి వెళ్ళాడు బుచ్చిబాబు.